New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మిస్టర్ మాన్స్టర్

80 stories Ongoing Family Drama Suspense Romance

                          మిస్టర్ మాన్స్టర్ 1  సమయం ఉదయం 9 గంటలు. ఆకాశం నిండా మేఘాలు పట్టి ఉన్నా, ఆ ఆఫీస్ లోపల మాత్రం ఒక రకమైన సెగ పుడుతోంది. సాధారణంగా ఏ ఆఫీస్‌లోనైనా ఉద్యోగులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, కాఫీ తాగుతూ కనిపిస్తారు. కానీ ఇక్కడ..శ్మశాన నిశ్శబ్దం. అందరి కళ్లూ ఆఫీస్ మెయిన్ ఎంట్రీ వైపు ఉన్న భారీ గ్లాస్ డోర్స్ వైపు ఉన్నాయి.అక్కడ ఉన్న సెక్యూరిటీ చీఫ్ తన మైక్‌లో మెల్లగా చెప్పాడు.. బాస్ ఇస్ కమింగ్ ఆ ఒక్క మాట వినగానే, ఆఫీస్ మొత్తంలో ఉన్న దాదాపు 500 మంది ఉద్యోగులు ఒకేసారి అటెన్షన్‌లో నిలబడ్డారు.బయట ఒక…

Browse Stories

మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 51

రఘువీర్ భూపతి రాజు నోటి నుండి ఆ మాట రాగానే ప్యాలెస్‌లో సమయం ఆగిపోయినట్లయింది.    ఇషాంత్‌కి యాక్సిడెంట్ అయింది అన్న మాట సుమిత్ర గారి గుండెల్లో ఒక ఈటెలా దిగబడింది.    తన చేతిలో ఉన్న ప్లేటు గంటను కింద పెడితే దాంట్లో ఉన్న వస్తువులన్నీ చల్లా చెదురు అయిపోయింది   ఆమె కళ్ళ ముందు చీకటి కమ్మింది. ఇషాంత్ అని గట్టిగా ఒక కేక వేసి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.   మైరా పరుగున వెళ్లి […]

3 min 43 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 52

హాస్పిటల్ ఐసీయూ బయట కాలం స్తంభించిపోయింది. ఇషాంత్ యాక్సిడెంట్ జరిగి ఆరు రోజులు గడిచిపోయాయి.    ఆ ఆరు రోజులు సుమిత్ర గారికి, మైరాకు ఆరు యుగాల్లా గడిచాయి.    ఇషాంత్ తలకు తగిలిన దెబ్బ వల్ల ఇషాంత్ కోమాలోకి వెళ్ళిపోతాడేమో అని అందరూ భయపడ్డారు.    మైరా తెచ్చిన ఆ దుర్గమ్మ కుంకుమ ప్రసాదం వాడి నుదుటిపై ఇంకా అలాగే ఉంది.   ఆరో రోజు ఉదయం.. ఐసీయూలో ఉన్న నర్స్ ఇషాంత్ వేళ్లలో కదలికను […]

3 min 40 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 53

హాస్పిటల్ కారిడార్‌లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఇషాంత్ గదిలో నుండి వినిపిస్తున్న మెషిన్ల చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు.    మైరా గ్లాస్ వెనుక నుండి లోపల పడుకుని ఉన్న ఇషాంత్‌ను చూస్తోంది. ఆ కళ్లలో ఇన్నాళ్లూ తను చూసిన గర్వం లేదు, క్రూరత్వం లేదు..    కేవలం ఏమీ తెలియని ఒక పసివాడి నిస్సహాయత మాత్రమే ఉంది.   సాత్విక్ మెల్లగా మైరా పక్కకు వచ్చి నిలబడ్డాడు. అతని కళ్లలో కూడా తన స్నేహితుడి పరిస్థితి […]

4 min 47 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 54

మైరా తన చేయిని వెనక్కి లాక్కోగానే ఇషాంత్ లోపల ఏదో బాధగా అనిపించింది.    వాడు తన ఖాళీ చేతులను చూసుకుని, మళ్ళీ మైరా వైపు చూశాడు. ఆమె కళ్లలో కనిపిస్తున్న ఆ భయం వాడిని కత్తిలా కోస్తోంది.   సారీ మైరా.. నేను నీకు నచ్చని పని ఏదైనా చేశానా? నా స్పర్శ నీకు అంత ఇబ్బందిగా ఉందా?   మనం భార్యాభర్తలం అని అందరూ చెబుతున్నారు.. కానీ నీ కళ్లలో నా మీద ప్రేమ […]

