New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వేచానయ్య నీకోసం 🤍 – 12

వేచానయ్య నీకోసం 🤍 – 12

 

కావ్య మాటలకి ఆర్యన్ కి ఇరిటేషన్ వస్తూ ఎందుకో తెలియదు కానీ గాయత్రి మీదనుంచి అతను చూపు పోవడం లేదు…. అతని ప్రవర్తన అతనికి కొత్తగా ఉంది….

 

కానీ అతనికి గాయత్రి కావాలనిపిస్తోంది…ఇలాగే ఉంటే గాయత్రీ తో తన ట్రావెల్ సాఫీగా సాగాలి అంటే కావ్య మధ్యలో ఉండకూడదు…. అంటే తనకి ఒక డైవర్షన్ ఉండాలి కాబట్టి వెంటనే ఎవరికో మెసేజ్ పెట్టడంతో పావుగంటలో “ఏంట్రా పిలిచావు?” అంటే వచ్చాడు ఆర్యన్ వయసుతో సమానంగా ఉన్న మరొక అబ్బాయి…

 

ఆర్యన్ ఆ వచ్చిన అతని కాలర్ పట్టుకుని గాయత్రి వైపు చూపిస్తూ “ఆ అమ్మాయితో నేను మాట్లాడాలి…. పక్కనున్న క్యాండిడేట్ చాలా ఇరిటేట్ చేస్తుంది…. ఇలాగే వాగుతూ ఉందంటే నా చేతిలో కచ్చితంగా చంప పగలు కొట్టించుకుంటుంది కాబట్టి దాన్ని ఇక్కడి నుంచి తీసుకొని పో” అనగానే “ఆడపిల్లను కొట్టడం కరెక్ట్ కాదురా?” అనగానే “అందుకే ఏదో ఒకటి చెప్పి పక్కకి తీసుకుని పోరా” అన్నాడు ఆర్యన్….

 

అసలు ఆర్యన్ ఏం చేయబోతున్నాడో అర్థం కాక ఏ అమ్మాయి గురించి ఇంతలా ఆలోచించడం ఇదివరకు చూడకపోవటంతో కావ్య దగ్గరికి వెళ్లి “ఏవండీ..మీతో నేను కొంచెం మాట్లాడాలి” అనగానే “మధ్యలో నువ్వేవడివిరా గొట్టం గాడివి” అంటూ ఒక్క తోపు తోయడంతో కింద పడ్డాడు ఆర్యన్ కోసం వచ్చిన విశ్వ….

 

గాయత్రి నోటికి చేతులు అడ్డుపెట్టుకొని “అక్క…. ఎవరైనా చూస్తే గొడవ అయిపోతుంది పదా వెళ్లిపోదామని” కావ్య చెయ్యి పట్టుకుని వెళ్లడానికి ప్రయత్నించింది…

 

కానీ ఆర్యన్ అంత సులభంగా ఆమెని వెళ్ళనిచ్చేలా లేకపోవడంతో ఆమె చేతిని మళ్లీ పట్టుకోవడంతో “ఏంట్రా నీ సమస్య?” అని కావ్య కోపంగా చూడడంతో ఆర్యన్ చూసిన చూపుకి ఆమె కూడా బెదిరిపోయింది….

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue