New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వద్దన్నా వదిలేస్తానా..? – 2

వద్దన్నా వదిలేస్తానా..? – 2

వద్దన్నా వదిలేస్తానా.. @2

అమ్ము నడుము చుట్టూ చేతిని బిగించి “ నిజంగా సూపర్ ఉన్నావే.. అచ్చం ఆడపిల్లలా “ అన్నాడు విరాట్.

“ఊహుహు విరాట్..” అని గారంగా బుంగమూతి పెట్టిన అమృతను చూసి నవ్వుతూ ఇద్దరి పెదాలు జత చేసాడు విరాట్.
పది నిమిషాల తర్వాత తన పెదాలు వదులుతూ.. “టూ టెంప్టింగ్ అట్టయిర్ పాప… మనమెందుకు అందరిలా ట్రెండ్ ఫాలో అవ్వాలి.. కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తే ఎలా ఉంటుంది.? “ అన్నాడు విరాట్ ఏదో అంతర్జాతీయ సమస్యలా ఫేస్ పెట్టి.
“ఏంటి విరాట్…? ట్రెండ్ ఫాలో అవ్వడం ఏంటి.? సెట్ చేయడం ఏంటి.?” అర్థం కాక కళ్ళు చిన్నవి చేసి అడిగింది అమృత.
విరాట్ తనను మరోసారి గట్టిగా హగ్ చేసుకుని, ఆమె మెడ వంపుల్లో తలను దూర్చి, “అంటే.. మరెంటంటే అమ్ము.. అందరు పెళ్లి చేసుకున్నాక శోభనం చేసుకుంటారు కదా.. మనం వెరైటీగా ఫస్ట్ ఆ శోభనం ఏదో చేసేసుకుని తీరిగ్గా రేపు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటది అంటావ్.?” అన్నాడు విరాట్ మత్తుగా ఆమె మెడమీద ముద్దు పెడుతూ.
“దరిద్రంగా ఉంటుంది..” అని ఫోన్ లో నుంచి అవుట్ స్పీకర్ లో వినిపించిన తండ్రి వాయిస్ కి టక్కున అమ్ముకి దూరం జరిగాడు విరాట్.
“డాడ్.. నువ్వెక్కడున్నావ్.? అని విరాట్ అయోమయం గా చుట్టూ చూసి అడుగుతుంటే.. , అమృతకి కూడా మావయ్య ఎక్కడున్నాడో అనే టెన్షన్ మొదలైంది.
అది ఎక్సపెక్ట్ చేసిన జనార్దన్.. “ఎక్కువ వెతక్కురా వెధవ.. నేను అక్కడ లేను ఫోన్ లో ఉన్నాను” అనడంతో రిలాక్స్ గా ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరూ.
ఇందాక అమ్ము మెసేజ్ చూసి పాకెట్ లో పెట్టుకునేప్పుడు బైమిస్టేక్ టచ్ అయింది ఫోన్.. అప్పుడే అది జనార్దన్ కి కలవడంతో.. లిఫ్ట్ చేసిన ఆయన కాసేపు హలో.. హలో అని అటునుంచి రెస్పాన్స్ లేక కట్ చేసే సమయానికి.. “ గార్జియస్ “ అన్న విరాట్ మాటలు వినబడ్డాయ్.
అమ్ము తనను కొడుతున్నప్పుడు ఆ నార్మల్ కాల్ కాస్త అవుట్ స్పీకర్ టచ్ అవడంతో.. విరాట్ ట్రెండ్ సెటర్ డైలాగ్స్ కూడా విన్నాడు. అదన్నమాట జరిగింది.
ఫోన్ లో అని తండ్రి చెప్పింది విన్నాక “సారీ డాడ్ బై మిస్టేక్ కాల్ “ అని కట్ చేయబోతుంటే..
“కాల్ కట్ చేయకుండా మర్యాదగా ఆ రూమ్ లోంచి బయటకు వచ్చి నీ రూంలోకి వెళ్ళరా “ అన్న జనార్దన్ మాటకి, ఉక్రోషంగా వెనక్కి తిరుగుతూ.. అమ్మును చూస్తుంటే అప్పడం చేయాలని ఉన్నా తప్పక ఉసురుమంటూ రూమ్ లోంచి బయటకు వచ్చాడు విరాట్.
వెళ్తున్న విరాట్ ఫేస్ చూసి తెగ నవ్వుకుంది అమ్ము.
@@@
విరాట్ మళ్ళీ తన రూమ్ కి వెళ్ళాక, పదిహేను నిమిషాలకి తాను ఎదురు చూస్తున్న కాల్ రావడంతో.. 
హ్యాపీగా లిఫ్ట్ చేసి “ఆల్ ది బెస్టే రాక్షసి.. ఈసారి కూడ కప్పు మనదే “ అని చెప్తున్న అతని మాట ఎదుటి వారు చెప్పింది విని మూగబోయింది.
“విరాట్..రేయ్ విరాట్ ఉన్నావా..?” అటునుండి కార్తీక్ పిలుపు విని, “హహ్ “ అన్నాడు విరాట్ ఉలిక్కిపాటుగా.
“సారీ రా విరాట్ ఈ టైమ్ లో చెప్పకూడదు అనుకున్న.. కానీ చెప్పాక తప్పలేదు..” కార్తీక్ మాటలు పూర్తి కాలేదు.. కాల్ కట్ చేసినట్టు వినిపించింది బీప్ సౌండ్.
విరాట్.. విరాట్.. అంటూనే ఉన్నాడు కార్తీక్.. కానీ అప్పటికే విరాట్ ఫోన్ అతని పాకెట్ లో ఉంటే.. అదే పాకెట్ లోకి చేరాయి వాలెట్, కార్ కీస్ తో పాటు పాస్ పోర్ట్ కూడా..
@@@
కాసేపటికి “ అబ్బాయిని తీసుకురండి “ అని పంతులుగారు చెప్పడంతో విరాట్ కోసం రూమ్ లోకి వచ్చిన వాళ్ళకి విరాట్ అక్కడ కనపడలేదు.
 కొద్దిసేపట్లోనే విరాట్ అక్కడ లేడు అనే విషయం అందరికి తెలిసిపోగా.. పెళ్లికూతురు రూమ్ లో ఉన్న అమృత.. తానే ఒంటరిగా బయటకు వచ్చి పీటల మీద కూర్చుంది.
“హే అమ్ము.. నీకేమైనా పిచ్చి గాని పట్టిందా..? నీకు కాబోయే వాడు అక్కడ పారిపోయాడు అని చెప్తుంటే నువ్వేంటి ఇంకా వెళ్లి పీటల మీద కూర్చుంటావు లేచిరా..! అంటున్నారు అమృత ఫ్రెండ్స్, ఇంకా కొంతమంది చుట్టాలు.
వాళ్లందరినీ కోపంగా ఓ చూపు చూసి.. “పంతులుగారు మీరు మంత్రాలు మొదలు పెట్టండి..! నా విరాట్ వస్తాడు నిన్న మెళ్ళో తాళి కడతాడు.!” అని స్థిరంగా చెప్పింది అమ్ము.
“అమృత నీకు ఆ విరాట్ పిచ్చి పట్టిందే..! ఓ పక్క వాడు లేడు అని చెప్తూనే ఉన్నా కూడా ఇంకా వస్తాడు తాళి కడతాడు అంటున్నావు.. పిచ్చిపిచ్చిగా వాగుకుండా మర్యాదగా లే.. “ అంటూ అమృత తల్లి ఆకాంక్ష ఆమె చెయ్యి పట్టుకుని లేపుతుంటే..
కదలకుండా అక్కడే కూర్చున్న అమృత, తన ఫోన్ తీసి విరాట్ కి కాల్ కలిపి స్పీకర్ ఆన్ చేసింది.
దాదాపు లాస్ట్ రింగ్ కి కాల్ లిఫ్ట్ చేసిన విరాట్.. “హలో అమ్ము” అన్నాడు కంగారుగా.
“ విరాట్ ఎక్కడున్నావ్..? ముహూర్తం దాటిపోతుంది త్వరగా రా.!” అంది అమృత.
“అమ్ము ఒక్కసారి నా మాట వినరా..”
“విరాట్ పది నిమిషాల్లో నువ్విక్కడ ఉండాలి.!”
“ప్లీజ్ అమ్ము అర్ధం చేసుకో నేనిప్పుడు రాలేను.. “
“విరాట్ కమ్ ఫాస్ట్..!”
“…. “
“విరాట్ వస్తున్నావా..? లేదా..?”
“అమ్ము “
“ వస్తావా.? రావా..? “
విరాట్ డీప్ బ్రీత్ తర్వాత  “రాలేను”
“నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఇలానే కూర్చుని ఉంటాను విరాట్.!”
అప్పటికే విరాట్ కాల్ కట్ అవడంతో.. అక్కడి వారి ఎగతాళి చూపులు అమ్ము మనసుని చీల్చుతుంటే.. 
మొండిగా అరగంట వరకు కూర్చున్న అమృత, విరాట్ కోసమ్ ఎదురు చూస్తూనే స్పృహ తప్పి నేలకి ఒరిగితే.. విరాట్ ఎక్కిన ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది..
@@@@
To be conducted..

స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి.. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి నన్ను..