╰┈➤నా సైకో సీనియర్ ᥫ᭡🪽 – 5
రాత్రి పన్నెండున్నర… ముంబై నగరమంతా నిద్రలోకి జారుకున్న వేళ, ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఒక రేసింగ్ బైక్ సైలెన్సర్ సౌండ్ జైన్ మాన్షన్ గేట్లు దాటి లోపలికి వచ్చింది.
బైక్ రేస్‌లో గెలిచిన ఆ ఉస్తాహం ఇంకా అతని నరాల్లో పరిగెడుతుండగా, హెల్మెట్ తీసి బైక్ మీద పెట్టి, లెదర్ జాకెట్ జిప్ తీసుకుంటూ నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు రోహన్.
హాల్‌లోకి రాగానే అతని అడుగులు ఆగిపోయాయి. ఆ విశాలమైన, ఖరీదైన హాల్ మధ్యలో ఉన్న ఇటాలియన్ సోఫాలో… నిలువెత్తు అధికారానికి, గర్వానికి కేరాఫ్ అడ్రస్ లా కూర్చుని ఉంది మిస్ నీలాంబరి జైన్. చేతిలో ఉన్న బిజినెస్ మ్యాగజైన్ పక్కన పెట్టి, అతను రాగానే సోఫాలోంచి నెమ్మదిగా నిలబడింది.
“రోహన్… వాట్ ఈజ్ ద టైమ్?” హాల్ లో ఉన్న ఏసీ కన్నా చల్లగా, గంభీరంగా అడిగింది.
అప్పటిదాకా ఉన్న పొగరు, యాటిట్యూడ్ అన్నీ సెకనులో మాయమైపోయాయి రోహన్‌కి. తప్పు చేసిన పిల్లాడిలా ఏమీ మాట్లాడకుండా తల దించుకున్నాడు.
ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ అతని ఎదురుగా వచ్చి నిలబడింది. “లిఫ్ట్ యువర్ హెడ్,” అంది కమాండింగ్ గా.
రోహన్ నెమ్మదిగా తల ఎత్తి ఆమె కళ్లలోకి కొంచెం తడబడుతూ చూశాడు. ఆ కళ్లలో తల్లి ప్రేమ లేదు.
“ఈ టైమ్ వరకు రేసింగ్స్ ఏంటి? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ… ఆ రేసింగ్స్ స్టాప్ చేయమని. వై డోంట్ యూ లిజన్?” అని నీలాంబరి గొంతు పెంచి అరిచేసరికి…
ఆ శబ్దానికి పై రూమ్‌లో నిద్రపోతున్న నారాయణ గారు, రత్నాంబ గారు కంగారుగా కిందకి వచ్చారు.
“ఎందుకే వాడిని ఈ అర్ధరాత్రి పూట అలా తిడుతున్నావ్? కుర్రాడు, ఎప్పుడో ఒకసారి వెళ్లాడు, వదిలెయ్,” అని రత్నాంబ గారు మనవడి మీద ప్రేమతో అడ్డురాబోతే…
“మామ్! ప్లీజ్ డోంట్ ఇంటర్‌ఫియర్. ఇది నా కొడుకుకి, నాకు మధ్య జరుగుతున్న విషయం,” అని ఆవిడని కటువుగా ఆపేసింది నీలాంబరి.
మళ్లీ రోహన్ వైపు సూటిగా చూస్తూ… “చెప్పు రోహన్, రేసింగ్ కి వెళ్లడం ఎందుకు స్టాప్ చేయడం లేదు? నా మాట అంటే నీకు లెక్క లేదా?” అని అడిగింది.
“నో మామ్, ఐ రెస్పెక్ట్ యువర్ వర్డ్స్. నువ్వు చెప్పే ప్రతి విషయం నేను ఫాలో అవుతున్నా. రేసింగ్ ఈజ్ జస్ట్ ఏ హాబీ మామ్. అండ్ ఐ ప్రామిస్ యూ, నా హాబీస్ వల్ల మన కంపెనీకి ఎటువంటి లాస్ రాదు,” అన్నాడు రోహన్ తన 155 ఐక్యూ బ్రెయిన్ తో చాలా నమ్మకంగా.
“ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ది కంపెనీ రోహన్! ఐ యామ్ టాకింగ్ అబౌట్ యువర్ టైమ్ సెన్స్!” ఆమె వాయిస్ లో ఫైర్ రగులుకుంది.
“ఒక లీడర్‌కి తన హాబీస్ తన కంట్రోల్‌లో ఉండాలి, హాబీల కంట్రోల్ లో లీడర్ ఉండకూడదు. ప్రతిదీ టైమ్‌కి మెయింటైన్ చేయమని ఎన్నిసార్లు చెప్పాను? ఇప్పుడు ఈ చిన్న చిన్న హాబీస్ వల్ల నీ స్లీప్ నెగ్లెక్ట్ చేస్తున్నావ్. రేపు బోర్డ్ మీటింగ్ లో స్లీపీ ఐస్ తో కూర్చుంటావా? దెన్ హౌ కెన్ ఐ హ్యాండ్ఓవర్ మై కంపెనీ టు యూ? నా అకిరా కార్పొరేషన్‌ని ఇలా టైమ్ సెన్స్ లేకుండా హాబీస్ అంటూ టైం వేస్ట్ చేసేవాళ్ల చేతిలో నేను పెట్టలేను,” అంది చాలా కఠినంగా.
