New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మౌనమే ని భాష

48 stories Ongoing Love Family Drama Suspense

నగరమంతా ఇంకా నిద్రమత్తులో ఉండగానే, శ్రావణి గదిలో చిన్న వెలుగు రేఖలు ప్రసరించడం మొదలయ్యాయి. సరిగ్గా తెల్లవారుజామున ఐదు గంటలు. అలారం మోగక ముందే శ్రావణి కళ్లు తెరిచింది. ఆమెకు అలారంతో పనిలేదు, ఆమెలోని క్రమశిక్షణే ఆమెను మేల్కొల్పుతుంది. మంచం మీద నుండి లేవగానే, తను పడుకున్న దుప్పటిని ఎక్కడా ఒక ముడత కూడా లేకుండా నీట్‌గా మడతపెట్టింది. ఆమె గది ఆమె మనసులాగే చాలా పద్ధతిగా ఉంటుంది.కిటికీ తెరలు జరిపి బయటకు చూసింది. తెల్లవారుజామున వచ్చే ఆ చల్లటి గాలి శ్రావణి ముఖాన్ని తాకినప్పుడు ఆమె పెదవుల మీద ఒక చిన్న మెరుపు లాంటి నవ్వు మెరిసింది. అది కేవలం ఆమెకు, ఆ ప్రకృతికి మాత్రమే తెలిసిన రహస్యం. గది మూలన ఉన్న చిన్న అల్మారాలో…

Browse Stories

మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 41

వంశీ ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా ఉత్కంఠ నుంచి ఆశ్చర్యంలోకి మారిపోయింది. వంశీ ఆప్యాయంగా పలకరించిన తీరు చూసి అందరూ నోరెళ్లబెట్టారు.    ఆ గదిలో నిశ్శబ్దాన్ని చీలుస్తూ గోపాల్ గారు, “వంశీ! అసలు నీకు ఈ అమ్మాయి ఎలా తెలుసురా?” అని అడిగారు.   వంశీ నవ్వుతూ అందరి వైపు చూసి..అమ్మా, నాన్న.. మీకు గుర్తుందా?    ఒకసారి నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో జాయిన్ చేశాను అని చెప్పాను […]

3 min 27 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 42

హైదరాబాద్ నగరం రాత్రి వేళ వెలుగులతో నిండిపోయి ఉంది.    రవి బైక్ మీద శ్రావణిని ఆమె ఇంటి వైపు తీసుకెళ్తున్నాడు. గాలి శరవేగంగా తగులుతున్నా, శ్రావణి మనసులో మాత్రం ఇందాక వంశీ ఇంట్లో జరిగిన సంఘటనలే తిరుగుతున్నాయి.   ఆ సారె, ఆ బొట్టు, ఆ ఆత్మీయత.. ఆమెకు ఒక కొత్త లోకాన్ని చూపించాయి.   రవి శ్రావణిని ఇంటి దగ్గర దింపాడు. శ్రావణి రవిని ఇంట్లోకి రామ్మని అడిగింది….   దానికి రవి నాకు […]

3 min 33 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 43

కాలం తన వేగంతో తాను వెళ్ళిపోతోంది. వంశీ ఇంటికి శ్రావణి వెళ్ళిన ఆ రోజు నుండి శ్రావణి మనసులో ఎప్పుడూ లేని ఒక కొత్త ఉత్సాహం మొదలైంది.    కానీ అదే సమయంలో లోపల ఒక తెలియని భయం. అందుకే సరస్వతి గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ప్రేమగా పిలిచినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటోంది.   ఆఫీసులో పని ఉంది ఆంటీ ఈరోజు కుదరదు ఆంటీ అంటూ తనను తాను ఆ మమకారం నుంచి […]

