అందాల రాక్షసి{2}-92

Sravani Naramala

Author

డాక్టర్ వెళ్ళాక ఆయుష్ ను ఎలాంటి స్ట్రెస్ తీసుకోకుండా రెస్ట్ తీసుకోమని చెప్పి ఒక్కొక్కరిగా ఆ రూమ్ నుండి వెళ్ళిపోతారు…… !! పెద్ద వాళ్ళు వెళ్ళాక ఆ రూమ్ లో యంగ్ బ్యాచ్ మాత్రమే ఉంటారు…… !!  అందరూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నా అభి మాత్రం సైలెంట్ గా కూర్చోవడం ఆయుష్ గమనిస్తాడు……. !! అవతలి వాళ్లకు చిరాకు తెప్పించే దాకా లొడా… లొడా మాట్లాడేదానివి ఇప్పుడేంటి అభి ఇంత కామ్ గా కూర్చున్నావ్…… ?? ఆల్రెడీ చెప్పాను కదా నీ మీద నాకు ఎలాంటి కోపం లేదని అయినా దియా ఇవాళ నా కళ్ళ ముందు ఇంత హెల్తీగా ఉందంటే రీసన్ నువ్వే…… !! అలాంటి నీ మీద కోపం ఎందుకు ఉంటుంది చెప్పు అప్పుడు ఎమ్ జరిగిందో నాకు గుర్తు లేకపోయినా దియా, ఆషి నాకు క్లియర్ గా చెప్పారు…… !! ఇక ఆ ఫియర్ వదిలి ఫ్రీగా ఉండు అన్నట్టు హౌ ఇస్ యూర్ స్టడీస్…… ??

ఇంకా స్టడీస్ ఏంటి బావ అభి స్టడీస్ ఎప్పుడో కంప్లీట్ అయ్యాయి ……. !!