New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మౌనమే ని భాష

48 stories Ongoing Love Family Drama Suspense

నగరమంతా ఇంకా నిద్రమత్తులో ఉండగానే, శ్రావణి గదిలో చిన్న వెలుగు రేఖలు ప్రసరించడం మొదలయ్యాయి. సరిగ్గా తెల్లవారుజామున ఐదు గంటలు. అలారం మోగక ముందే శ్రావణి కళ్లు తెరిచింది. ఆమెకు అలారంతో పనిలేదు, ఆమెలోని క్రమశిక్షణే ఆమెను మేల్కొల్పుతుంది. మంచం మీద నుండి లేవగానే, తను పడుకున్న దుప్పటిని ఎక్కడా ఒక ముడత కూడా లేకుండా నీట్‌గా మడతపెట్టింది. ఆమె గది ఆమె మనసులాగే చాలా పద్ధతిగా ఉంటుంది.కిటికీ తెరలు జరిపి బయటకు చూసింది. తెల్లవారుజామున వచ్చే ఆ చల్లటి గాలి శ్రావణి ముఖాన్ని తాకినప్పుడు ఆమె పెదవుల మీద ఒక చిన్న మెరుపు లాంటి నవ్వు మెరిసింది. అది కేవలం ఆమెకు, ఆ ప్రకృతికి మాత్రమే తెలిసిన రహస్యం. గది మూలన ఉన్న చిన్న అల్మారాలో…

Browse Stories

మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 21

మనకు తెలిసినంతవరకు శ్రావణి ఉద్యోగం చేస్తుంది అంటే వాళ్ళ అత్తమామల్ని ఎలాగైనా ఒప్పించి పై చదువులు చదువుకుందా.   మరి వాళ్ళ బావ ఏమైనట్టు, ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నట్టు శ్రావణి ఒకటి ఎందుకు ఇక్కడే ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.     ఆ రాత్రి వర్షం వెలిసినా, శ్రావణి మనసులో రేగిన అలజడి మాత్రం తగ్గలేదు.   హాస్పిటల్ నుంచి వచ్చాక తలకి తగిలిన గాయం కంటే, తనని కాపాడిన ఆ అపరిచితుడి గురించిన […]

3 min 43 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 22

  ఆ రాత్రి వంశీకి అస్సలు నిద్ర పట్టలేదు. అందరూ పడుకున్నాక మెల్లగా లేచి మళ్ళీ డైరీ తీయాలనుకున్నాడు..   కానీ ఏదో భయం అతన్ని ఆపుతోంది. శ్రావణి గతం ఒక అగ్నిపర్వతంలా అతని ముందు ఉంది. ఆమెను కాపాడాలా? లేక ఈ నిజాన్ని ఆమెకే చెప్పాలా?     రాత్రి గంభీరంగా మారింది. గడియారం ముల్లులు చేసే శబ్దం తప్ప ఇంట్లో ఏ చప్పుడూ లేదు.   అందరూ నిద్రపోయారని నిర్ధారించుకున్నాక, వంశీ మెల్లగా తన […]

3 min 42 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 23

  ఆ బావ శ్రావణి మెడలో తాళి కట్టేసాడా? శ్రావణి జీవితం అక్కడితో ముగిసిపోయిందా? లేక ఏదైనా అద్భుతం జరిగిందా?   వంశీ ఆ అక్షరాల వెనుక ఉన్న బాధను భరించలేక డైరీని గుండెలకు అత్తుకున్నాడు. శ్రావణీ.. నీకు ఇంతటి అన్యాయం జరిగిందా? ఆ తాళి పడకుండా ఎవరూ ఆపలేదా? అని మౌనంగా రోదించాడు.     గదిలో నిశ్శబ్దం గంభీరంగా ఉంది. వంశీ చేతిలో ఉన్న డైరీ పేజీలు అతని ఆందోళనతో వణుకుతున్నాయి.   పెళ్లి […]

3 min 43 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 24

ఆ రాత్రి వంశీకి ఒక రకమైన ప్రశాంతత దొరికింది. శ్రావణి మెడలో ఆ దుర్మార్గుడి తాళి పడలేదని, పోలీసులు సరైన సమయానికి వచ్చి ఆమెను కాపాడారని తెలుసుకున్నాక, అతని మనసు తేలికపడింది.   ఆ ఆనందంలోనే తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు గదిలోకి వస్తున్నా, వంశీకి ఇంకా ఆ డైరీ చదవాలనే ఆత్రుత ఉంది.    కానీ ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్ ఉండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పుస్తకాన్ని బ్యాగ్ లో  పెట్టి […]

