అందాల రాక్షసి{2}-91

Sravani Naramala

Author

తెల్లారితే పెళ్లి చూపులు అసలు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో & ఎమ్ చేయాలో ఎవరితో మాట్లాడాలో ఎమ్ అర్థం అవ్వట్లేదు…….. !! తను అభి ను లవ్ చేస్తున్నాడు ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతున్నా నెక్స్ట్ స్టెప్ ఏమైనా తీసుకోవాలి అన్నా ఆయుష్ కి అభి అంటే నచ్చదు…… !! ఆయుష్ కి ఇష్టం లేని పని నిషాన్ చేయలేడు అందుకే టెన్షన్ గా రూమ్ లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు…… !!

సడెన్ గా ఓపెన్ అయిన డోర్ సౌండ్ కి అటుగా చూసిన నిషాన్ కి దియా తన ఫేవరెట్ పాండా డాల్ పట్టుకుని వస్తూ కనిపిస్తుంది…….. !! దియా ఏంట్రా ఇంకా బజ్జోలేదా నువ్వు అని తన ముందు నీస్ మీద కూర్చుంటూ అడుగుతున్న నిషాన్ వైపు చూస్తూ……. !! నానా రేపు అభి అమ్మ కి పెళ్ళి చూపులు అంట అది జరిగితే మ్యారేజ్ ఫిక్స్ అయినట్టే అంట కదా ఇందాక మమ్మా వేద అత్త మాట్లాడుకుంటుంటే విన్నాను…… !!