సాధారణంగా ఇంత లేట్‌గా వస్తే ఏ తల్లైనా తిన్నావా అని అడుగుతుంది లేదా లేట్ అయిందని భయపడుతుంది. కానీ నీలాంబరి ఇప్పుడు కూడా కంపెనీ గురించే మాట్లాడుతోంది. ఆ విషయం రోహన్‌కి తెలుసు, కానీ అతనిలో ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే అతను కూడా సేమ్ నీలాంబరి లాగే ఆలోచిస్తాడు. ఆ కంపెనీ బాధ్యతలు తీసుకోవాలంటే తన తల్లి అంచనాలకు తగ్గట్టుగా నిరూపించుకోవాలని అతనికి తెలుసు.
“ఏంటే! వాడు ఈ టైమ్‌లో వస్తే కనీసం తిన్నావా అని కూడా అడగకుండా కంపెనీ, టైమ్ సెన్స్ అంటూ ప్రాణాలు తీస్తున్నావ్?” అని రత్నాంబ గారు మండిపడుతుంటే…
“గ్రానీ… ప్లీజ్ స్టాప్.” వాళ్ళని ఆపి రోహన్ నీలాంబరి వైపు చూస్తూ, “వాట్ యూ సెడ్ ఈజ్ ట్రూ మామ్. టైమ్ సెన్స్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఏ లీడర్. నా టైమ్ మేనేజ్మెంట్ నేను ఇప్పటి నుండే చేంజ్ చేసుకుంటాను,” అన్నాడు రోహన్ ఎంతో బాధ్యతగా.
అది విన్న నీలాంబరి పెదవులపై ఒక చిన్న గర్వపు నవ్వు అలా మెరిసి ఇలా మాయమైంది. ‘నా కొడుకు పర్ఫెక్ట్’ అన్న గర్వం అది.
‘ఈ తల్లి కొడుకులు ఎలాంటి వాళ్లో, వీళ్ళ మెషీన్ లాంటి మైండ్సెట్ ఏంటో తెలిసి కూడా మధ్యలోకి వచ్చాను చూడు, నాకే బుద్ధి తక్కువ’ అని విసుక్కుని గిరుక్కున వెనక్కి తిరిగి రూమ్‌కి వెళ్లిపోయింది రత్నాంబ.
“ఓకే గుడ్. టుమారో ఆఫీస్ కి వస్తావ్ కదా, గో అండ్ టేక్ రెస్ట్,” అని నీలాంబరి అనడంతో రోహన్ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా తన రూమ్‌కి వెళ్లిపోయాడు.
ఇప్పుడు ఆ విశాలమైన హాల్‌లో కేవలం నారాయణ జైన్ గారు, నీలాంబరి మాత్రమే మిగిలారు. ఆయన కూతురి వైపు ఎంతో భారంగా చూశారు.
“నువ్వు చేస్తోంది చాలా తప్పు నీలు. రోహన్‌ని కూడా అచ్చం నీలాగే ఒక ఎమోషన్ లెస్ రాక్ లా మారుస్తున్నావ్. ఇంకోవైపు ప్రియని న్యూయార్క్ పంపించి దాన్ని కూడా నీకు దూరం చేసుకున్నావ్, మరొకవైపు చిన్న కూతురు ఎలా ఉందో అని కూడా లేదు మీరా నీ పట్టించుకోవడమే మర్చిపోయావ్ ,” అని నారాయణ గారు అనగానే…
“డాడ్!” గట్టిగా అంది నీలాంబరి.
“వాళ్లు నా పిల్లలు. వాళ్లకి ఏది రైటో, ఏది రాంగో నాకు స్పష్టంగా తెలుసు. ప్రియని బిజినెస్ చూసుకోమనే న్యూయార్క్ పంపించాను. షి విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ ఆ ప్రాసెస్ లో బిజినెస్‌లో ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తుంది .మీరా నీ అమ్మ బాగానే చూసుకుంటుంది కదా, అండ్ రోహన్…
హి ఈజ్ మై హైర్ (Heir). నా తర్వాత నా సామ్రాజ్యాన్ని టేక్ ఓవర్ చేసే ఏకైక వారసుడు. ఒక ఎంపైర్ నడపాలంటే వాడు ఎంత రూత్‌లెస్‌గా ఉండాలో ఇప్పటినుండే వాడి నరనరాల్లో నింపడంలో తప్పేం లేదు,” అంది కటువుగా.
“బట్ హి ఈజ్ జస్ట్ 21 నీలు,” అన్నారు నారాయణ గారు నిస్సహాయంగా.
“ఇంకో మంత్‌లో 22 వస్తాయి. సో వాట్? ఏజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ డాడ్. నా కొడుకు మైండ్‌సెట్ అందరి అబ్బాయిల్లా అమ్మాయిల వెంట, రోడ్ల వెంట తిరిగే టైప్ కాదు. హి ఈజ్ బోర్న్ టు రూల్!” అని చెప్పేసి తన డెసిషన్ కి తిరుగులేదని తేల్చేసి అక్కడినుండి తన రూమ్‌కి వెళ్లిపోయింది నీలాంబరి.
ఇంకా ఉంది…
Swipe left/right or tap the sides to turn pages