వద్దన్నా వదిలేస్తానా.. @11
మహిమ & విరాట్..
చైల్డ్ హుడ్ నుండి అంటే వాళ్ళిద్దరూ ఫ్రీకేజీ స్కూల్ నుండే విరాట్ మహిమ బెస్టేస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్..
విరాట్ మహి కన్నా రెండు సంవత్సరాలు పెద్దవాడు.. మహిమ ఎల్కేజీ లో స్కూల్ లో జాయిన్ అయినప్పుడు తను ఫస్ట్ క్లాస్ లో ఉన్నాడు..
మాములుగా స్కూల్ లో మొదలైన స్నేహం.. ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంత బలంగా మారింది.
విరాట్ అంటే తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు..!! తనకు అన్నయ్య తల్లి తండ్రి అన్ని విరాటే మహిమకి..
ఇక విరాట్ కి కూడా మహిమ అంటే జస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు..అతని జీవితంలో తల్లీ తర్వాత అంత ప్రేమించే, గౌరవించే స్థానం మహిమది..
పిల్లలు ఇద్దరిలో విడదీయలేని బాండింగ్ ఏర్పడడంతో.. విరాట్ ఫ్యామిలీ, మహిమ ఫ్యామిలీ కూడా అప్పుడప్పుడు కలుస్తూ.. రెండు ఫ్యామిలీస్ మధ్యలో కూడా మంచి బాండింగ్ ఏర్పడింది.
కాకపోతే విరాట్ ఫ్యామిలీ మొదటి నుండి కొంచెం రిచ్.. విరాట్ తాతగారు హయాంలోనే మంచి ఆస్తిపరులు కావడంతో.. భానుమతి పొగరుగానే ఉండేది.. డబ్బు లేని వాళ్ళ అన్న మిడిల్ క్లాస్ వాళ్ళ అన్న ఆమె కంటికి అస్సలు ఆనరు.
మహిమ ఫ్యామిలీ మిడిల్ క్లాస్.. మహిమ ఫాదర్ ఊర్లో ఉన్న అర ఎకరం పొలాన్ని అమ్మి.. సిటీకి వచ్చి తనకు ఉన్నంతలో ఓ చిన్న సూపర్ మార్కెట్ ని పెట్టుకొని సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నారు..
ఇక భానుమతి వాళ్లకి జనార్దన్ ఒక్కగానొక కొడుకు అవడంతో అతని చాలా గారాబంగానే పెంచారు. తన ఇష్టమైన చదువు చదివించి.. బిజినెస్ పెడతామంటే పెట్టుబడి కూడా లక్షల్లో ఇన్వెస్ట్ చేసారు.
భానుమతి ఆమె భర్త విశ్వనాథ్ ఊర్లోనే ఉంటే..విరాట్ తండ్రి జనార్దన్ సిటీలో బిజినెస్ పెట్టి మంచి లాభలతో దూసుకెళ్తూ సొసైటీలో టాప్ పొజిషన్ కి వచ్చాడు.