New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వివాహం -1 – 2

వివాహం -1 – 2

జానకి గారు:- అభి ఏంటి వర్క్ చేసుకుంటున్నావు . ఇలా చేస్తే ఎలా నాన్న…..

     నీ పెళ్లి అయ్యి ఇంకా ఒక రోజు కూడా  కాలేదు. 
అభి:- అమ్మ, మీరు కోరు కున్నట్టుగా పెళ్లి చేసుకున్న ఇంకా ఎంటి ….. 
      నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకు. నన్ను వర్క్ చేసుకోని ప్లిస్…. 
జానకి గారు:- సరే నీ ఇష్టం, అప్పుడప్పుడు బయటికి రా ఒకే నా… 
అభి:- అలాగే…….. 
నీరజ:- వదిన, ఏంటి అలా ఉన్నావు. మా అన్నయ తో మాట్లాడాలని ఉందా…… 
ధరణి:- సిగ్గు పడుతూ, అదేం లేదు . 
నీరజ:- నీ సిగ్గే చెబుతుంది లే ,అన్నయ కి ఫోన్ చేయాన…… 
ధరణి:- అమ్మో, వద్దు వద్దు అండి…… 
నీరజ:- అయ్యో, వదిన ఎందుకంతా భయం, అయిన నన్ను నీరజ అని పిలువు చాలు. అయిన మనం ఇద్దరం ఒకే ఏజ్ కదా. నేను కూడా నిన్ను ధరణి అనే పిలుస్తాను. 
ధరణి:- నవ్వుతుంది……. 
నీరజ:- సరే, ధరణి అని అభి కి ఫోన్ చేస్తుంది…… 
అభి:- హలో, చెప్పు రా నీరు …… 
నీరజ:- హ, అన్నయ వదిన తో మాట్లాడతావ……. 
అభి:- చిరాకు వస్తున్న కంట్రోల్ చేసుకుని, నీరజ నేను వర్క్ లో ఉన్న తరువాత చేస్తా……… 
నీరజ:- పని రాక్షసుడు…… 
నీరజ:- ధరణి మేడమ్, అన్నయ వర్క్ లో ఉన్నాడు అంట తర్వాత చేస్తాను అని చెప్పాడు…. 
ధరణి:- ఏమి మాటలాడదు….. 
నీరజ:- ఫీల్ అయ్యావ….. 
ధరణి:- అబ్బే, అదేం లేదు….. 
నీరజ:- ఇంకేంటి విశేషాలు…. 
ధరణి:- ఏమి లేవు……. 
నీరజ:- నిద్ర వస్తుందా…….. 
ధరణి:- మెుహమాటంగా నవ్వుతుంది……… 
నీరజ:- పడుకో నువ్వు మళ్లీ తర్వాత ఏలాగు నిద్ర ఉండదు కదా……. 
ధరణి:- అలానే చూస్తుంది…….. 
నీరజ:- ఏమి లేదులే, పడుకో……… 
ధరణి:- సరే….. అని పడు కుంటుంది…
నీరజ బయటికి వస్తుంది…… 
జానకి గారు:- ఏమైంది, వదిన ని వదిలి వచ్చావు….. 
నీరజ:- పాపం, వదిన కి బాగా నిద్ర వస్తుంది అమ్మ, పడుకో మని చెప్పి వచ్చాను….. 
జానకి గారు:- సరే అయితే పడుకోని……. 
ధరణి అలిసి నందు వల్ల బాగా నిద్ర పడుతుంది….. 
జానకి గారు:- ధరణి, అమ్మా ధరణి లే తల్లి……. 
ధరణి:- సడన్ గా లేచి, సారి అత్తయ్య మెలకువ రాలేదు…… 
జానకి గారు:- అయ్యో, ఎందుకు సరిగా నిద్ర లేదు కదా అని నేను ఇప్పటి వరకు లేపలేదు. కాని ఏమి తినకుండ పడుకుని ఉన్నావు అని వచ్చాను…… 
ధరణి:- అత్తయ్య నాకు ఆకలిగా లేదు…. 
జానకి గారు:- ఏంటి, ఆకలిగా లేదా అసలు ఏం తిన్నావు అని, దా తిను….. 
ధరణి:- వద్దు అత్తయ్య….. 
జానకి గారు:- ఉండు నేను పెడతా అని
ధరణి కి తినిపిస్తారు….. 
ధరణి:- చాలా సంతోషపడి,కాంగా తింటుంది…… 
జానకి గారు:- సాయంత్రం మీ అమ్మ వాళ్ళు వస్తున్నారు, కార్యము ఉంది కదా….. 
ధరణి:- ఏదో తెలియని భయం కలుగుతుంది, కాని పైకి  సైలెంట్ గా నవ్వి ఊరు కుంటుంది……. 
జానకి గారు:- సరే ధరణి నేను వెళ్తున్న, 
ధరణి:- అలాగే అత్తయ్య….. 
జానకి గారు అభి దగ్గరకు వస్తారు… 
జానకి గారు:- అభి 
అభి:- హ, అమ్మ ఏంటి చెప్పు….. 
జానకి గారు:- ఏంటి, ఇంకా అలాగే ఉన్నావు, టైమ్ అవుతుంటే…… 
అభి:- దేనికి టైం అవుతుంది అమ్మ….. 
జానకి గారు:- అదేంటి అభి  కార్యము ఉంది కదా…. 
అభి:- పిచ్చ కోపం వచ్చింది, కాని అమ్మ ఏంటి నువ్వు పెళ్లి అన్నారు మళ్లీ ఇదా… 
జానకి గారు:- అది కాదు రా. 
అభి:- సరే అమ్మ రెడి అవుతాను.
జానకి గారు:- మనసులో ఇదేంటి వెంటనే ఒకే అన్నాడు…. 
అభి:- ఒకే అంటున్న… 
జానకి గారు:- నిజంగాన…. 
అభి:- హ… 
జానకి గారు:- సరే అని కిందకి వస్తారు… 
అభి తన మనసులో నా గురించి అమ్మ వాళ్ళ ని బాధ పెట్టకూడదు అని అనుకొని రెడి అవుతాడు….. 
జానకి గారు సంతోషంగా వస్తారు……. 
రాజారావు గారు:- అభి రెడి అవుతున్నాడ, వాడి అత్తంటి వాళ్ళు వచ్చేస్తుంటారు…….. 
జానకి గారు:- హ, రెడి అవుతున్నాడు అండి……… 
రాజారావు గారు:- హ, సరే అదిగో బావగారు వాళ్ళు వస్తున్నారు…… 
జానకి గారు:- రండి రండి అని ఎదురు వెళ్తారు… 
సుజాత, దేవేంద్ర గారు తమ చుట్టాలతో ధరణి ఇంటి లోకి వస్తారు……. 
రాజారావు గారు:- ఏంటి, బావ గారు ఇంత ఆలస్యం గా వచ్చారు…… 
దేవేంద్ర గారు:- చుట్టాలు అందరిని తీసికొని రావాలి కదా బావగారు….. 
జానకి గారు:- వదిన, ధరణి దగ్గరకు వెళ్దాం రండి…. 
సుజాత గారు:- అలాగే వదిన…… 
 ధరణి గది వైపు వెళతారు….. 
గది లో ధరణి ని నీరజ రెడి చేస్తుంటుంది……. 
నీరజ:- అబ్బా, వదిన ఎంత అందంగా ఉన్నావో, అన్నయ్య  నిన్ను ఇలా చూస్తే దెబ్బ కి ఫిదా అయిపోతాడు….. 
ధరణి:- సిగ్గు పడుతుంది… 
సుజాత గారు, జానకి గారు లోపలికి వస్తారు….. 
సుజాత:- ధరణి అని పిలుస్తారు… 
ధరణి:- అమ్మా, ఇప్పుడే వచ్చార…… 
సుజాత:- హ అవును అమ్మ…… 
జానకి:- వదిన నా కోడలు చూడు ఎంత అందంగా ఉందో…. 
సుజాత:- సంతోషముగా అవును వదిన….. 
జానకి:- ధరణి నుదిటి మీద ముద్దు పెడతారు……. 
సుజాత:- కూతురు ని చూసి ఎంతో మురిసి పోతారు…. 
       ధరణి:- సిగ్గు పడుతుంది ……. 
అక్కడ అభి గది లో
అభి:- రెడి అయి మళ్లీ తన పని చేసుకుంటాడు…… 
మనోజ్:- ఏరా ఏం చేస్తున్నావు……. 
అభి:- వర్క్ చేసుకుంటూన్న…. 
మనోజ్:- ఏంటి, రేయ్ బావ నీ పెళ్లి అయ్యి ఇంకా 24 గంటలు కూడా అవ లేదు….. 
అభి:- అయితే…. 
మనోజ్:- ధరణి చాలా మంచి అమ్మాయి రా తనని బాధ పెట్టకు రా…… 
అభి:- నేను ఎవరిని బాధ పెట్టడం లేదు రా అందరూ నన్నే ఇబ్బంది పెడుతున్నారు…. 
మనోజ్:-  నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు రా, నువ్వే ఇంకా అదే విషయాన్ని తలుచుకుంటూ ఉన్నావు…….. 
అభి:- సైలెంట్ గా ఉంటాడు……. 
మనోజ్:- సరే ఇంకా వదిలై……. 
అభి:- హ….. 
మనోజ్:- బాబు నేను ఇంకా ఆ టాపిక్ ఎత్తాను సరే నా…….. 
అభి:- నోరు మూసుకుని రేపు ఆఫీసు కి రా, ఉంటా బాయ్ అని కట్ చేసాడు……. 
మనోజ్:- వీడు మారడు….. 
కొంచెం సేపు తరువాత అభి తమ్ముడు వస్తాడు………… 
ఆకాశ్:- అన్నయ అమ్మ వాళ్ళు రమ్మంటున్నారు……… 
అభి:- హ వస్తున్న….. 
ఆకాశ్:- అన్నయ వదిన తో మాట్లాడవా ….. 
అభి:- ఒక లుక్ ఇస్తాడు….. 
ఆకాశ్:- సైలెంట్ గా హ వస్తున్న అని ఎస్కేప్ అయిపోతాడు……… 
అభి కిందకి వస్తాడు…. 
రాజారావు గారు:- రా అభి…. 
అభి:- హ నాన్న….. 
రాజారావు గారు:- అభి మీ మామగారు వాళ్ళు వచ్చారు……. 
ఇంతలో దేవేంద్ర గారు వస్తారు…. 
అభి:- ఎంత సేపు అయింది అండి వచ్చి…. 
దేవేంద్ర గారు:- ఇప్పుడే వచ్చాం అల్లుడు గారు …… 
అభి:- అభి అని పిలవండి ……. 
దేవేంద్ర గారు:- అలాగే బాబు….. 
     చుట్టాలతో ఎంతో సందడిగా ఉంది ఇళ్లు….. 
ఒక పక్క భోజనాలు జరుగుతున్నాయి…. 
చాలా సేపటికి ధరణి ని తీసుకు వచ్చారు… 
    అభి ఒక సారి చూసి ఊరుకుంటాడు…………… 
కానీ తన మనసులో ఈ అమ్మాయి నిజంగా అందంగానే ఉంది అని అనుకొని మళ్లీ అయిన అందరూ ఒకటే లే అని అనుకుంటాడు……. 
     అభి ముఖంలో చిరు నవ్వు లేదు, అందరూ ఉన్నారు అని మెుహమాటంగా నవ్వుతున్నాడు….. 
భోజనాలు ముగిసాయి….. 
జానకి గారు:- అభి నువ్వు వెళ్లు…. 
అభి:- సరే… 
జానకి గారు:- ధరణి నువ్వు ఈ గదిలోనికి వెళ్లు…. 
ధరణి:- అలాగే అత్తయ్య…. 
అందరూ ఒక్కొక్కరు వారి ఇంటికి తిరిగి వెళ్లి పోయారు… 
సుజాత గారు:- వదిన, టైం అవుతుంది…… 
జానకి:- హ , ధరణి దగ్గరకు వెళ్దాం రండి….. 
నీరజ:- వదిన టెన్షన్ గా ఉందా…. 
ధరణి:- లేదు… 
నీరజ:- నీ ఫేస్ చూస్తే నే తెలుస్తుంది….. 
ధరణి:- నవ్వు తుంది….. 
జానకి గారు, సుజాత గారు లోపలికి వస్తారు…. 
జానకి గారు:- ధరణి…. 
ధరణి:- అత్తయ్య చెప్పండి…. 
జానకి:- ఇదిగో ఈ పాలు తీసికొ ధరణి…… 
జానకి:- నీరజ వదిన ని తీసుకు వెళ్ళు….. 
నీరజ:- అలాగే అమ్మ…… 
      ఇద్దరు అభి గది వైపు వెళతారు…… 
ధరణి ని లోపలికి పంపిస్తారు……. 
ధరణి  టెన్షన్ గా రూమ్ అంతా చూస్తుంది.కాని ఎక్కడ అభి జాడ కనపడదు… 
ధరణి:- ఏరి, ఈయన ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటూ రూమ్ అంతా చూస్తుంది…. 
         చాలా అందంగా అలంకరించారు అనుకుంటూ అభి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది….. 
బాల్కనీ లో ఉంటాడు అభి….. 
అభి:- తను వచ్చింది అనుకుంటా, ఇప్పుడు నేను వెళ్లి ఆవిడ గారి తో మాట్లాడాల అంత లేదు….. 
ధరణి:- ఆయన వచ్చాక నేను మాట్లాడాలి అని అనుకుంటూ మంచం మీద కూర్చుంటుంది….. 
అభి:- నేను వెళ్లను అని అనుకొని, మళ్లీ నా రూమ్ అది నేను ఇక్కడ ఉండాల ఏంటి, లోపలికి వెళ్లి హాయిగా పడుకుంటా అనుకొని లోపలికి వస్తాడు….. 
ధరణి:- అభి ని చూసి సడన్ గా లేచి సిగ్గు తో తల దించుకొని ఉంటుంది……. 
అభి దగ్గరకు వస్తు ఉంటాడు. 
ధరణి:- టెన్షన్ గా….. 
అభి వచ్చి ధరణి దగ్గర నించుటాడు….. 
ధరణి:- ఏవండి పాలు అని ఇస్తుంది……… 
అభి:- నాకు వద్దు…… 
ధరణి:- ఒక సారి గా తల పైకి ఎత్తి మళ్లీ పాలు అండి అంటుంది……. 
అభి:- నీకు ఏమైన చెవుడు ఉందా , నాకు పాలు వద్దు అర్థం అయిందా……. 
ధరణి కి ఏమి అర్థం కాదు…. 
ధరణి:- మనసులో ఈయన ఏంటి ఇలా మాట్లాడుతున్నారు
అభి:- అర్థం అయిందా, నేను పడుకోవాలి తప్పుకో……. 
ధరణి:- సరేనండి…… 
అభి:- నువ్వు ఎక్కడ పడుకుంటావు…… 
ధరణి:- అలా చూస్తుంది…. 
అభి:- నీకు ఏది అంత తొందరగా అర్థం కాద ఏంటి, నువ్వు మంచం మీద పడుకుంటావ లేదా ఆ సోఫా లో పడుకుంటావ అని అంటాడు….. 
ధరణి:- అంటే అది మరి నేను అని తడబడుతుంది…. 
అభి:- ఏంటి….. 
ధరణి:- నేను సోఫా లో పడుకుంటాను అండి….. 
అభి:- మంచిది….. 
ధరణి:- ఏం జరుగుతుందో ఏమి అర్థం కాదు…. 
అభి:- బెడ్ మీద పడుకుని పోతాడు…. 
ధరణి సోఫా దగ్గరకు వెళ్లి కూర్చుని ఆలోచిస్తూంది….. 
ధరణి:- ఏంటి ఈయన ఇలా అంటున్నారు. నేను ఆయనతో చాలా చెప్పాలి, చాలా మాట్లాడాలి అనుకుంటే, అసలు నాతో ఏం మాట్లాడడం లేదు….. 
      ఎన్నో ఆలోచనలు తనని నిద్ర పోనియ్యడం లేదు……… 
ధరణి:- అలిసి పోయి ఉన్నారు కదా అందుకే మాట్లాడడం లేదేమో అని అనుకొని నిద్ర పోతుంది….. 
అభి:- ఛ! నా రూమ్ లో ఈ అమ్మాయి ని చూస్తుంటే నాకు పిచ్చ కోపం వస్తుంది……. 
         
           అయిన నా కర్మ కాకపోతే నాకు ఈ దుస్థితి పట్టింది……. 
         అనుకొని నిద్ర పట్టక లేచి బాల్కనీ లోకి వెళ్తాడు……. 
ధరణి కి సడన్ గా మెలకువ వచ్చి లేచి కూర్చుని బెడ్ వైపు చూస్తే అభి కనిపించడు…. 
ధరణి:- మళ్లీ ఎక్కడికి వెళ్లి పోయారు అనుకొని చుట్టు చూస్తుంది…. 
     బాల్కనీ డోర్ తీసి ఉండడంతో అక్కడే ఉన్నారు అని కూర్చుని ఉంటుంది…. 
     ధరణి కూర్చునే నిద్ర పోతుంది…… 
చాలా సేపటికి అభి వచ్చి నిద్ర పోతాడు…. 
మధ్య రాత్రి లో లేచి కూర్చుంటుంది ధరణి….. 
ధరణి:- అయ్యో ఇదేంటి ఇలా పడుకుని ఉన్న, ఆయన వస్తే ఏలా ఉంటుంది…… 
      పక్కకి తిరిగి చూస్తే అభి నిద్ర పోతూ ఉంటాడు….. 
ధరణి:- ఈయన ఎప్పుడు వచ్చారు, నన్ను ఇలా చూసి ఏం అనుకున్నారో , అని తనని తానే తిట్టుకుంటుంది…….. 
అలా ఇద్దరు సరిగా నిద్ర పోరు…….. 
తెల్లవారు జాము 5 గంటలకు…… 
ధరణి:- ఇంక నిద్ర పట్టక లేచి కూర్చుంటుంది, టైం 5 అవుతుంది…. 
       తను లేచే టైం కూడా కావడంతో లేచి బాల్కనీ లోకి వెళ్లి అక్కడ ఊయల లో కూర్చుని ఉంటుంది……. 
ఉదయం 6 అవడంతో అందరూ లేస్తారు….. 
జానకి గారు:- ధరణి ని లేపాలి అని పైకి వస్తారు…. 
       ధరణి, ధరణి అని పిలుస్తారు…… 
ధరణి:- అత్తయ్య పిలుస్తున్నారు అనుకుంటూ డోర్ తీస్తుంది…. 
జానకి:- ధరణి ని అలా చూసి ఆవిడ  , సాన్నం చేసి రా కిందకి అని చెప్తారు……. 
ధరణి:- అలాగే అత్తయ్య….. 
జానకి:- తొందరగా రా ధరణి…. 
ధరణి:- హ సరే అత్తయ్య…………. 
జానకి గారు కిందకి వెళ్తూ వీడు ఎప్పటికి మారతాడో ఎంటో అనుకొని బాధ గా వెళ్తారు….. 
        ఆ బాధ ని బయటికి కనిపించకుండ మేనేజ్ చేస్తూ ఉంటారు….. 
          ధరణి సాన్నానికి వెళ్లి వచ్చి చీర కట్టుకుంటూ ఉంటుంది…… 
                 అభి అప్పుడే నిద్ర లేస్తాడు….. 
ధరణి:- ఇప్పుడు ఏలా అనుకుంటూ వెనుకకు తిరిగి ఉంటుంది……. 
         అభి అసలు కనీసం చూడను కూడా చూడకుండ జీమ్ వైపు వెళ్లి పోతాడు……. 
ధరణి:- దేవుడా అనుకొని చీర కట్టుకుంటుంది……… 
అభి:- ఏంటి ఈ పిల్ల, నా ముందు ఎక్స్పోసింగ్ చేస్తుంది….. 
   
           ఇంక ఎన్ని రోజులు లే….. 
ధరణి:- అత్తయ్య తొందరగా రమ్మని చెప్పారు, లేట్ చేయకూడదు అని రెడి అయి కిందకి వెళ్తుంది…… 
          కిందకి వస్తున్న ధరణి ని చూసి….. 
జానకి:- రా ధరణి అనీ వంట గది వైపు తీసికొని వెళతారు….. 
         ధరణి  నీకు స్వీట్ చేయడం వచ్చా….
ధరణి:- హ, వచ్చు అత్తయ్య……. 
జానకి:- సరే నీకు వచ్చిన స్వీట్ చేసి తీసుకు రా, సరే నా……… 
ధరణి:- సరే అత్తయ్య….. 
జానకి గారు నవ్వి అక్కడనుండి నుండి వెళతారు…… 
ధరణి:- ఏం స్వీట్ చేద్దాం అనుకుంటూ, హ సేమియా కేసరి చేస్తాను….. 
      స్వీట్ తయారు చేయడం మెుదలు పెడుతుంది……. 
     ఇంతలో నీరజ కూడా రెడి అయి వస్తుంది………. 
నీరజ:- అమ్మ, వదిన ఎక్కడ….. 
జానకి:- కిచెన్ లో ఉంది, స్వీట్ తయారు చేస్తుంది….. 
నీరజ:- అలాగా నేను కూడా వదిన కి హెల్ప్ చేస్తా అని ధరణి దగ్గరకు వస్తుంది…….. 
నీరజ:- ఏవండోయ్ ధరణి గారు స్వీట్ తయారు చేస్తున్నార…… 
ధరణి:- హ, అవునండి నీరజ గారు……. 
      ఇద్దరు నవ్వుకుంటారు……… 
నీరజ:- ధరణి మేడమ్ ,రాత్రి అని ఆట పట్టిస్తుంది…… 
ధరణి:- సైలెంట్ గా సిగ్గు పడుతుంది….. 
నీరజ:- నీ సిగ్గే చెపుతుంది లే…….
ధరణి:- ఏం చెప్పను నీకు అని మనసులో అనుకొని పైకి నవ్వు తుంది…..
జానకి:- ధరణి అయి పోయిందా ….
ధరణి:- హ, అయింది అత్తయ్య….. 
జానకి:- సర్వింగ్ బౌల్స్ లో వేసి తీసుకురా ధరణి….. 
ధరణి:- అలాగే అత్తయ్య…… 
జానకి:- సరే, నీరజ వదిన కి హెల్ప్ చేయ్….. 
నీరజ:- హ సరే నమ్మ…… 
     అభి రెడి అయి కిందకి వస్తాడు….. 
జానకి:- అభి టిఫిన్ చేయ్, రా కూర్చో….. 
అభి:- లేదు అమ్మ నేను వెళ్లాలి…… 
రాజారావు:- ఎక్కడికి అభి………… 
అభి:- ఆఫీసు కి నాన్న….. 
రాజారావు:- అప్పుడే ఆఫీసు ఏంటి అభి…… 
         ఇంకో 2 రోజులు ఆగి వెళ్లు…….. 
అభి:- లేదు నాన్న అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్లాలి తప్పదు డాడీ…… 
రాజారావు:- సరే ఇంక నీ ఇష్టం…… 
జానకి:- టిఫిన్ చేసి వెళ్లు….. 
    ఇంతలో ధరణి, నీరజ స్వీట్ తీసికొని వస్తారు…… 
జానకి:- అభి, టిఫిన్…… 
అభి:- నాకు వద్దు అమ్మ….. 
జానకి:- కనీసం ఈ స్వీట్ అయిన తిని వెళ్లు….. 
       నీ భార్య చేసింది రా తిని వెళ్లు…… 
  
     ధరణి ఇవ్వమ్మ………. 
ధరణి నవ్వుతూ అభి కి ఇస్తుంది……… 
అభి:- నాకు వద్దు, నేను వెళ్లాలి టైం అవుతుంది అని బయటికి వెళ్లి పోతాడు……. 
ధరణి:- బాధ పడుతుంది….. 
జానకి:- ధరణి, వాడికి మీటింగ్ ఉంది అంటా, నువ్వు బాధ పడకు….. 
ధరణి:- నేను ఏమి బాధ పడలేదు అత్తయ్య… 
జానకి:- నవ్వుతూ మీ మరిదికి , అన్నయ కి, మావయ్య కి అందరికి ఇవ్వు ధరణి….. 
ధరణి:- అలాగే అత్తయ్య….. 
     అందరూ స్వీట్ చాలా బాగుంది అని చెబుతారు…… 
ధరణి:- నవ్వు తుంది….. 
   కాని తన మనసులో ఈయన ఏంటి ఇలా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది…….. 
           ఇంకా ఉంది………….