ఫ్లాట్‌మేట్స్ ❤️🏠
ఫ్లాట్‌మేట్స్❤️ ఒకే ఇల్లు.. రెండు మనసులు.. మొదలైన కొత్త కథ! Episode 1 – అనుకోని పరిచయం ❤️ హైదరాబాద్... ఉదయం తొమ్మిది గంటలు. నగరం అప్పుడే తన పనుల్లో బిజీ అయిపోయింది. రోడ్ల మీద వాహనాల హడావిడి, ఆఫీసులకు వెళ్లే వాళ్ల పరుగులు, ఎక్కడ చూసినా ఏదో ఒక సందడి. అదే సమయంలో ఒక క్యాబ్ వచ్చి ఓ అపార్ట్‌మెంట్ ముందు ఆగింది. క్యాబ్‌లో నుంచి రెండు పెద్ద బ్యాగులు, ఒక చిన్న హ్యాండ్‌బ్యాగ్ తీసుకుంటూ కిందకి దిగింది మేఘన. ఇరవై మూడు సంవత్సరాల వయసు. చూడటానికి చాలా అందంగా, ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే అమ్మాయి. తనకు నచ్చినట్టు జీవించడం, చిన్న చిన్న విషయాలకే సంతోషపడటం తన అలవాటు.…