4 min 45 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 55

ముందు రోజు జరిగిన సంఘటనల వల్ల ఇషాంత్ కి తలపోటు విపరీతంగా పెరిగిపోయింది.    సాత్విక్ ఫైల్స్ చూపిస్తుంటే వాడికి మసకగా గుర్తొచ్చిన ఆ ఏడుపు గొంతు వాడిని కుదిపేసింది.    మైరా ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇషాంత్ గాఢనిద్రలోకి జారుకున్నాడు.    మైరా మాత్రం ఆ రాత్రంతా నిద్రపోలేదు. నిద్రలో ఉన్న ఇషాంత్ ముఖాన్ని చూస్తుంటే ఆమెకు రెండు రూపాలు కనిపిస్తున్నాయి.    ఒకటి తనని హింసించిన రాక్షసుడు, రెండు ఇప్పుడు పసివాడిలా ఏమీ […]

4 min 66 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 56

హాస్పిటల్ నుండి వచ్చాక కొన్ని రోజులు ప్యాలెస్ అంతా సందడిగా ఉంది. మైరా తల్లిదండ్రులు అక్కడే ఉండి ఇషాంత్‌ని కనిపెట్టుకుని ఉన్నారు.   కానీ ఇషాంత్ ఇప్పుడు కోలుకున్నాడు, జ్ఞాపకాలు లేకపోయినా మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిసి వారు వెళ్లడానికి సిద్ధమయ్యారు.   మైరా.. వెళ్తాం తల్లి. అల్లుడు గారు ఇప్పుడు బానే ఉన్నారు. నువ్వు దగ్గరుండి చూసుకో.    నీ ప్రేమలోనే ఆయన మళ్ళీ పాత ఇషాంత్ లాగా మారాలి అని ఆమె తండ్రి చెప్పారు. […]

3 min 35 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 57

గదిలో వాతావరణం చాలా వేడిగా ఉంది. ఇషాంత్ మైరా భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు.   వాడు చూస్తున్న చూపు మైరాను నిలువునా దహించేస్తోంది.   మైరా నా ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పవు, మౌనం నీ సమాధానం కాకూడదు. నువ్వు నా భార్యవా కాదా?    మన మధ్య ఉన్న ఈ అగాధం ఏంటి? నేను నిన్ను తాకడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు పరాయి వ్యక్తిలా ఎందుకు వెనక్కి తగ్గుతున్నావు?   నా మీద నీకు […]

3 min 32 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 58

మరుసటి రోజు ఉదయం ప్యాలెస్ వాతావరణం ప్రశాంతంగా ఉంది, కానీ మైరా మనసులో మాత్రం అలజడి తగ్గలేదు.    రాత్రి ఇషాంత్ నిలదీసిన విధానం ఆమెను ఇంకా భయపెడుతూనే ఉంది. సాకేత్ ఇచ్చిన మాట ప్రకారం, ఇషాంత్ దగ్గరకు వచ్చాడు. ఇషాంత్ అప్పటికే ఏదో దీర్ఘమైన ఆలోచనలో ఉన్నాడు.   ఇషాంత్.. ఏంటి అలా ఉన్నావు అని సాకేత్ అడిగాడు. ఇషాంత్ నిట్టూర్చి, సాకేత్.. మైరాకు నేనంటే ఇష్టం లేదేమో అనిపిస్తోంది.    తను నా భార్య […]

3 min 34 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 59

ఇషాంత్, మైరా మధ్య బంధం ఇప్పుడు ఒక కొత్త చిగురులా వికసించింది. ఇషాంత్ నిముషం కూడా మైరాను వదిలి ఉండలేకపోతున్నాడు.    మైరా కిచెన్‌లో ఉంటే కిచెన్‌లో, తోటలో ఉంటే తోటలో.. వాడు ఆమె వెంటే ఉంటున్నాడు. బిజినెస్ ఫైల్స్, మీటింగ్స్ బాధ్యతలు అన్నీ పక్కన పెట్టేశాడు.   సాకేత్ ఇది గమనించి మొదట సంతోషించినా, ఆఫీస్ పరిస్థితి చూసి కంగారు పడ్డాడు.    ప్రతాప్ భూపతి రాజు ఇదే అదునుగా చూసి కంపెనీ షేర్లను దొంగతనంగా […]

3 min 33 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 60

మైరా కళ్లు తిరిగి పడిపోవడంతో ఈశాంత్ చాలా కంగారు పడి పోయాడు . డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి, ఇషాంత్ గారు శారీరకంగా ఆమెకు ఏమీ లేదు.    కానీ ఆమె విపరీతమైన ఒత్తిడికి లోనవుతోంది. ఏదో టెన్షన్ ఆమె మనసును తొలిచేస్తోంది.    దయచేసి ఆమెను ప్రశాంతంగా ఉంచండి. మెడిసిన్ కన్నా మీ ప్రేమ ఆమెకు ఇప్పుడు చాలా అవసరం అని చెప్పారు.   ఇషాంత్ ఆమెను జాగ్రత్తగా ప్యాలెస్‌కి తీసుకువచ్చాడు. ఇంట్లో సుమిత్ర గారు, […]

4 min 47 views