వివాహం -1 – 3
అభి బయటికి వచ్చి కారులో ఆఫీసు కి బయలు దేరుతాడు…..
తన మనసు ఎన్నో రకాలు గా ఉంది, కోపం వస్తుంది, తన కోపాన్ని ఎవరి మీద చూపించాలో తేలిక, కోపం తోనే 5 నిమిషాల లో ఆఫీసు కి చేరుకున్నాడు…..
ఆఫీస్ మెుత్తం చాలా నిశబ్దం గా ఉంది……
అభి:- ఇదేంటి ఎవరు లేరు 9 అవుతుంది, నేను ఇన్ని రోజులు లేను అని వర్క్ అంతా వదిలేశారు అనుకుంటా, వస్తారు కదా అప్పుడు ఉంటుంది అని కోపంతో ఉంటాడు……
లైట్ ఆన్ చేస్తాడు, ఒకసారి గా ఎంప్లాయీస్ హ్యాపీ మారేడ్ లైఫ్ సార్ అని అరుస్తూ కేక్ తీసికొని వస్తారు……
అభి:- ఏంటి ఇదంతా అని కోపంగా అంటాడు……
మనోజ్:- రేయ్, అరవకురా చూడు అందరూ ఏలా చూస్తున్నారో, వాళ్ళు సార్ కి వెల్కం చెబుతాము అంటే సరే అని చెప్పాను…
వాళ్ళ ముచ్చట ఎందుకు కాదని అనడం అని అంటాడు….
మనోజ్ వైపు సిరియస్ గా చూసి….
అభి:- చూడండి గాయ్స్, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు, ఒకే వెళ్లి వర్క్ సంగతి చూడండి అని చెప్పి మనోజ్ ని తన క్యాబిన్ కి రమ్మని చెప్తాడు…..
మనోజ్:- అయిపోయాను వీడి చేతిలో అనుకొని స్టాఫ్ వైపు చూసి వీళ్లు బాగానే ఉన్నారు, నా పని గోవింద అనుకుంటూ, దేవుడా కాపాడు అనుకొని లోపలికి వెళతాడు……
అభి విండో వైపు నుంచుని కోపాన్ని ఎవరి మీద చూపాలో తేలిక గోడ ని గట్టిగా కొడతాడు….
మనోజ్:- అభి, అది కాదు రా మన వాళ్ళు అడిగారని సరే అన్నాను, స్వారి రా బావ అని చెపుతాడు…..
అభి:- నాకు ఇష్టం లేని పనులు చేసి, మళ్లీ సారి ఏంటి రా, వాళ్ళు అలాగే నువ్వు అలాగే నన్ను టార్చర్ చేయాడానికే ఉన్నారు మీరంతా…..
మనోజ్:- సైలెంట్ గా ఉంటాడు…..
అభి:- ఇంకోసారి ఇలాంటి చెత్త పనులు చేస్తే, ఫ్రెండ్ వని కూడా చూడను, చేసావను కో నా చేతిలోనే నీకు చావు తప్పదు ఇడియట్……
మనోజ్:- నేను చేయను రా నాయనా, రోజు రోజుకు నీ సైకో ని బయటికి తీస్తున్నావు….
పాపం నా చెల్లీ ఏలా భరిస్తుందో ఏంటో అని అంటాడు….
అభి:- ఏంటి!!
మనోజ్:- మనసులో అను కోవాల్సినవి పైకే అనేసానా , లేదు రా బావ నీకు ఇష్టం లేని పనులు నేను చేయను, సరే నా……
అభి:- చేస్తే నువ్వు ఉండవు కదా, వెళ్లి పని చేసుకో పో…
మనోజ్:- అలాగే సార్……. అని సాగ దిస్తాడు……
అభి ఒక లుక్ ఇస్తాడు, దెబ్బ కి ఫోన్ వచ్చినట్లు, ఆ వస్తున్న అంటూ బయటికి వెళ్లి పోతాడు…….
అభి:- ఇడియట్……
మనోజ్:- వీడు ఎప్పుడు మారతాడో అని అనుకొని తన కాబిన్ కి వెళ్లి పోతాడు……
రోజంతా ఆఫీసు పని లో నిమగ్నమై పోతాడు అభి…….
ధరణి కాసేపు నిద్ర పోతుంది, సడన్ గా లేచి
ధరణి:- ఆయన భోజనం చేసారో లేదో, ఉదయం టిఫిన్ కూడా చేయకుండానే వెళ్లి పోయారు అని అభి గురించి ఆలోచిస్తూ ఉంటుంది…..
సడన్ గా ధరణి, ధరణి అంటూ నీరజ వస్తుంది……
నీరజ:- ధరణి అమ్మ నిన్ను పిలుస్తుంది అని అంటున్న పలకకపోయే సరికి, ధరణి ని కదుపుతుంది……
ధరణి:- ఉలికిపడి హ చెప్పు, ఏమైంది ఎప్పుడు వచ్చావు…….
నీరజ:- అంతలా అరుచుకుంటూ వస్తే నీకు వినపడలేదా …….
ధరణి:- ఏదో ఆలోచిస్తున్న లే…….
నీరజా:- అన్నయ గురించేగా నువ్వు ఆలోచించేది, సాయంత్రానికి వచ్చేస్తాడు లే అని ఆట పట్టిస్తుంది….
ధరణి:- నేను ఆయన గురించి కాదు అని అంటుంది…….
నీరజ:- సరే లే, దా అమ్మ పిలుస్తుంది అని చెబుతుంది…..
ఇద్దరు కిందకి వస్తారు……
జానకి:- ధరణి రా భోజనం చేద్దాం, నువ్వు నేను నీరజ ఉన్నాము అని అంటుంది………
ధరణి:- క్షమించండి అత్తయ్య నిద్ర పట్టేసింది…..
జానకి:- పిచ్చి పిల్ల అంత మాత్రనికే క్షమించడం ఏంటి ధరణి, నువ్వు నాకు కోడలే కాదు కూతురు కూడా, నాకు నీరజ ఎంతో నువ్వు కూడా అంతే, రా తిందాం అని కూర్చోపెడతారు……
ధరణి వాళ్ళ అమ్మ వాళ్ళు గది లో విశ్రాంతి తీసుకుంటారు…..
సుజాత:- వదిన గారు మేము ఇంకా బయలుదేరుతాము…..
ధరణి ని తీసుకు వెళ్ళాలి అని ఉంది, ఒక రెండు రోజులు పంపిస్తారా అని అడుగుతుంది…..
జానకి:- నా కోడలు మీద అప్పుడే బెంగ పెట్టుకున్నార, వస్తుంది లే వదిన ఒక రెండు రోజులు తర్వాత, మా చుట్టాలు కూడా ఉన్నారు కదా అని అంటుంది….
సుజాత:- సరే వదిన పంపించండి తర్వాత మేము బయలుదేరుతాము అని అంటుంది…..
జానకి:- సరే వదిన జాగ్రత్తగా వెళ్లి రండి…..
దేవేంద్ర :- సరేనండి బావ గారు, మేము వెళ్లి వస్తాం….
రాజారావు:- అలాగే బావ గారు…..
ధరణి కూడా చెప్పి అక్కడ నుండి సెలవు తీసుకుంటారు సుజాత, దేవేంద్ర గారు…….
ధరణి:- అత్తయ్య గారు నేను సాన్నం చేసి వస్తాను……
జానకి:- అలాగే, అయిన నాకు చెప్పాలా చెప్పు అని నవ్వు తుంది…..
ధరణి:- అమ్మకి చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది అత్తయ్య అని అంటుంది……..
జానకి:- సరే, వెళ్లు అని అంటుంది…..
ఇంతలో ధరణి అంటూ వస్తుంది నీరజ…..
జానకి:- ధరణి ఏంటి తను నీకు వదిన అలా పిలవకూడదు…..
నీరజ:- అమ్మా, మేము ఇద్దరం ఎప్పుడో ఫెండ్స్ అయిపోయాము లే, అయిన నా ఏజ్ తన ఏజ్ ఒకటే,తనని వదిన అని ఎందుకు పిలవడం అని అంటుంది…………
జానకి:- సరే మీ ఇష్టం, ఎవరైనా ఉంటే మాత్రం వదిన అని పిలువు, సరే నా…….
నీరజ:- హ, సరే అమ్మ, నేను తన కోసం వచ్చాను, నువ్వు మధ్య లో ఆపేశావు.
జానకి:- తీసుకు వెళ్ళు అని అంటారు……
నీరజ:- ధరణి మేడమ్ వెళదామా అని అంటుంది…..
ధరణి:- అలాగే మేడమ్ వెళ్దాం పదండి అని నవ్వు తుంది……
వీళ్ల ఇద్దరిని చూసి నవ్వుతారు జానకి గారు……
నీరజ:- రా తొందరగా అని లాక్కుని వెళుతుంది…..
ధరణి:- ఆగవే బాబు వస్తున్న అని అంటుంది…..
నీరజ:- ఒకసారి గా తిరుగుతుంది ధరణి వైపు…..
ధరణి:- స్వారి ఏదో సడన్ గా అనేసాను అని చెపుతుంది…..
నీరజ:- అంత లేదు, నోరు మూసుకుని రావమ్మ అని తీసుకు వెళుతుంది………
నవ్వుకుంటూ ఇద్దరు కలిసి ఒక రూమ్ లోకి వెళతారు…….
ఆ రూమ్ లో వినోద్, ఆకాష్ కూడా ఉంటారు………
వినోద్:- రా ధరణి నీతో అసలు మాట్లాడడం కుదరడం లేదు, ఏలా ఉంది కొత్త ఇల్లు అని అంటాడు………
ధరణి:- పర్వాలేదు అన్నయ అలవాటు చేసుకోవాలి కదా అన్నయ అని నవ్వుతూ చెపుతుంది…….
ఆకాష్:- ఎందుకు వదిన నీకు భయం, ఈ ఆకాష్ ఉండగా భయమేలా , వదిన నిన్ను అన్నయ ఏమైన అంటే నాకు చెప్పు నేను చూసుకుంటా సరేనా అని అంటాడు……..
వినోద్:- బావ రా ఇప్పుడే వచ్చావ అని అంటాడు…..
ఆకాష్:- సడన్ గా లేచి ఎక్కడ ఎక్కడ అన్నయ అని కంగారు పడతాడు…..
వినోద్:- అంత భయపడే వాడివి నీకు ఎందుకు రా అంతా బిల్డప్ అవసరమా చెప్పు అని నవ్వుతాడు……..
ఆకాష్:- ఎందుకు బావ అలా వదిన దగ్గర బుక్ చేసావు, ఏదో చెపుతుంటే మెుత్తం పాడు చేసావు…….
వినోద్:- నీకు సెట్ అయ్యే పనులు చేయారా అంతే అని అంటాడు……
ఇంతలో
నీరజ :- వదిన ని పిలవమని మీ ఇద్దరు కొట్టుకుంటారే, అసలు ఎందుకు పిలవమని చెప్పారు నన్ను అని అంటుంది……
వినోద్:- మనమిద్దరము తర్వాత చూసుకుందాం అని ఆకాష్ తో అని, చెప్పు ధరణి ఏంటి విశేషాలు అని అడుగుతాడు……
ధరణి:- మీరే చెప్పాలి అన్నయ……..
వినోద్:- మీ ఆయన పని రాక్షసుడు తిన్నాడో లేదో నువ్వే అడగాలి అని అంటాడు……
మధ్య లో ఆకాష్ కలగ చేసుకుని ,
ఆకాష్:- అబ్బా, బావ అన్నయ గురించి వదిన మెల్లగా తెలుసుకుంటుంది లే గాని, వాడి గురించి వదిలేస్తే నేను వదిన తో మాట్లాడాలి, తమరు కాస్త కామ్ గా ఉంటార అని అంటాడు……
వినోద్:- మాట్లాడు బాబు, నీ సంగతి తర్వాత చెప్తాను రా అని అంటాడు……
ఆకాష్:- పోవోయ్ అని, వదిన రా కూర్చో నీతో చాలా మాట్లాడాలి అని, అవును వదిన నువ్వు ఒకదానివేనా నీకు అన్నయ, తమ్ముడు, పోని చెల్లి లేరా వదిన అని ఆపకుండా అడుగుతాడు…….
ధరణి:- లేరు ఆకాష్….
ఆకాష్:- అవునా, కనీసం చెల్లి అయిన ఉంటే బాగుండేది వదిన అని అంటాడు….
వినోద్:- ఏరా చెల్లి ఉంటే నువ్వు ట్రై చేసుకోవచ్చు అనా నీ ప్లాన్ అని అంటాడు……
ఆకాష్:- గా చూస్తూ నువ్వే మాట్లాడుకో, నన్ను మాట్లాడ నివ్వవు లే గాని ఎందుకు……
వినోద్:- అది కాదు రా, సరే కామ్ గా ఉంటాలే అని అంటాడు…….
ఆకాష్:- ఇంకేంటి వదిన……
వినోద్:- నువ్వు చెబుతున్నావు కదా మళ్లీ తనని అడుగుతావే …..
ఆకాష్:- సిరియస్ గా బావ నువ్వు మాములు వాడివి కాదయ్యా బాబు, నిన్ను మా నీరు ఏలా భరిస్తుందో గాని, మా అక్క దేవత అని అంటాడు……
వినోద్:- ఆహ అవునా బాబు మీ నీరు నన్ను భరించడం లేదు, నేనే తనని భరిస్తూన్న అని అంటాడు…….
ఆకాష్:- బావ ఒకసారి అటు చూడు అని అంటాడు…….
కోపంగా చూస్తూ ఉంటుంది నీరజ……….
నీరజ:- ఏంటి నేను మిమ్మల్ని టార్చర్ చేస్తున్నానా, అయిపోయారు నా చేతిలో అని పరిగేడుతుంది……
అప్పటికే వినోద్ పరిగేడుతాడు…….
ధరణి, ఆకాష్ ఇద్దరు నవ్వు కుంటారు……..
నీరజ:- ఆగండి అని వెంట పడుతుంది….
వినోద్:- స్వారి నే తల్లి అని ఒక గది లోకి వెళ్లి పోతాడు…..
తన వెనకే వెళ్లి పట్టు కుంటుంది…
నీరజ:- చెప్పండి నేను మిమ్మల్ని టార్చర్ చేస్తున్నాన, హ చెప్పండి అని అంటుంది….
వినోద్:- ఏదో ఊరికే అన్నాను నీరు, నువ్వే నన్ను భరిస్తున్నావు కదా అని బుజ్జగించడం మెుదలు పెడతాడు….
నీరజ:- ఏం అక్కర్లేదు…..
వినోద్:- గట్టిగా కౌగిలించుకొని, నా బంగారం కదూ అని బతిమాలాడుతాడు…….
నీరజ:- హ సరే సరే…..
వినోద్:- నవ్వి గట్టిగా ఒక ముద్దు పెట్టుకుంటాడు…..
నీరజ:- అబ్బా, వదలండి కొంచెం కూడా సిగ్గు లేదు మీకు……..
వినోద్:- సిగ్గు ఎందుకే నువ్వు నా పెళ్లానివి అని మళ్లీ దగ్గరకు రాబోతాడు……….
నీరజ:- ఇంక చాలు అని బయటికి పరిగేడుతుంది……..
వినోద్:- నవ్వుతూ బయటికి వస్తాడు…………
ఆకాష్:- ఏం బావ గట్టిగా ఇచ్చినట్లు ఉంది నీరజ అని అంటాడు……
వినోద్:- లేదు నేనే తీసుకున్న రా బావ!!………
ఆకాష్:- ఏంటి?……..
వినోద్:- ఏం లేదులే పదా, మేము నైట్ బయలుదేరాలి కదా, లాగేజ్ సర్దుదాం పదా అని తీసుకు వెళతాడు……
ఆకాష్:- సరే పదా అని అంటాడు….
నైట్ 8 గంటలకు
నీరజ:- అమ్మ, నాన్న మేము బయలుదేరుతాము, అన్నయ కి ఫోన్ చేసి చెప్పారు ఈయన, మేము బయలుదేరుతాము అని చెపుతారు…..
జానకి:- రేపు పొద్దున్నే వెళ్లోచు కదా…..
నీరజ:- రేపటి నుండి ఆఫీస్ కి వెళ్లాలి కదా అమ్మ అని అంటుంది……..
జానకి:- సరే అయితే……
వినోద్:- అత్తయ్య , మావయ్య గారు, ధరణి అందరికి బాయ్, ఏరా ఆకాష్ బయలుదేరుతాము……
నీరజ:- వదిన బాయ్
ఇద్దరు వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్లి పోతారు……..
జానకి:- ధరణి భోజనం చేయలేదు నువ్వు , రా మరి తిందువు గాని అని పిలుస్తారు……
ధరణి:- అత్తయ్య, నాకు ఆకలిగా లేదు నేను తర్వాత తింటాను,మీరు తింటారా పెడతాను రండి…….
జానకి:- లేదు నేను తినేసాను లే నువ్వు కూడా తిను సరేనా తొందరగా సరేనా…..
ధరణి:- సరే అత్తయ్య నేను తింటాను ,ఫ్రెష్ అయి వచ్చి తింటాను…..
ధరణి వెళ్లి ఫ్రెష్ అయి బయటికి వచ్చి హల్ లో ఉంటుంది……….
ధరణి:- ఆయన వస్తే ఇద్దరం కలిసి తింటాము అని ఆనందంగా ఎదురు చూస్తుంది అభి కోసం……
కారు సౌండ్ వినపడి లేచి నుంచుంటుంది.
అభి లోపలికి వచ్చి తనని చూస్తాడు…..
అభి:- ఏంటి ఈ అమ్మాయి ఇక్కడ ఉంది అని అనుకొని పైకి వెళ్లి పోతాడు……
ధరణి:- ఏవండి ఫ్రెష్ అయి వస్తారా భోజనం చేద్దాం అండి ……
అభి:- నాకు ఆకలిగా లేదు అని వెళ్లి పోతాడు……
ధరణి:- నాకు తినాలని లేదు, ఆయన కు పాలు తీసికొని వెళతా అని అన్ని శుభ్రం గా సర్దేసి పాలు తీసికొని వెళుతుంది…….
తను వెళ్లేసరికి బెడ్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటాడు….
ధరణి:- భోజనం చేయలేదు కదా అని పాలు తీసుకువచ్చాను అండి అని అభి కి ఇస్తుంది……..
అభి:- నాకు వద్దు, నన్ను డిస్టర్బ్ చేయాకు , నాకు వర్క్ ఉంది అని అంటాడు……..
ధరణి:- ఏమి తినలేదని……..
అభి:- నీకు ఏది ఒక సారి చెబితే అర్థం కాదా అని సిరియస్ అవుతాడు………
ధరణి:- సైలెంట్ గా పక్కన పెట్టి బెడ్ మీద పడుకోబోతుంటే అభి పిలుస్తాడు…..
అభి:- నువ్వు సోఫా లో పడుకో, నాకు వర్క్ ఉంది…..
ధరణి:- ఈయన ఏంటి నాతో మాట్లాడడానికి ఇష్టం లేదా, లేకపోతే వర్క్ వల్ల నాకేం అర్థం కావడం లేదు అని తన మది లో ఆలోచనలతో సోఫా వైపు నడిచింది…….
ఇంకా ఉంది………
Swipe left/right or tap the sides to turn pages