New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మిస్టర్ మాన్స్టర్

80 stories Ongoing Family Drama Suspense Romance

                          మిస్టర్ మాన్స్టర్ 1  సమయం ఉదయం 9 గంటలు. ఆకాశం నిండా మేఘాలు పట్టి ఉన్నా, ఆ ఆఫీస్ లోపల మాత్రం ఒక రకమైన సెగ పుడుతోంది. సాధారణంగా ఏ ఆఫీస్‌లోనైనా ఉద్యోగులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, కాఫీ తాగుతూ కనిపిస్తారు. కానీ ఇక్కడ..శ్మశాన నిశ్శబ్దం. అందరి కళ్లూ ఆఫీస్ మెయిన్ ఎంట్రీ వైపు ఉన్న భారీ గ్లాస్ డోర్స్ వైపు ఉన్నాయి.అక్కడ ఉన్న సెక్యూరిటీ చీఫ్ తన మైక్‌లో మెల్లగా చెప్పాడు.. బాస్ ఇస్ కమింగ్ ఆ ఒక్క మాట వినగానే, ఆఫీస్ మొత్తంలో ఉన్న దాదాపు 500 మంది ఉద్యోగులు ఒకేసారి అటెన్షన్‌లో నిలబడ్డారు.బయట ఒక…

Browse Stories

మిస్టర్ మాన్స్టర్

మిస్టర్ మాన్స్టర్ 1

                          మిస్టర్ మాన్స్టర్ 1      సమయం ఉదయం 9 గంటలు. ఆకాశం నిండా మేఘాలు పట్టి ఉన్నా, ఆ ఆఫీస్ లోపల మాత్రం ఒక రకమైన సెగ పుడుతోంది.    సాధారణంగా ఏ ఆఫీస్‌లోనైనా ఉద్యోగులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, కాఫీ తాగుతూ కనిపిస్తారు. కానీ ఇక్కడ..   శ్మశాన నిశ్శబ్దం. అందరి కళ్లూ ఆఫీస్ మెయిన్ […]

3 min 689 views
మిస్టర్ మాన్స్టర్

మిస్టర్ మాన్స్టర్ 2

ప్రదేశం:: వైజాగ్ సమయం ఉదయం 6:30.    సూర్య కిరణాలు కిటికీలోంచి గదిలో మంచం మీద పడుకున్నా ఒక అమ్మాయి ముఖం మీద పడుతున్నాయి.    ఆ గదిలో ఉన్న గోడల మీద తను ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఫోటోలు, ఎంబీఏ సబ్జెక్టుల నోట్స్ పేపర్లు అంటించి ఉన్నాయి.    ఆ అమ్మాయి  గాఢ నిద్రలో ఉంది. అప్పుడే ఆమె తల్లి పద్మ వంటగదిలో గిన్నెలతో చేసే శబ్దం, దేవుడి గదిలో నాన్న రామకృష్ణ చదివే శ్లోకాలు […]

3 min 201 views
మిస్టర్ మాన్స్టర్

మిస్టర్ మాన్స్టర్ – 3

మాల్ లోపల అడుగుపెట్టగానే కీర్తి, స్నేహ డ్రెస్సుల సెక్షన్ వైపు పరుగెత్తారు. మైరా మాత్రం వాళ్ళని ఆపుతూ, ముందు విండో షాపింగ్ చేద్దాం రండి, డబ్బులు తక్కువ ఉన్నాయి..   చూసి చూసి మంచిది సెలెక్ట్ చేసుకోవాలి అని నవ్వింది. ఒక బ్రాండెడ్ షోరూమ్ ముందు ఆగి అక్కడ ఉన్న రేట్ టాగ్స్ చూసి అమ్మ బాబోయ్.ఈ ఒక్క డ్రెస్ రేటుతో మా నాన్న వారం రోజులు ఇల్లు గడుపుతారు.    మనకి ఇది వద్దు కానీ, […]

3 min 155 views
మిస్టర్ మాన్స్టర్

మిస్టర్ మాన్స్టర్ – 4

వైజాగ్ నగరం.. సముద్రపు అలల ఘోష కంటే ఎక్కువగా ఇప్పుడు భూపతి మాల్ పరిసరాల్లో ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది.    సిటీలోని అతిపెద్ద షాపింగ్ మాల్‌ అది. కానీ ఈరోజు సామాన్య జనానికి ఎంట్రీ లేదు. కారణం ఆ సామ్రాజ్యానికి అధిపతి, భూపతి ఇండస్ట్రీస్ సీఈఓ ఇషాంత్ భూపతి రాజు స్వయంగా తనిఖీకి వస్తున్నాడు.   మాల్ మేనేజ్‌మెంట్ అంతా గేటు దగ్గర చెమటలు కక్కుతూ నిలబడ్డారు. సరిగ్గా పది నిమిషాల తర్వాత, ఒక బ్లాక్ […]

3 min 211 views
మిస్టర్ మాన్స్టర్

మిస్టర్ మాన్స్టర్ – 5

మైరా కూడా ఆ షాక్‌తో కింద పడబోయి, ఇషాంత్ షర్ట్ కాలర్‌ని గట్టిగా పట్టుకుంది. ఆ పట్టులో ఇషాంత్ వేసుకున్న లక్షల విలువైన బ్రాండెడ్ సూట్ నలిగిపోయింది.    చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్, దిలీప్ అందరూ నిర్ఘాంతపోయారు.వైజాగ్ నగరంలో ఇషాంత్ భూపతి రాజుని తాకే ధైర్యం కూడా ఎవరూ చేయరు.   అటువంటిది ఒక సామాన్యమైన అమ్మాయి వచ్చి అతన్ని బలంగా ఢీకొట్టడమే కాకుండా, అతని కాలర్‌ని పట్టుకోవడం చూసి అందరి గుండెలు ఆగిపోయినంత పని […]

3 min 109 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 6

ఇషాంత్ కి మీడియా అంటే అసహ్యం, కానీ తన కంపెనీ రెప్యుటేషన్ కోసం అతను వాళ్ళ ముందు పద్ధతిగా ఉండాలి.    మీడియా కెమెరాలు తన వైపు తిరగడంతో, అతను తన కోపాన్ని అణచుకోక తప్పలేదు. తన నలిగిన సూట్‌ని సర్దుకుంటూ, ముఖం మీద ఒక  గంభీరత్వాన్ని తెచ్చుకున్నాడు.   దిలీప్ మెల్లగా ఇషాంత్ చెవిలో చెప్పాడు, సర్ మీడియా ఉంది. ఇప్పుడు మనం ఆ అమ్మాయిని పట్టుకుని రచ్చ చేస్తే మన బ్రాండ్ వాల్యూ దెబ్బతింటుంది. […]

3 min 138 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 7

ప్రతి కెమెరా తననే రికార్డ్ చేస్తున్నట్టు మైరాకి భ్రమ కలుగుతోంది.    ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయికి, ఒక అహంకార మృగానికి మధ్య జరిగిన ఆ చిన్న సంఘటన ఆమె జీవితాన్ని తలకిందులు చేయబోతోందని ఆమెకి అప్పుడు అర్థం కాలేదు…..     మాల్ వెనుక గేటు దగ్గర చీకటి ఆవరించి ఉంది. మైరా తన నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి దొంగచాటుగా బయటకి వచ్చింది.    ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తోంది. త్వరగా త్వరగా పదండి […]

3 min 90 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 8

వైజాగ్ విల్లాలో వాతావరణం నిప్పులు చెరుగుతోంది. ఇషాంత్ తన కోటు సర్దుకుంటూ, చేతిలో ఉన్న ఫైల్‌ని విసిరి కొట్టాడు.    తన కళ్ల ముందు మైరా ఫోటో ఉంది, ఆమె వివరాలన్నీ దిలీప్ సేకరించాడు. కానీ సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి ఒక అత్యవసర కాల్ వచ్చింది.    ఒక మల్టీనేషనల్ డీల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితిలో ఉంది, ఇషాంత్ స్వయంగా వెళ్తే తప్ప అది సాధ్యం కాదు.   దిలీప్! కారు […]

3 min 110 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 9

ఆ అమ్మాయి ఏంచేస్తోంది? రిపోర్ట్స్ వచ్చాయా అని అడిగాడు ఇషాంత్…….   హైదరాబాద్‌లోని ఆకాశాన్ని తాకే భూపతి ఇండస్ట్రీస్ భవనంలో, ఇషాంత్ తన కుర్చీలో వెనక్కి వాలి ఆలోచిస్తున్నాడు.    ఒక విషయం చెప్పాలి.. ఇషాంత్ వైజాగ్ నుంచి అంత సులభంగా వచ్చేయలేదు.    అతను విల్లా నుంచి ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందే మైరా గురించి ఆలోచిస్తూనే వచ్చాడు..   అసలు ఏం జరిగిందంటే.. ఇషాంత్ వైజాగ్ విల్లాలో ఉన్నప్పుడు, తన పర్సనల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అత్యంత […]

3 min 96 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 10

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నా, బయటి ప్రపంచానికి ఏ మాత్రం సంబంధం లేనట్టుగా ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది భూపతిస్ విల్ల.    అది కేవలం ఇల్లు కాదు, భూపతి వంశస్తుల కుటుంబం యొక్క శక్తికి అది ఒక నిలువుటద్దం. ఆ ఇంటి సింహద్వారం దగ్గర నిలబడితేనే ఒక రకమైన వణుకు పుడుతుంది.    సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు, ఆ గేట్లు భారీ శబ్దంతో తెరుచుకున్నాయి. ఇషాంత్ తన బ్లాక్ రేంజ్ రోవర్‌ని […]

5 min 97 views