4 min 25 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 44

వంశీ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కిటికీ గుండా వస్తున్న చల్లని గాలి శ్రావణి ముఖాన్ని తాకుతున్నా,   ఆమెకు మాత్రం ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. తన కళ్ల ముందు ఉన్నది కేవలం ఒక పుస్తకం కాదు..   తన జీవితం, తన కన్నీళ్లు, తన రహస్యాల భాండాగారం.   శ్రావణి వణుకుతున్న చేతులతో ఆ పుస్తకాల గుట్ట కింద ఉన్న తన డైరీని బయటకు తీసింది.    ఆ రంగు, ఆ అంచులు.. అవును, ఇది తనదే! […]

3 min 35 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 45

హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ కోలాహలంగా ఉన్నా, వంశీ కళ్ళకు మాత్రం ముందు వెళ్తున్న ఆ ఆటో మాత్రమే కనిపిస్తోంది.    శ్రావణి ఆటోలో కూర్చుని పదే పదే వెనక్కి తిరిగి చూస్తోంది.   తన  హ్యాండ్ బ్యాగ్ లో దాచుకున్న ఆ డైరీ ఆమెకు ఒక మండుతున్న నిప్పుకణికలా అనిపిస్తోంది.   వంశీ తన కారును ఆటోకు కొంచెం దూరంలో ఉంచి, ఆమెకు అనుమానం రాకుండా వెంబడిస్తున్నాడు.    శ్రావణి ఒక పాత కాలనీలో ఆటో […]

3 min 19 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 46

శ్రావణి గదిలో కాలం స్తంభించిపోయినట్టు అయిపోయింది. గడియారం ముల్లు తిరుగుతున్న శబ్దం తప్ప మరేదీ వినిపించడం లేదు.    వంశీ ఒక పర్వతంలా ఆమె ముందే నిలబడి ఉన్నాడు. అతని చూపుల్లోని నిశ్చయత చూశాక, ఇక నిజాన్ని దాచడం తన వల్ల కాదని శ్రావణికి అర్థమైపోయింది.   శ్రావణి గోడకు ఆనుకుని కిందకు జారిపోయి కూర్చుంది. కళ్లలో కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. అంతా చదివారు కదా వంశీ గారు..    ఇంకేం వినాలనుకుంటున్నారు? నా గతం ఒక […]

3 min 9 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 47

వంశీ కారు డ్రైవ్ చేస్తున్నాడు కానీ అతని కళ్లు రోడ్డు మీద ఉన్నా, ఆలోచనలు మాత్రం శ్రావణి గదిలోనే ఉండిపోయాయి.    ఆమె కళ్లలోని ఆ భయం, రాములు అనే పేరు వినగానే ఆమె వణికిపోయిన తీరు వంశీని కలచివేస్తోంది. సరిగ్గా అప్పుడే సరస్వతి గారి నుండి ఫోన్ వచ్చింది.   వంశీ ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఏంటి నాన్న.. ఇంట్లో పూజ పెట్టుకుని అంత హడావిడిగా వెళ్ళిపోయావు? ఈరోజుకు లీవ్ పెట్టుకోమన్నాను కదా..    అసలు […]

4 min 7 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 48

శ్రావణి ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అంతవరకు భయంతో, ఒంటరితనంతో నిండిన ఆ గదులు ఇప్పుడు సరస్వతి గారి మాతృత్వపు పరిమళంతో నిండిపోయాయి.    శ్రావణి గుండెల్లో గడ్డకట్టుకుపోయిన బాధ మెల్లమెల్లగా కరుగుతోంది.   సరస్వతి గారు సోఫాలో కూర్చుని శ్రావణిని దగ్గరకు తీసుకున్నారు. శ్రావణి కళ్లలో నీళ్లు తిరుగుతుండటం చూసి ఆవిడ మనసు తల్లడిల్లిపోయింది.    చూడు శ్రావణీ.. నువ్వు ఒంటరి దానివి అని ఎప్పుడూ అనుకోకు. నీకు ఎవరు ఉన్నా లేకపోయినా, ఈ ఆంటీ […]

3 min 12 views