New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
హిట్లర్ హస్బెండ్ – 16

హిట్లర్ హస్బెండ్ – 16

ఆ సిగరెట్ పడేసి అయినా నా దగ్గరికి రావచ్చు కదా ఆహా లేదు అలాగే దాన్ని పీల్చుకుంటూ నా దగ్గరికి వచ్చి ఏంటిది అన్నట్లు కల ఎగిరేసాడు. 

 

నాకన్నా కాస్త బుర్ర పని చేస్తూ ఉండాలి కదా అతనంటే అన్నాడు. నువ్వెందుకే ఎగిరేయ్యాలి అంటూ నేను కూడా కళ్ళు దించుతూ మరీ హల్వా అని చూపించగానే ఖాళీగా ఉన్న ఒక చేతి చూపుడు వేలుతో నా నుదుటిమీద పొడిచి ఆ బౌల్ని తీసుకోబోయాడు. 

 

హమ్మయ్య తీసుకున్నాడు సంతోషం ఇదే పది వేలు తినేస్తే అన్నా బాగుండు అని నేను అనుకుంటున్నాను లేదో బల్లున శబ్దం. 

 

ఏంటా అని ఆలోచనలో నుండి బయటికి వచ్చేసరికి క్యారెట్ హల్వా నేలపాలు అయిపోయింది అయ్యయో కింద పడింది.

అసలే దీన్ని ఎంత కాస్ట్లీగా చేశాను నెయ్యి అంటే మా ఇంట్లోనే దొరుకుతుంది లే జీడిపప్పు బాదం అవన్నీ ఎంత రేటు పైగా ఈయన కోసం ఎక్స్ట్రా కూడా వేశాను అలా ఎలా కింద పడేస్తారు అని నేను చూస్తూ ఉంటే వాట్ ఇస్ దిస్ నాకు హల్వా హాట్ గా ఉన్నపుడు తినడమే ఇష్టం కావాలని నువ్వు ఫ్రిజ్లో పెట్టి నేను తినకూడదని తీసుకొచ్చావా అని ఆయన గారు అంటుంటే, 

 

అమ్మమ్మ ఇదెక్కడ విడ్డూరం రా బాబు చల్లగా అవుతుంది కూల్ గా ఉంటుంది తింటుంటే చల్లగా గొంతులోకి దిగిపోతుందని నేను ఫ్రిజ్లో పెట్టి గార్నిష్ చేసి తీసుకొస్తే ఈయన తినకూడదు అని కావాలని చేశాను అంటాడు ఏంటండీ బాబు ఇప్పుడు ఆయన కోసమే కదా పిల్లల్ని ఏ మార్చి మరి నేను క్యారెట్ హల్వా చేసింది అని కొనుక్కుంటూ ఈ ముక్క మీరు ముందే చెప్పొచ్చు కదా సార్ వేడిగా తింటాను అని అన్నాను. ఎలాగో మనల్ని పనిమనిషిగా అనుకుంటున్నాడు మనకి పోయేదేం లేదు అందుకే నేను కూడా సార్ అని పిలుస్తున్నాను. 

 

ఆ ముక్క నువ్వు చేసే ముందే అడగాలి అని సింపుల్ గా చెప్పి వెళ్లి హీట్ చేసి తీసుకురా అనగానే తప్పుతుందా అంటూ సారీ పెద్దమ్మ పెద్ద అత్తయ్య ఈయన వల్ల మీకు ఇప్పటివరకు ఒక కప్పు ఒక గాజు గిన్నె నష్టం ఇంకా ఈయన ఉన్నన్ని రోజులు ఎన్నెన్ని నష్టాలు జరుగుతాయో నేను చెప్పలేను అనుకుంటూ అదంతా క్లీన్ చేసి కిందకి వెళ్లాను. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue