New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రావమ్మా.. మహాలక్ష్మి

30 stories Ongoing Family Drama Love Inspirational

తూరుపు వెలుగు రేఖలు పరచుకుంటుంటే.. మరో వైపు పక్షుల కిలకిలా రావాలు సన్నగా వినబడుతుంటే.. లేలేత సూర్య రశ్మి పడి.. తెల్లని పాలరాతి సౌధంలా ఉన్న ఆ ఆధునాతన పాలస్ కొత్త వెలుగులు చిమ్ముతున్నట్టు ఉంది. భవంతి చుట్టూ పరిమళ భరిత పొడవైన పూల మాలలు వేలాడదీసి ఉన్నాయి. వాటి పరిమళం గాలిలో వ్యాపించి ఒక మత్తయిన సువాసన ఆ ప్రాంతం అంతా గాలిలో వ్యాపించి ఉంది. భవనం ముందు ఒకవైపు లాన్ మరో వైపు ఖరీదైన కార్లు పార్క్ చేయబడి ఉన్నాయి. భవనం ఎత్తయిన స్తంబాల మీదుగా గంభీరంగా నిలబడిబట్టు ఎవరినో ఆహ్వానించ డానికి సన్నధ్ధమయినట్టు సర్వాలంకార భూషిత అయి ఉంది. భవనం ముందు విదేశాలనుండి తెప్పించిన టైల్స్ తో ఏర్పాటు చేసిన రాచబాట.. 50 మీటర్స్…

Browse Stories

రావమ్మా.. మహాలక్ష్మి

రావమ్మా.. మహాలక్ష్మి – 1

తూరుపు వెలుగు రేఖలు పరచుకుంటుంటే.. మరో వైపు పక్షుల కిలకిలా రావాలు సన్నగా వినబడుతుంటే.. లేలేత సూర్య రశ్మి పడి.. తెల్లని పాలరాతి సౌధంలా ఉన్న ఆ ఆధునాతన పాలస్ కొత్త వెలుగులు చిమ్ముతున్నట్టు ఉంది.    భవంతి చుట్టూ పరిమళ భరిత పొడవైన పూల మాలలు వేలాడదీసి ఉన్నాయి. వాటి పరిమళం గాలిలో వ్యాపించి ఒక మత్తయిన సువాసన ఆ ప్రాంతం అంతా గాలిలో వ్యాపించి ఉంది.    భవనం ముందు ఒకవైపు లాన్ మరో […]

5 min 54 views
రావమ్మా.. మహాలక్ష్మి

రావమ్మా.. మహాలక్ష్మి – 2

గోవా..దిల్వారా బీచ్ కి కేవలo ఒక కిలోమీటర్ దూరం లో ఉన్న పెద్ద బంగళా అది.    ఎప్పుడూ సంతోషం తాండవించే మహల్ లాంటి ఆ బంగళా లో ఆరోజు విషాదం నాట్యం చేస్తున్నట్టు ఉంది.    ఆరోజు గోవా లో న్యూస్ చానెల్స్, ప్రసిద్ద చానెల్స్ కూడా ఒక్క విషయం గురించే పదేపదే న్యూస్ లైన్ లో వేస్తున్నాయి.   ప్రముఖ వ్యాపార దిగ్గజం, గోవా ని శాసిoచ గలిగే వ్యక్తి ఆనంద్ ప్రతాప్ ఆరోజు […]

5 min 35 views
రావమ్మా.. మహాలక్ష్మి

రావమ్మా.. మహాలక్ష్మి – 3

అమ్మమ్మ… ఊరుకో.. నువ్వే ధైర్యం కోల్పోతే.. ఎలా?? అన్నాడు వీర్.    వీర్..ఏ ఆడదానికి అయినా తండ్రి, భర్త, కొడుకు, మనవడు ధైర్యం అవుతారు.. కానీ నేను.. వాళ్లందర్నీ కోల్పోయాను.. నా మనసు ఇంకా ఈ విషయం నమ్మలేక పోతుంది.. ఇకపై.. ఆనంద్ పిలుపు వినపడదు.. నా మనవడి మాట నా చెవికి చేరదు. నా కోడలు నీలిమ సందడిగా  తిరిగేది.. ఈ ఇల్లే శూన్యం అయిపోతుంది వీర్.. అంది బాధగా అంజనీ దేవి.    అమ్మమ్మ.. […]

5 min 38 views
రావమ్మా.. మహాలక్ష్మి

రావమ్మా.. మహాలక్ష్మి – 4

సుప్రజా.. పసుపు దంచి పెట్టి ఉంచాను.. కారం కూడా రెడీ గానే ఉంది.. ప్రణతి కోసం అరిసెలు, మురుకులు చేయించాను.. పిల్ల వచ్చేసరికి మైసూర్ పాక్ కూడా చేపించి ఉంచుతాను.. అంటూ చెప్తున్న తల్లి మాటలు వినకుండా పరధ్యానం లో ఉంది సుప్రజ.    సుప్రజా.. నేను మాట్లాడుతూనే ఉన్నాను.. నువ్వెంటి ఏదో ఆలోచన లో ఉన్నట్టున్నావు.. అంది రామాయమ్మ కూతురి ముఖం చూస్తూ.    అమ్మ.. ఈరోజు తో మహా చదువు పూర్తవుతుంది.. మా ఆయన […]

5 min 18 views
రావమ్మా.. మహాలక్ష్మి

రావమ్మా.. మహాలక్ష్మి – 5

ఏంటి అలా చూస్తున్నారు?? ఈ ఆస్థి మా రక్తమే అనుభవించాలి.. ఇది నా స్వార్థం కావొచ్చు మరేదైనా కావొచ్చు.. కానీ.. నా భర్త, నా బిడ్డ కష్టార్జితం అయిన ఈ ఆస్థి ఎప్పటికి.. ఏ ఒక్కరికో అనాచితo గా దక్కకూడదు.. అంది ఆమె స్థిరంగా.    అప్పుడే అక్కడికి వచ్చిన వీర్, నిర్మల షాకింగ్ గా ఆమె వైపు చూస్తున్నారు.    కానీ అంజనీ దేవిగారు.. మీ బిడ్డ ఆనంద్, అతని బిడ్డ శరత్ చంద్ర కూడా […]

5 min 20 views