ఇంకా కొద్దిసేపైతే పూర్తిగా విచక్షణ కోల్పోతాడు అనగా… చివరి సెకండ్‌లో రిషిత కన్నీళ్ళ తడి అతని పెదవులకు తగిలి ఇహలోకంలోకి వచ్చాడు ఆర్య!
వెంటనే ఒక్కసారిగా దూరం జరిగాడు. తన పెదవులను చేత్తో తుడుచుకుంటూ, రిషిత వైపు అసహ్యంగా చూశాడు.
రిషిత ఆయాసంతో, కన్నీళ్ళతో వణుకుతూ నిలబడి ఉంది.
“సిగ్గు అనిపించట్లేదా నీకు? డబ్బున్న వాడికి ఇలా ఎర వేసి వలలో వేసుకోమని చెప్పారా మీ పేరెంట్స్? హా?! ఎక్కడ మీ అమ్మానాన్న? పిలువు వాళ్ళని! నా కంపెనీలో ఎక్కడో ఫస్ట్ బిల్డింగ్‌లో, ఒక చిన్న పోస్ట్‌లో వర్క్ చేసేదానివి… టాప్ ఫ్లోర్‌లో ఉన్న నా పక్కన కూర్చోవడానికి ఇంతకు తెగిస్తావా? కాస్తయినా సెన్స్ లేదా నీకు?” అని నోటికొచ్చినట్టు అరిచాడు.
రిషిత గుండె ముక్కలైపోయింది. నోట మాట రాక ఏడుస్తూనే ఉంది.
కానీ ఆర్య ఆపలేదు. “నైట్ నేను మత్తులో ఉండి అంత చేస్తుంటే… నీకు కూడా అంతగా చేయించుకోవాలనిపించిందా? అసలు నీకు ఎప్పుడూ మగ గాలి సోకలేదా? లేక మగవాళ్ళ చేతులు వేయించుకుని వేయించుకుని బాగా అలవాటయ్యి నాతో కూడా అలాగే గడిపావా?!” అంటూ ఆర్య నీచంగా, ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే…