New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వద్దన్నా వదిలేస్తానా..? – 1

వద్దన్నా వదిలేస్తానా..? – 1

వద్దన్నా వదిలేస్తానా..? @1

వైజాగ్ లోని ఒక ఫేమస్ కల్యాణ మండపం..

ఎంట్రెన్స్ లోనే ఉన్న పెద్ద హోర్డింగ్ లో 
“విరాట్ వెడ్స్ అమృత” అని గుండ్రటి తెలుగు అక్షరాలతో నిండుగా రాసున్న పేర్లు.. ఆ పేర్ల వెనక ఉన్న చూడ ముచ్చటగా ఉన్న అందమైన జంట.
పెళ్లి కూతురు ఇంకా పెళ్లి కొడుకు ఇద్దరి కుటుంబాలు బాగా డబ్బున్న వాళ్ళే కావడంతో పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు.
లోకల్ పోలిటీషన్స్ తో పాటు, లోకల్ మీడియా కూడా ఉంది అక్కడ.
అదే మండపంలో దర్జాగా ముందు వరుసలో కూర్చున్న 70 ఏళ్ల పెద్దావిడ “ఒరేయ్ జనా…పుట్టి బుద్దేరిగాక ఇన్నాళ్ళకి రెండో మంచి పని చేసావురా.. 
మొదటిది నీ కొడుకుని కనడం అయితే, రెండోది ఆ కొడుకు పెళ్ళికి ఆ దరిద్రాన్ని ఇక్కడ లేకుండా చేయడం” అని తెగ మెచ్చుకుంది పెద్దావిడ భానుమతి.
“తల్లి మెప్పుకి జనార్దన్ ఓ పక్క సంతోష పడుతున్నా మరోపక్క కొడుకు జీవితంలో మళ్ళీ మళ్ళీ రాని సంతోష సమయంలో కూడా ఎన్నటికీ ఎవరూ పూడ్చలేని వెలితిని తానే తీసుకోచ్చానని బాధ..”
అందుకే మాట రూపంలో ఆవిడని సమర్ధించలేక చిన్నగా నవ్వి ఊరుకున్నారు ఆయన.
మండపంలో కావలసినవి అందిస్తున్న కోడలిని చూస్తూ.. “అసలు ఆవిడ గారు చక్కగా ఉంటే.. ఈరోజు నీకు నాకు ఇన్ని తిప్పలు ఉండేవా.?” కోడలిని దెప్పుతూ అంది భానుమతి.
ఆవిడ మాటలని ఈసారి అసలు పట్టించుకోవాలని అనిపించలేదేమో.. మౌనంగా అక్కడినుండి గెస్టులను రిసివ్ చేసుకోవడానికి వెళ్ళాడు జనార్దన్.
@@@
పెళ్లి కొడుకు రూమ్ లో..
అప్పటికే రెడీ అయ్యి ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న విరాట్.. మాటిమాటికి ఫోన్ చూస్తూనే ఉన్నాడు..
అది గమనిస్తున్న ఫ్రెండ్స్ “ఏంట్రా సిస్టర్ మెసేజ్ కోసమా..? “ అని నవ్విస్తుంటే..
“చ.. చ.. అది కాదురా.. మహి కాల్ కోసమ్ ఎదురు చూస్తున్నా..!! “ అన్నాడు విరాట్.
“రేయ్ విరాట్ మరి కాసేపట్లో నీ పెళ్ళిరా.. నువ్విప్పుడు ఎదురు చూడాల్సింది అమృత కాల్ కోసం, అమృత కోసం..!” అంటున్న సిద్ధార్థ్ వైపు కోపంగా చూసాడు విరాట్.
విరాట్ కోపం తెలిసిన మరో ఫ్రెండ్ కరణ్ అతన్ని కూల్ చేస్తూ.. “లీవ్ ఇట్ విరాట్.. వాడి గురించి మనకి తెలిసిందేగా.. వాడో వేస్ట్ ఫెల్లో “ అని నచ్చ చెప్పాడు కరణ్.
“రేయ్ నేను చెప్పినదాంట్లో తప్పేముందిరా.? నిజమేగా నేనంది.. వాడిప్పుడు ఆలోచించాల్సింది మహి గురించి కాదు “ అంటున్న సిద్దు మాటకి అడ్డు వస్తూ..
“ రేయ్ సిద్ధూ ముందు నువ్విక్కడినుండి పోబే “ అని తనను రూమ్ బయటకు లాక్కెళ్లాడు మరో ఫ్రెండ్ అరుణ్.
ఐదు నిమిషాల తర్వాత విరాట్ ఫోన్ కి ఓ నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది.
మహి ఏమో అనుకుని హ్యాపీగా ఫోన్ ఓపెన్ చేసి చూస్తే” ఆ మెసేజ్ ఫ్రమ్ తనకి కాబోయే భార్య అమృత” నుండి.
కొంచం డిసప్పోయింట్ ఫేస్ తో మెసేజ్ ఓపెన్ చేసిన తనకి “ వెల్కమ్ టూ మై రూమ్ మై డియర్ హాట్ హబ్బీ” అని ఉండడం చూసి.. నవ్వుకుని పెళ్లికూతురు రూమ్ కి వెళ్ళాడు విరాట్.
విరాట్ వెళ్లేసరికి ఆల్రెడీ తన రూమ్ లో ఉండే పెద్దవాళ్ళని బయటకు పంపించిన అమృత ఫ్రెండ్స్ ని బయటకు పంపడానికి తెగ కష్టపడుతుంది.
వాళ్లేమో కారణం చెప్తేనే వెళ్తామని కావాలని అక్కడే కూర్చున్నారు.
సరిగ్గా అప్పుడే ఆ రూమ్ లోమి విరాట్ రావడంతో అతన్ని చూసి.. “ఓహో ఇదా విషయం మరా మాట ముందు చెప్పాలి కదే.. “ అని ఆటపట్టిస్తూ వెళ్లిపోయారు.
వాళ్ళు వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసిన విరాట్ బోల్ట్ కూడ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి, అచ్చమైన పదారణాల తెలుగింటి పెళ్లికూతురు రూపంలో ఉన్న అమృతను చూసి విరాట్ గొంతులో గుటక పడింది.
ఇప్పటివరకు మేలి ముసుగులో ఉన్న అమృత, తనని పెళ్లికూతురుగా ముందు విరాట్ మాత్రమే చూడాలని పట్టు బట్టి అతణ్ణి పిలిపించి, అందర్నీ బయటకు తోసింది.
పట్టు చీరలో ఏడు వారల నగలతో బుట్టబొమ్మలా ఉన్న అమృతను చూస్తూ.. ఇన్నాళ్లు తాను చూసిన మిడ్డీ పిల్ల, ఇప్పుడు తాను చూస్తున్న బాపు బొమ్మ ఒక్కరేనా అన్న అనుమానం అతనిలో..
అలా చూస్తూనే ట్రాన్స్ లో అడుగులు వేస్తున్న విరాట్ పూర్తిగా అమృత దగ్గరికి రాగానే…” ఎలా ఉన్నాను విరాట్.? “ అని నవ్వుతూ అడిగింది అమృత.
“గార్జియస్.. అమ్ము నువ్వు నువ్వేనా..?” అన్నాడు విరాట్.
“విరాట్” అని సిగ్గుపడింది అమ్ము.
“బాబోయ్ అమ్ము ఇంకా షాక్ లు వద్దే.. ఇప్పటికే నిన్ను చీరలో చూసి నా గుండె ఆగి ఆగి కొట్టుకుంటుంది.. ఇప్పుడు నువ్వు సిగ్గు కూడా పడ్డావంటే.. ఇక ఆగడమే కొట్టుకోవడం ఉండదు “ అన్నాడు విరాట్.
“ విరాట్ “ అని కోపంగా చూసి “ ఏంటా మాటలు.? “ అని చిన్నగా అతని గుండెల మీద కొడుతుంటే..
“హేయ్.. ఆగవే.. అమ్ము ఆగు.. “ అంటూనే ఇంకా ఆగని అమ్ము చేతులు రెండు అతని ఒకే చేతిలో బంధించి మీదకి లాక్కున్నాడు ఒక్కసారిగా.
అంతే పూర్తిగా విరాట్ గుండెల మీద వాలిపోయింది అమ్ము.
అమ్ము నడుము చుట్టూ చేతిని బిగించి “ నిజంగా సూపర్ ఉన్నావే.. అచ్చం ఆడపిల్లలా “ అన్నాడు విరాట్.
“ఊహుహు విరాట్..” అని గారంగా బుంగమూతి పెట్టిన అమృతను చూసి నవ్వుతూ ఇద్దరి పెదాలు జత చేసాడు విరాట్.
@@@@

To be continued..

స్టోరీ నచ్చితే కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.. రెగ్యులర్ అప్డేట్స్ కోసం నన్ను ఫాలో చేయండి…