మౌనమే ని భాష – 1
నగరమంతా ఇంకా నిద్రమత్తులో ఉండగానే, శ్రావణి గదిలో చిన్న వెలుగు రేఖలు ప్రసరించడం మొదలయ్యాయి. సరిగ్గా తెల్లవారుజామున ఐదు గంటలు. అలారం మోగక ముందే శ్రావణి కళ్లు తెరిచింది. ఆమెకు అలారంతో పనిలేదు, ఆమెలోని క్రమశిక్షణే ఆమెను మేల్కొల్పుతుంది. మంచం మీద నుండి లేవగానే, తను పడుకున్న దుప్పటిని ఎక్కడా ఒక ముడత కూడా లేకుండా నీట్గా మడతపెట్టింది. ఆమె గది ఆమె మనసులాగే చాలా పద్ధతిగా ఉంటుంది. కిటికీ తెరలు జరిపి […]