New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మౌనమే ని భాష

48 stories Ongoing Love Family Drama Suspense

నగరమంతా ఇంకా నిద్రమత్తులో ఉండగానే, శ్రావణి గదిలో చిన్న వెలుగు రేఖలు ప్రసరించడం మొదలయ్యాయి. సరిగ్గా తెల్లవారుజామున ఐదు గంటలు. అలారం మోగక ముందే శ్రావణి కళ్లు తెరిచింది. ఆమెకు అలారంతో పనిలేదు, ఆమెలోని క్రమశిక్షణే ఆమెను మేల్కొల్పుతుంది. మంచం మీద నుండి లేవగానే, తను పడుకున్న దుప్పటిని ఎక్కడా ఒక ముడత కూడా లేకుండా నీట్‌గా మడతపెట్టింది. ఆమె గది ఆమె మనసులాగే చాలా పద్ధతిగా ఉంటుంది.కిటికీ తెరలు జరిపి బయటకు చూసింది. తెల్లవారుజామున వచ్చే ఆ చల్లటి గాలి శ్రావణి ముఖాన్ని తాకినప్పుడు ఆమె పెదవుల మీద ఒక చిన్న మెరుపు లాంటి నవ్వు మెరిసింది. అది కేవలం ఆమెకు, ఆ ప్రకృతికి మాత్రమే తెలిసిన రహస్యం. గది మూలన ఉన్న చిన్న అల్మారాలో…

Browse Stories

మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 6

ఆదివారం కావడంతో వంశీ ఇంట్లో అందరూ రిలాక్స్‌గా ఉన్నారు. గోపాల్ గారు బాల్కనీలో పేపర్ చదువుతుంటే, సరస్వతి గారు వంటింట్లో టిఫిన్ చేస్తున్నారు. వంశీ ఇంకా నిద్రలోనే ఉన్నాడు.   రవి తన రూమ్‌లో ఏదో వెతుక్కుంటున్నాడు. అన్నయ్యా నా పెన్ డ్రైవ్ నీ బ్యాగ్‌లో పెట్టానా ఒకసారి చూడు అని అరిచాడు.    వంశీ నిద్రమత్తులో అక్కడ సోఫా మీద బ్యాగ్ ఉంది చూడు రవీ.. నాకేం తెలియదు అని బదులిచ్చి మళ్ళీ దుప్పటి ముసుగు […]

3 min 141 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 7

ఇందులో నీ బాధలు ఉన్నా, నీ రహస్యాలు ఉన్నా అవి నా దగ్గర చాలా గౌరవంగా, భద్రంగా ఉంటాయి. కేవలం నిన్ను చేరుకోవాలనే తాపత్రయంతోనే నేను ఈ సాహసం చేస్తున్నాను. ప్లీజ్.. నన్ను తప్పుగా అనుకోకు అని మొదటి పేజీ తెరుస్తాడు.   వంశీ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. చేతిలో ఉన్న డైరీ ఒక పుస్తకంలా కాకుండా, ఒక మనిషి భారమైన హృదయంలా అనిపిస్తోంది అతనికి.   వంశీ మెల్లగా, చాలా గౌరవంగా మొదటి పేజీని తిప్పాడు.అతను […]

3 min 102 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 8

ఆ రాత్రంతా శ్రావణికి కంటిమీద కునుకు లేదు. కొత్త డైరీలో రాసిన ఆ నాలుగు ముక్కలు ఆమెలోని ఆవేదనను తగ్గించలేకపోయాయి.    తెల్లవారుజామునే నిద్రలేచి, గదిలో ఉన్న వెలుతురును చూసి ఆమెకు ఎందుకో భయం వేసింది. తన సర్వస్వం అయిన ఆ డైరీ ఇప్పుడు,   ఏ అపరిచితుడి చేతుల్లో ఉందో అన్న ఆలోచన ఆమెను నిముషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.   ఆ రోజు శ్రావణి ఆఫీస్‌కు గంట ముందే బయలుదేరింది. ఆశ చావలేదు. […]

3 min 92 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 9

మరుసటి రోజు వంశీ ఆఫీస్ కి వెళ్ళాడు.కానీ వంశీకి ఆ రోజు ఆఫీసులో మనసు అసలు కుదురుగా లేదు. తన టీమ్ మెంబర్స్ ఏదో అడుగుతున్నా,     బాస్ ఏదో చెప్తున్నా అతని కళ్ల ముందు మాత్రం ఆ పాత డైరీ అక్షరాలే కదులుతున్నాయి. ఒక చిన్న పాప అంతటి నరకాన్ని ఎలా భరించింది అన్న ప్రశ్న అతన్ని వేధిస్తోంది.   సాయంత్రం ఆరు గంటల వరకు ఆగలేకపోయాడు. ఒక ఇంపార్టెంట్ పని ఉందని అబద్ధం […]

3 min 95 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 10

నాన్న  నీకు కవిత్వం అంటే ఇష్టం కదా, నీ కూతురు రాసిన ఈ మాటలు బాగున్నాయని ఒక్కసారి నా కలల్లోకి వచ్చి చెప్పవా….   వంశీ ఆ అక్షరాలను చదువుతుంటే అతని కళ్లు నీళ్లతో నిండిపోయాయి. ఆ డైరీ పేజీ మీద ఆమె చిన్నప్పుడు పెన్నుతో వేసిన బుజ్జి బుజ్జి బొమ్మలు,    ఆమె వేదన చూస్తుంటే వంశీకి ఆమెను ఇప్పుడే వెళ్లి గట్టిగా హత్తుకుని నేనున్నాను నీకు తోడుగా అని చెప్పాలనిపించింది.   ఎంతటి ధైర్యం […]

3 min 91 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 11

సంధ్యా సమయం ఆకాశం మెల్లగా రంగులు మారుతోంది. వంశీ, మాధవ్ ఇద్దరూ ఒక చెరువు గట్టు పక్కన కూర్చుని ఉన్నారు.    వంశీ మనసంతా ఆ గదిలో వదిలేసి వచ్చిన ఆ పాత డైరీ మీదనే ఉంది.మాధవ్ తన స్నేహితుడి ముఖంలో ఉన్న గాంభీర్యాన్ని చూసి మెల్లగా అడిగాడు.   అవును వంశీ. ఇంతకీ ఆ డైరీలో ఆ అమ్మాయి పేరు ఏం రాసుకుంది,అసలు తను ఎవరు..   వంశీ నిట్టూర్పు విడిచి, అదే పెద్ద సమస్య […]

3 min 84 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 12

మాధవ్ తో ఆ సాయంత్రం జరిగిన చర్చ తర్వాత వంశీ ఇంటికి చేరుకున్నాడు.    ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. వంటగదిలో వాళ్ళ అమ్మ సరస్వతి గారు ఏదో పనిలో నిమగ్నమై ఉన్నారు.   తండ్రి, తమ్ముడు ఏదో పని మీద బయటకు వెళ్ళారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం వంశీకి కలిసి వచ్చింది. అడుగులు వేసుకుంటూ తన గదిలోకి వెళ్లి, తలుపు వేసుకున్నాడు.   వంశీకి ఇప్పుడు ఆ డైరీని చదవడం ఒక బాధ్యతగా, ఒక మధురమైన […]

4 min 86 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 13

గదిలో ఒంటరిగా కూర్చున్న శ్రావణి చేతిలో ఉన్న ఆ కొత్త డైరీ తెల్లటి పేజీలు తనని వెక్కిరిస్తున్నట్టు ఉన్నాయి.   పాత డైరీ పోయిన బాధ తనని లోలోపల కలిచివేస్తోంది. కళ్లు మూసుకోగానే ఆ పాత డైరీలోని అక్షరాలు, తన తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఒకదాని తర్వాత ఒకటి కళ్లముందు కదలాడుతున్నాయి.    కానీ ఆ జ్ఞాపకాల పొరల మధ్య నుండి ఒక కొత్త వ్యక్తి జ్ఞాపకం వస్తోంది.నెమ్మదిగా పెన్ను పట్టి ఆ కొత్త డైరీలో ఇలా రాయడం […]

4 min 82 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 14

ఆఫీసులో కీబోర్డ్ శబ్దాలు, ఫైళ్ల హడావిడి మధ్య శ్రావణి మనసు మాత్రం నిలకడగా లేదు.    ఇంటి ఓనర్ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. పక్కనే కూర్చున్న స్నేహకు శ్రావణి ముఖంలో కనిపిస్తున్న దిగులు అర్థమైంది.   ఏమైంది శ్రావణి,ఇంకా ఆ ఇల్లు గురించే ఆలోచిస్తున్నావా. నేను కూడా వెతుకుతున్నాను, కానీ ఆఫీస్ కి దగ్గర్లో ఏదీ దొరకడం లేదు అంది స్నేహ ఆందోళనగా.   శ్రావణి ఒక నిట్టూర్పు విడిచి, అవును […]

3 min 86 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 15

ఆరోజు వంశీకి ఆఫీసులో అస్సలు ఏకాగ్రత కుదరలేదు. ఎప్పుడెప్పుడు ఆ డైరీని తెరుద్దామా, ఆ శ్రావణి జీవితంలో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం అని అతని మనసు ఉవ్విళ్లూరుతోంది.   కానీ బ్యాగ్ లో ఉన్న ఆ పుస్తకాన్ని తీయడానికి ఒక్క క్షణం కూడా ఖాళీ దొరకలేదు.   ఆఫీస్ వర్క్ ఒత్తిడి ఒకవైపు, తన చుట్టూ ఉండే కొలీగ్స్ హడావిడి మరోవైపు.మధ్యాహ్నం లంచ్ టైమ్ అయింది.   హమ్మయ్య.. ఇప్పుడు చదువుకోవచ్చు అనుకుని వంశీ […]

4 min 86 views