ఎవరైనా చూడగానే కొత్త పెళ్లికూతురు అని అర్థమయ్యేలాగా ఉంది అలాగే పల్లెటూరి మొద్దనుకునే లా ఓవర్ మేకప్ అనిపించేలాగా అస్సలు లేదు.
పర్ఫెక్ట్ గా జర్నీకి సూట్ అయ్యేటట్టు రెడీ చేసింది వైషు మన హాసిని నీ.
చూసి ఒక్క నిమిషం ఫ్రీజ్ అయిపోయాడు.
హర్ష బాబు నోర్లు తెరుచుకొని చూస్తున్న అత్తమ్మలను చూస్తూ వాళ్ళ పక్కకెళ్ళి ఎలా ఉంది అత్తమ్మలు మా అక్క అని అడిగింది వాళ్లను ఈ లోకంలోకి తీసుకొస్తూ.
గడుసు దానివే కోడలు పిల్ల చాలా బాగా రెడీ చేశావ్ అని నీలిమ వైశ్యుని బుగ్గ లాగితే విక్కీ వంక గర్వంగా చూసింది వైషు.
దీనిలో వె టాలెంట్ కూడా ఏడ్చిందా అని అనుకుంటూ ఓ ఒక సెకండ్ వైష్యుని పొగిడి మళ్లీ చూపులు హర్ష హాసినిల వైపు నిలిపేసాడు.
అందరూ పెద్దలు ఉన్నారని హర్ష ఏం ఎగ్జైట్ కాకుండా జస్ట్ ఎండిపోయి తడారిపోయిన గొంతుని నింపడానికి వాటర్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు.