❤️ I Want You ❤️ MADLY…🥵 – 3
ఆ రోజు సండే ….ఇంకా హనీ నిద్ర లేవలేదు …కానీ విషిక 5:30 కే లేచి ఫ్రెష్ అయి హనీ కోరినట్టు దోశలు వేసి కొబ్బరి చట్నీ , పల్లీ చట్నీ చేసి … సండే అవ్వడం వల్ల హనీ నీ డిస్టర్బ్ చేయకుండా కాఫీ కలుపుకుని గార్డెన్ లోకి వెళ్ళి మొక్కల మధ్య బెంచ్ మీద కూర్చుని కాఫీ సిప్ చేస్తూ కూర్చుంది …తనకిప్పుడు ఒక ఆలోచన మైండ్ లో ఉంది … తనకి ఓన్ హౌస్ కావాలని ….ఇలా ఎన్ని సంవత్సరాలు అద్దింట్లో వుంటాం అనిపిస్తుంది…తను ఉద్యోగం చేసే స్కూల్ చైర్మన్ తో విషిక కి మంచి పరిచయమే ఉంది….ఆయనే రాఘవ గారు…ఇప్పుడు తన ఆలోచన ఆయన్ని అడిగి లోన్ తీసుకోవాలని….Viraj group of institutes అంటే అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ఇలాంటి లోన్ లు ఇస్తారు …ఇంకెక్కడ ఇలాంటి ఆఫర్స్ లేవు కానీ ఈ ఇన్స్టిట్యూట్ లో ఉంది….ప్రతి ఇయర్ అయిదుగురు ఉద్యోగాలకి ఇలా ఇస్తూ ఉంటారు…లాస్ట్ ఇయర్ తనకి కూడా వచ్చింది …కానీ అప్పుడు ఇల్లు ఆలోచన లేక రిజెక్ట్ చేసింది …కానీ ఇప్పుడు తనకి సొంతిల్లు ఉంటే ఇంటి రెంట్ ప్రతి నెల ఇలా కట్టక్కర్లేదు కదా అని వాటిని పాప కోసం దాచొచ్చు అనుకుంటుంది…ఈ విషయం గురించే చైర్మన్ సార్ వస్తే మాట్లాడాలి అనుకుంటుంది …ఆలోచన లో ఉన్న విషి కి హనీ ఏడుపు తో స్పృహలోకి కంగారు గా లోపలికి పరిగెడుతుంది.
బెడ్ మీద కూర్చుని కళ్ళు నులుముకుంటూ మమ్మీ….. మమ్మీ….అని ఏడుస్తూ వుంటుంది … విషి వెళ్ళి హనీ నీ ఎత్తుకుని నేనిక్కడే ఉన్నాను బంగారం …సారీ తల్లి నువ్వు లేచే వరకు నేను ఎక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది …సారీ బంగారం .. భయపడ్డావా అంటూ హనీ ఫేస్ చేతిలోకి తీసుకుని నుదుటన ముద్దు పెట్టుకొని కళ్లు తుడిచి ఎత్తుకుంటుంది…
ఇచ్ ఓకే మమ్మీ..నువ్వు ఫీల్ అవ్వకు …కానీ ఇదే లాస్ట్ టైమ్..మళ్ళీ నేను లేచే సరికి నువ్వు నా దగ్గరే ఉండాలి అంటూ వేలు చూపిస్తుంది . ఒకే బంగారం కమ్ అంటూ వాష్ రూమ్ కి తీసుకెళ్లి బ్రష్ చేయించి ఫ్రెష్ చేయించి టవల్ లో చుట్టి తీసుకొచ్చి బుడ్డి టీషర్టు అండ్ బుడ్డి షార్ట్ వేసి పోని పెట్టి చిన్న స్టిక్కర్ పెట్టి బయటకి తీసుకొచ్చి సోఫా లో కూర్చోబెట్టి దోశలు తెచ్చి కొంచెం చట్నీ లో డిప్ చేసి తినిపిస్తుంది … వావ్ మమ్మీ… దోశ అంటూ కళ్ళల్లో మెరుపులు మెరిపించుకుంటూ థాంక్ యు మమ్మీ అంటూ విషీ బుగ్గ మీద కిస్ ఇచ్చి ఇష్టం గా ఒక దోశ కంప్లీట్ చేస్తుంది … చూస్తున్న విషి కంట్లోంచి కన్నీళ్లు చెంపలను తడిపేస్తాయి. కనీసం పాప కి ఇష్టమైనవి ఇవ్వలేకపోతున్నందుకు తన సిట్యుయేషన్ చూసి తనకే జాలేస్తుంది….కూతురు గా ఓడిపోయిన , కోడలి గా ఓడిపోయిన , ఆకరికి భార్య గా ఓడిపోయిన తను బాధ పడలేదు … బిడ్డ కోసం అందరిని కాదనుకుంది..కానీ అదే బిడ్డ కి మంచి లైఫ్ ను ఇవ్వలేక తల్లి గా విడిపోయిందేమో అని ఎవరో గుండె నీ పిండేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
కష్టంగా తనని తను కంట్రోల్ చేసుకుని మొఖం మీదకు నవ్వు తెచ్చుకుని నచ్చిందా బంగారం.. ఇక నువ్వు ఉప్మా తినక్కర్లేదు …నీకు నచ్చనవి చేసి పెడతా ఒకే నా…?? అంటే ఒకే మమ్మీ అని తన చిన్ని చేతులతో తను తినిపిస్తుంది విషీ కి . తనకి తినాలని లేకున్న కూతురు ముందు సీన్ చేయడం ఇష్టం లేక తను కూడా ఒక దోశ తిని పాప తో కాసేపు కబుర్లు చెప్పి నిద్రపుచ్చి లంచ్ ప్రిపేర్ చేసి హనీ పక్కకెళ్ళి తనని లేపి ఫుడ్ తినిపించి మధ్యానం నుండి పక్కనే ఉన్న పార్క్ కి తీసుకెళ్లి కాసేపు గేమ్స్ ఆడించి ఈవెనింగ్ వరకు ఉంచి ఇంటికి తీసుకొచ్చి ఫ్రెష్ చేయించి కొంచెం ఫుడ్ పెట్టి తను తిని హనీ కి స్టోరీస్ చెప్పి నిద్రపుచ్చి తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మిల్క్ కాచి హనీ కి పట్టించి పక్కన నడుము వాలుస్తుంది. ఎంతకి నిద్ర రాదు కాని ఆలోచనలు గతం వైపు పరుగులు పెడుతుంటే వాటిని కష్టంగా కట్టి పెట్టి కళ్ళు మూస్తుంది.
నెక్స్ట్ డే రొటీన్ స్కూల్ కి పోవడం రావడం అలా వాళ్ళకి 10 డేస్ అవుతాయి … ఆ రోజు చైర్మన్ సార్ వచ్చె రోజు….అందుకే అందరూ ఒక గంట ముందే రావాలి అని ముందు రోజు చెప్పుండడం తో ఎర్లీ గా రెడీ అయి స్కూల్ కి వెళ్తుంది హనీ తో.
10 గంటలవుతుండగా అక్కడికి వస్తుంది ఒక లగ్జరీ కార్….అందులోనుండి దిగుతుంది ఆరుడుగుల కటవుట్ …. కార్ దిగి ఒక చేతిలో ఫోన్ పట్టుకుని చూస్తూ ఇంకొక చెయ్యి పాకెట్ లో పెట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ వస్తుంటే …. స్కూల్ పిల్లలంతా హీరో వచ్చినంత ఎక్సైటింగ్ గా విండోస్ పట్టుకుని వేలాడతారు…అదేమీ పట్టనట్టే డైరెక్ట్ గా చైర్మన్ ఛాంబర్ కి వెళ్ళిపోతాడు విరాజ్…..
మీ
❤️ స్వీటీ ❤️
నచ్చితే comment చేసి follow చెయ్యండి.
Swipe left/right or tap the sides to turn pages