4 min 41 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 25

పార్కులో కూర్చున్న వంశీ చేతిలో డైరీ వణుకుతోంది. శ్రావణి జీవితం ఒక ప్రశాంతమైన నది అనుకుంటే, అది ఉప్పెనలా మారి తనను ఎలా ముంచెత్తిందో చదువుతుంటే వంశీ గుండె తరుక్కుపోతోంది.    ఆ తెల్లటి అంబులెన్స్ లో ఉన్నది శవం కాదు.. విధి ఆడిన వింత నాటకంలో బలైపోయిన శ్రావణి బావ ప్రాణం   అమ్మా.. ఆ అంబులెన్స్ డోర్లు తెరుచుకున్నప్పుడు ఊరంతా నిశ్శబ్దమైపోయింది. పోలీసులు వచ్చి జరిగిన విషయాన్ని మావయ్యకు వివరించారు.    బావను రిమాండ్‌కు […]

3 min 40 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 26

పార్క్ లో కూర్చుని శ్రావణి బావ మరణం వార్త చదివిన వంశీకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తర్వాతి పేజీల్లో ఏముందో చూడాలని ఆత్రుతగా ఉన్నా,    విధి మరోలా తలచింది. మరుసటి రోజు ఉదయం నుంచే వంశీకి ఆఫీస్ పనుల ఒత్తిడి పెరిగిపోయింది. కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన మీటింగ్స్, క్లయింట్లతో చర్చలు..   ఇలా ఒకదాని వెనుక ఒకటి రావడంతో డైరీ వైపు కన్నెత్తి చూసే తీరిక కూడా దొరకలేదు. రెండు రోజుల పాటు […]

3 min 42 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 27

కిటికీ బయట చంద్రుడు మేఘాల చాటున దాక్కుంటున్నాడు. వంశీ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.    చేతిలో ఉన్న డైరీని చూస్తూ శ్రావణి పడుతున్న కష్టాలకు తను చలిస్తున్నాడు. సరిగ్గా తర్వాతి పేజీ తిప్పబోతుండగా అతని ఫోన్ మోగింది.    స్క్రీన్ మీద మాధవ్  (వంశీ ప్రాణ స్నేహితుడు) అని పేరు కనిపించగానే వంశీ ఒక నిట్టూర్పు విడిచి ఫోన్ ఎత్తాడు.   చెప్పురా మాధవ్.. ఈ టైంలో ఫోన్ చేశావ్ అన్నాడు వంశీ గొంతులో అలసటను దాచుకుంటూ. […]

3 min 36 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 28

రోజులు గడిచిపోతున్నాయి. కాలం ఎవరికోసం ఆగదుగా,కానీ వంశీకి మాత్రం ఆ డైరీలోని అక్షరాలు చదువుతుంటే కాలం స్తంభించిపోయినట్టు అనిపిస్తోంది.   ఆఫీస్‌లో ఎన్ని మీటింగ్‌లు ఉన్నా, ఎన్ని ఫైళ్లు ముందున్నా.. అతని మనసు మాత్రం ఆ పాత డైరీలోని శ్రావణి చుట్టూనే తిరుగుతోంది.    ఇంటికి వెళ్ళగానే ఫోన్ పక్కన పడేసి, లైట్ వెలుతురులో ఆ పుస్తకాన్ని తెరిచి ఆమె ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాడు.   మరోవైపు ఆఫీస్‌లో శ్రావణి పరిస్థితి ఒక మూగ యుద్ధంలా ఉంది.   […]

3 min 34 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 29

గదిలో ఏసీ తిరుగుతున్నా వంశీకి మాత్రం ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. చేతిలో ఉన్న డైరీలోని అక్షరాలు అతనికి అక్షరాల్లా కనిపించడం లేదు..   అవి శ్రావణి హృదయం నుంచి చిందుతున్న రక్తంలా అనిపిస్తున్నాయి. ఒక మనిషి ఇంతటి నీచానికి దిగజారుతాడా?    తన ఇంట్లోనే ఉంటూ, తన కొడుకు భార్యగా వచ్చిన పిల్లని, కేవలం భూమి కోసం.. ఆస్తి కోసం వేరే దేశానికో, నగరానికో అమ్ముతారా?    వంశీకి ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. అక్షరాలు కళ్లముందు కదులుతుంటే, […]

4 min 40 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 30

గదిలో ఏసీ గాలి వంశీకి ముళ్ళలా తగులుతోంది. టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాసును అందుకునే ఓపిక కూడా అతనికి లేదు.    డైరీలో శ్రావణి రాసిన ఆ ముంబై అమ్మకం కుట్ర విన్నప్పటి నుండి వంశీ రక్తం మరిగిపోతోంది.    ఆ అత్తామామల ముఖాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ, అతని కళ్ళ ముందు మాత్రం రాక్షసుల్లా మెదులుతున్నారు.    వంశీ వణుకుతున్న చేతులతో తర్వాతి పేజీ తిప్పాడు. ఆ పేజీ మీద ఉన్న అక్షరాలు […]

3 min 58 views