New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
A BOLD ANGLE BY MY…( MAN 🥵) – 3

A BOLD ANGLE BY MY…( MAN 🥵) – 3

 

 

 

 

 

 

ముంబై.. రాత్రి 2 గంటలు. “ది హ్యాంగోవర్” పబ్.

 

 

 

​లోపల బేస్ మ్యూజిక్ కి నేల కూడా కంపిస్తోంది. రంగురంగుల లైట్ల వెలుతురులో యువత మత్తులో ఊగుతున్నారు. కానీ ఆ పబ్ వెనుక చీకటి గదిలో గవర్నమెంట్ బ్యాన్ చేసిన డ్రగ్స్ డీలింగ్ జరుగుతోంది. ఒక టేబుల్ దగ్గర చాలా కాన్ఫిడెంట్‌గా కూర్చుని ఉంది ఒక అమ్మాయి .  తన మెడలో ఉన్నా చైన్ లాకెట్ లో ఉన్న సీక్రెట్ లెన్స్‌తో ఆ డ్రగ్స్ డీలింగ్ మొత్తాన్ని పక్కాగా షూట్ చేస్తోంది.అంత పర్ఫెక్షన్తో ఉంది ఆ అమ్మాయి..

 

 

 

అప్పుడే ​సడన్ గా డిజె ఆగిపోయింది. పబ్ ఓనర్ స్టేజ్ మీదకు వచ్చి.. “ప్రతి ఒక్కరినీ చెక్ చేయండి! ఒక లేడీ జర్నలిస్ట్ మన కాన్ఫిడెన్షియల్ వీడియో తీసింది.. అది బయటకు వెళ్తే మనందరం జైలుకు వెళ్తాం. వెతకండి!” అని అరిచాడు.

 

 

 

​పబ్ లో ఉన్న కుర్రకారులు భయం తో పక్కకి తప్పుకుంటే.. ఆ అమ్మాయి మాత్రం నన్ను కాదులే అన్నట్టు పట్టనట్టు అదే టేబుల్ దగ్గర కూర్చొని వైన్ సిప్ చేస్తుంది..పది మంది కండలు తిరిగిన బౌన్సర్లు ఆ అమ్మాయి టేబుల్ చుట్టూ చుట్టుముట్టారు.ఆమె కాంఫిడెన్స్ చుసిన బౌన్సర్స్ ఆమె రీపోటర్ అని ఫిక్స్ అయ్యారు..

 

 

తన దగ్గర ఆగిన వాళ్ళని చుసి ఆ అమ్మాయి ఏమాత్రం తడబడకుండా చేతిలో ఉన్నా వైన్ గ్లాస్ మొత్తం కాళీ చేసి గ్లాస్‌ను టేబుల్ మీద పెట్టి లేచి నిలబడింది.

 

 

 

​బౌన్సర్ 1: (వెకిలిగా నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి) “పిల్ల.. అందంగా ఉన్నావు కదా అని వదిలేస్తాం అనుకున్నావా? ఆ వీడియో ఎందులో తీసావో ఇచ్చేయ్.. లేదంటే నీ జుట్టు పట్టుకుని ఈ పబ్ అంతా ఈడ్చుకెళ్తాం.” అంటూ ​వాడు తన మొరటు చేత్తో అమ్మాయి జుట్టును పట్టుకోబోయాడు. అంతే!

 

 

​ఆమె కళ్ళలో ఒకరకమైన క్రూరత్వం మెరిసింది. వాడు తాకే లోపే,  మెరుపు వేగంతో వాడి మణికట్టును పట్టుకుని తిప్పి.. గాలిలోకి 360 డిగ్రీలు జంప్ చేసి వాడి చెంప మీద ఒక “థండర్ కరాటే షాట్” ఇచ్చింది. వాడు గుడ్లు తేలేసి రెండు టేబుల్స్ అవతల పడ్డాడు.

 

 

 

​అంతే! పబ్ లో ఉన్న కుర్రాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి..

 

 

 

వెంటనే తెరుకొని “వూహూ! అదరగొట్టావ్ బేబీ!” అంటూ ఈలలు, కేకలతో పబ్ ని హోరెత్తించారు. ఆ సమయంలో డిజె వాడు అమ్మాయి ఫైట్ కి సరిపోయే రేంజ్ లో ఒక్కసారిగా హై-వోల్టేజ్ మాస్ బిజియం (BGM) ప్లే చేయడం స్టార్ట్ చేశాడు! ఆ మ్యూజిక్ కి పబ్ లో ఉన్న వాళ్లందరూ టేబుల్స్ పై గ్లాసులతో కొడుతూ ఆమెని ఉత్సాహపరచడం మొదలుపెట్టారు..

 

 

​మిగిలిన తొమ్మిది మంది బౌన్సర్లు ఆమె మీదకు దూకారు. అమ్మాయి తన షర్ట్ బటన్ సరిచేసుకొని, జీన్స్ ని కొంచెం పైకి సర్దుకుని, పక్కనే ఉన్న గ్లాస్ బాటిల్ ని టేబుల్ కి కొట్టి. ఆ పగిలిన షార్ప్ గ్లాస్ బాటిల్ ని చేతిలో పట్టుకుని నిలబడింది.

 

 

 

​ఒక బౌన్సర్ గొలుసుతో కొట్టబోతుంటే, ఆమె వంగి తప్పించుకుని, వాడి గొంతు కింద తన మోచేత్తో బలంగా కొట్టింది. వాడు రక్తము కక్కుకుంటూ నేలపై పడ్డాడు. 

 

 

 

ఇంకొకడు వెనక నుంచి పట్టుకోబోతుంటే, వెనక్కి తిరిగి చూడకుండానే తన చేతిలోని ఉన్న గ్లాస్ బాటిల్నీ  టేబుల్ కి కొట్టి భుజంపై దించేసింది. రక్తం చిమ్మింది!

 

 

 

ఇంకొకడు,వచ్చి చెంప మీద కొట్టాలని చూసాడు, బట్ బాడ్ లక్ ఆమె అది ముందుగానే గ్రహించి. గాలో ఎగిరి కాలితో చెంప మీద కోటి. వాడిని మోకాళ్లపై  కూర్చో పెట్టి, ​పగలగొట్టిన బాటిల్ చూపిస్తూ.”ఎవడ్రా నువ్వు ? నా జుట్టు పట్టుకుంటావా? ఈ సారి ఎవరైనా నా దగ్గరకు వస్తే.. వాడు తన కాళ్ల మీద నడుచుకుంటూ బయటకు వెళ్లలేడు!”అని అంటూ తన హిల్ తో వాడి కాళ్ళు కోటింది. అంటే ” ఫట్- పాట్ “అని బోన్స్ విరిగిన సౌండ్ వచ్చింది.

 

 

 

తాను మిగిలిన బౌన్సర్స్ వైపు చూసింది. ఆ చూపుల్లో ఉన్న ఆ ‘వైల్డ్ నెస్’ కి బౌన్సర్లు కూడా భయపడి రెండడుగులు వెనక్కి వేశారు. 

 

 

 

పబ్ లో ఉన్న కుర్రాళ్ల విజిల్స్, చప్పట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆమె తన కెమెరా ఉన్న చైన్ ని సరిచేసుకుని, పబ్ ఓనర్ వైపు ఒక తీక్షణమైన చూపు విసిరి, అక్కడి నుండి గర్వంగా నడుచుకుంటూ బయటకు వచ్చేసింది. ఆమె తన  బైక్ నీ స్టార్ట్ చేసి చీకట్లో మాయమైపోయింది.

 

 

ఆ అమ్మాయి ఎవరు..?!

 

 

TO BE CONTINUED :-

 

హీరోయిన్ ఇంట్రడక్షన్ సిన్ మాత్రమే ఇదము అనుకున్న చిన్న అప్డేట్ అని ఫీల్ అవ్వదు. నెక్స్ట్ లెన్త్ పెంచి ఇస్తాను..

 

లైక్స్ & కామెంట్స్ ఏవండీ అబ్బా….

ఇగ్నోర్ ది మిస్టేక్స్….

సపోర్ట్ చేసి ఫాలో చేయండి బంగారాలు… రెట్టింపు వేగంతో అప్డేట్స్ ఇస్తాను 🫶…