New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మిస్టర్ మాన్స్టర్

80 stories Ongoing Family Drama Suspense Romance

                          మిస్టర్ మాన్స్టర్ 1  సమయం ఉదయం 9 గంటలు. ఆకాశం నిండా మేఘాలు పట్టి ఉన్నా, ఆ ఆఫీస్ లోపల మాత్రం ఒక రకమైన సెగ పుడుతోంది. సాధారణంగా ఏ ఆఫీస్‌లోనైనా ఉద్యోగులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, కాఫీ తాగుతూ కనిపిస్తారు. కానీ ఇక్కడ..శ్మశాన నిశ్శబ్దం. అందరి కళ్లూ ఆఫీస్ మెయిన్ ఎంట్రీ వైపు ఉన్న భారీ గ్లాస్ డోర్స్ వైపు ఉన్నాయి.అక్కడ ఉన్న సెక్యూరిటీ చీఫ్ తన మైక్‌లో మెల్లగా చెప్పాడు.. బాస్ ఇస్ కమింగ్ ఆ ఒక్క మాట వినగానే, ఆఫీస్ మొత్తంలో ఉన్న దాదాపు 500 మంది ఉద్యోగులు ఒకేసారి అటెన్షన్‌లో నిలబడ్డారు.బయట ఒక…

Browse Stories

మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 21

ఆ గిఫ్ట్ బాక్స్ లోని పేపర్లను ఒక్కొక్కటిగా తీసి పడేస్తున్న మైరా చేతులు వణుకుతున్నాయి.    చివరి పొరను తొలగించగానే, ఆమెకు కనిపించిన దృశ్యం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది.    అందులో ఉన్నది.. రక్తంతో తడిసిన వంశీ వాచ్ మరియు వాడి వేలికి ఉండే ఉంగరం.    ఆ వాచ్ అద్దం పగిలి ఉంది. అది చూడగానే మైరాకు గొంతులోంచి ఒక భయంకరమైన అరుపు బయటకు రావాలని ప్రయత్నించింది,    కానీ ఆమె నోటిపై చేయి వేసుకుని […]

4 min 86 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 22

విఘ్నేశ్వరుడి ముడుపు కట్టే శుభ ముహూర్తం రానే వచ్చింది. అటు ఇషాంత్ ఇల్లు, ఇటు మైరా ఇల్లు పెళ్లి కళతో కళకళలాడుతున్నాయి.    ఇషాంత్ తల్లి తన పెద్దమ్మగారితో కలిసి మైరా ఇంటికి పట్టుబట్టలు, వెలకట్టలేని నగలను పంపారు.   రామకృష్ణ గారి ఇంటి ముందు ఒక పెద్ద ఖరీదైన కారు ఆగింది. అందులోంచి ఇషాంత్ కుటుంబ సభ్యులు దిగి, మైరా కోసం తెచ్చిన కానుకలను బయటకు తీశారు.   అవి చూసిన మైరా ఫ్రెండ్స్, చుట్టుపక్కల […]

3 min 79 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 23

తెల్లవారుజామున నాలుగు గంటలు. ఆకాశంలో ఇంకా చుక్కలు మెరుస్తూనే ఉన్నాయి.    కానీ మైరా ఇంట్లో మాత్రం నిశ్శబ్ద రోదన మొదలైంది. పెళ్లి కూతురు దుస్తుల్లో ఉన్న మైరాను చూసి పద్మ గారు ఒక్కసారిగా భోరున విలపించారు.    నా చిన్న తల్లి.. రేపటి నుంచి ఈ ఇంట్లో ఉండదు అంటే నా గుండె ఆగిపోతోంది రా అంటూ ఆమె మైరాను హత్తుకున్నారు.   రామకృష్ణ గారి కళ్లు చెమర్చాయి, కానీ ఆయన తలొంచుకుని మౌనంగా ఉండిపోయారు.  […]

3 min 82 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 24

పండితులు వేద మంత్రాలను పఠిస్తుంటే, ఆ హోమ గుండం నుంచి వచ్చే పొగ మైరా కళ్లలోకి వెళ్తోంది.    ఆ పొగ వల్ల వచ్చిన కన్నీళ్లా లేక తన విధిని తలచుకుని వస్తున్న కన్నీళ్లా అని ఎవరికీ అర్థం కావడం లేదు.   ఇషాంత్ మాత్రం తన చేతిని మైరా చేతిపై వేసి, గట్టిగా నొక్కుతూ తన అధికారాన్ని ప్రదర్శిస్తున్నాడు.     ముహూర్తం సమయం ఆసన్నమైంది. సుముహూర్తమస్తు అని పంతులు గారు గట్టిగా అరిచారు. మైరా […]

4 min 82 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 25

హైదరాబాద్ హైవే మీద ఇషాంత్ కార్ కాన్వాయ్ వేగంగా దూసుకుపోతోంది.    ముందొక సెక్యూరిటీ కార్, మధ్యలో ఇషాంత్ మరియు మైరా ఉన్న లగ్జరీ కార్, వెనుక ఇషాంత్ కుటుంబ సభ్యుల కార్లు, చివరగా అతని బిజినెస్ పార్ట్నర్ మరియు బెస్ట్ ఫ్రెండ్ సాత్విక్ కార్ ఉన్నాయి.   కారు లోపల మైరా నిశ్శబ్దంగా ఏడుస్తోంది. తన పుట్టినిల్లు, స్నేహితులు అందరూ దూరమయ్యారు. ఇప్పుడు తన పక్కన ఉన్న వ్యక్తి ఒక రాక్షసుడు.    కానీ ఇషాంత్ […]

5 min 115 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 26

ఇషాంత్ కోపంగా తన గదిలోకి వెళ్లి తలుపులు గట్టిగా వేసుకున్నాడు. మైరాను గెస్ట్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. ఆ గది చాలా విలాసవంతంగా ఉంది, కానీ మైరాకు అవేవీ కనిపించడం లేదు.    ఆమె మనసంతా వంశీ పైనే ఉంది. ఇషాంత్ మనుషులు వాడిని వదిలేశారా? లేక ఇంకా బందీగానే ఉన్నాడా? కవచంలా ఉన్న ఆ బరువైన పెళ్లి చీరను మార్చుకుని, మామూలు దుస్తుల్లోకి మారింది మైరా.    వెంటనే వణుకుతున్న చేతులతో తన ఫోన్ తీసి వంశీకి […]

3 min 73 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 27

మరోవైపు ఇషాంత్ తన గదిలో సిద్ధమవుతున్నాడు. తెలుపు రంగు పట్టు పంచె, పట్టు కండువా వేసుకుని, విభూతి రేఖలు పెట్టుకుని వాడు అద్దంలో తనను తాను చూసుకున్నాడు.    ఆ ముఖంలో భక్తి కంటే, ఈ సామ్రాజ్యానికి నేనే రాజును అనే గర్వమే ఎక్కువగా కనిపిస్తోంది.   వంశీని విడిచిపెట్టినందుకు వాడు అస్సలు పశ్చాత్తాపపడటం లేదు. పైగా, మైరాను నా కంట్రోల్‌లో ఉంచుకోవడానికి వంశీ ఒక ఆయుధంగా పనికొచ్చాడు అని వాడు మనసులో నవ్వుకున్నాడు.    గది […]

3 min 86 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 28

అస్సలు కుదరదు ఇషాంత్ అని దేవిక గారు గట్టిగా అన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్లినా మాకు అభ్యంతరం లేదు, కానీ మన వంశాచారాల ప్రకారం మూడు రాత్రులు ఈ ఇంట్లోనే గడపాలి.   ఆ తర్వాత నువ్వు ఏమైనా చేసుకో, ఎక్కడికైనా వెళ్ళిపో.. మాకు సంబంధం లేదు. కానీ ఈ మూడు రోజులు మాత్రం నువ్వు ఇక్కడే ఉండాలి అని సుమిత్రాదేవి కూడా మద్దతు పలికింది.   ఇషాంత్ అహంకారానికి ఇది పెద్ద దెబ్బ. తన తల్లి, […]

4 min 66 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 29

  సాత్విక్ ఇచ్చిన సలహా ఇషాంత్ అస్సలు పాటించలేదు సరి కదా, మైరావల్లే తన కుటుంబం అంతా తనకే ఎదురు తిరుగుతున్నారు అని భావించి మైరా మీద మరింత పగ పెంచుకున్నాడు.   శోభనం గదిలో మల్లెపూల సువాసన మైరాకు ఊపిరాడకుండా చేస్తోంది.    ఇషాంత్ తాగి ఉన్న మత్తులో మైరా వైపు అడుగులు వేశాడు. భయంతో ఆమె వెనక్కి వెళ్తూ గోడకు తగిలి ఆగిపోయింది.    ఇషాంత్ ఆమె దగ్గరకు వచ్చి, బలవంతంగా ఆమెను ఎత్తి […]

3 min 68 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 30

మైరా నోటి నుంచి వంశీ పేరు రాగానే, ఆ గదిలోని వాతావరణం ఒక్కసారిగా వేడిఎక్కిపోయింది. ఇషాంత్ కళ్లు ఎర్రబడ్డాయి.    తన భార్య తన ముందే ఇంకొకడి గురించి అంత ఆత్రుతగా అడగడం అతని అహంకారానికి తగిలిన పెద్ద దెబ్బ.    పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న నీళ్ల గాజు గ్లాసును ఇషాంత్ గట్టిగా పట్టుకున్నాడు. అతని చేతి నరాలు ఉబ్బిపోయాయి.   టెన్.. టెన్.. మనే శబ్దంతో ఆ గాజు గ్లాసు నేలకేసి కొట్టాడు. […]

3 min 85 views