షాలు నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరకి లాక్కుని ఆమె పెదవులని అందుకోబోతుంటే సిగ్గుతో అతన్ని దూరంగా నెట్టి పైకి లేస్తుంటే … హేయ్ బేబీ ప్లీజ్ ఒక్కసారి అని రిక్వెస్టింగ్ గా అడుగుతుంటే టక్కున అతని బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వుతూ బాయ్ సార్ అంటూ అక్కడి నుండి పరిగెడుతుంది. వెళ్తున్న ఆమె వైపు చూసి బుగ్గని తడుముకుంటూ నవ్వుకున్నాడు రాఖీ.
హాస్టల్ కి వెళ్ళిన హీరా డల్ గా కూర్చుని ఆలోచిస్తుంది …ఇంతలో ఆమె ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది…ఓపెన్ చేసి చూస్తే “నైట్ బయటకి వస్తావా …లాంగ్ డ్రైవ్ ??? ” అని ఉంది. హీరా కి అర్థమైంది అది రిషి నెంబర్ అని. మెసేజ్ చూసి అప్పటి వరకు ఉన్న బెంగ తీరిపోతే లాంగ్ డ్రైవ్ అన్న మాట కి కంగారు పడుతుంది. ‘ అమ్మో సార్ తో లాంగ్ డ్రైవ్ నా?? ఇప్పుడు వెళ్తే ఏమౌతుందో, వెళ్ళకపోతే సార్ ఏమనుకుంటారో ‘ అని ఆలోచిస్తూ గోళ్ళు తినేస్తుంది. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది…” ఎక్కువ ఆలోచించకు, ఇట్స్ ఒకే మనం రేపు ఈవెనింగ్ కాఫీ కి వెళ్దాం ” అని మెసేజ్ పెట్టాడు.
తనని అర్థం చేసుకున్నందుకు హ్యాపీ గా ఫీల్ అవుతూ థ్యాంక్ యు రిషి సార్❤️ అని మెసేజ్ చేసింది.
ఆమె మెసేజ్ చూసి క్రేజీ అని నవ్వుకున్నాడు రిషి.
అడగాలా వద్ద అని ఆలోచిస్తూ ఈవెనింగ్ ఎక్కడికి వెళ్ళారు సార్ అని అడిగింది.
అది చూసి కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసి హాయ్ రిషి సార్ అంది హీరా.