మాయ సంధ్య ఫోటో వైపు చూస్తూ నాకు నీతో ఎలాంటి బాండింగ్ లేకపోయినా యూ ఆర్ లైక్ మై ఫస్ట్ మామ్ అండ్ ఐ మిస్ యూ అమ్మ నీ బ్లెస్సింగ్స్ ఎపుడు నాకు ఉంటాయని తెలుసు .ఇపుడు ఇంకొంచెం ఎక్కువ బ్లెస్ చెయ్ అమ్మా!! ఎందుకంటే ఫస్ట్ టైమ్ అన్నయ్య కి నచ్చని పని చేయబోతున్నా, అన్నయ్య లీడ్ చేస్తున్న లైఫ్ నాకే కాదు ఇంట్లో ఎవరికి నచ్చడం లేదమ్మా అది నీకు కూడా తెలుసు కదా అన్నయ్య గురించి డాడ్ చాలా బాధ పడుతున్నారు బట్ డాడ్ అది బయటకు చెప్పట్లేదు.
అందుకే ఏదో ఒక ప్లాన్ చేసి అన్నయ్య కి మ్యారేజ్ చేస్తే తప్పా ఫ్లాట్ కి వెళ్ళడం ఆపడు .ఈ విషయం లో నీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి అని కోరుకుంటూ కళ్ళు తెరవగానే కోమలంగా నవ్వుతున్న సంధ్య మొహం వైపు చూస్తూ చిన్నగా నవ్వి వెనక్కి తిరగ్గానే రేణుక చేతిలో స్వీట్ బౌల్ పట్టుకుని ఇది మీ పెద్దమ్మ ఫోటో దగ్గర పెట్టి అందరికీ నీ చేత్తో స్వీట్ తినిపించూ అనగానే మామ్ ఎన్ని సార్లు చెప్పాలి నీకు పెద్దమ్మ అనకు తను నాకు అమ్మ అని చిరు కోపంగా చెప్పి ఆ బౌల్ తీసుకుని సంధ్య ఫోటో దగ్గర పెడుతుంది .
నువ్వు చచ్చినా వీళ్ళ అందరి గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నావ్ కదే కట్టుకున్న భర్త దగ్గర నుంచి నాకు పుట్టిన నా కూతురి వరకూ అందరూ నీకే ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు అని సంధ్య ఫోటో వైపు కోపంగా చూస్తూ అంత లోనే తను హాల్ లో ఉందని గుర్తు చేసుకుని ఫేక్ స్మైల్ ఇచ్చి తను మాయ కోసం తీసుకుని వచ్చిన గిఫ్ట్ తీసుకుని వస్తుంది.
మెయిడ్ తీసుకుని వచ్చిన మరో స్వీట్ బౌల్ తీసుకుని నవ్వుతూ రేణుక వైపు చూడగానే హ్యాపీ బర్త్డే మాయ అంటూ నుదుటన ప్రేమగా ముద్దు పెడుతూ తను కూతురి కోసం ఎంతో స్పెషల్ గా చేయించిన మెస్సికా పింక్ ప్లాటినం బ్రెస్లెట్ గిఫ్ట్ చేస్తుంది .