ష్…!!
రేయ్ రవి... ఆ సౌండ్ తగ్గించరా బాబు..! నువ్వు నడిపే స్పీడ్కే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా ఆ స్పీకర్ సౌండ్‌కి గుండెలు అదురుతున్నాయి!"కారు వేగానికి అటూ ఇటూ ఊగిపోతున్న తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి సీట్‌ని గట్టిగా పట్టుకుంటూ అరిచింది నిత్య.కానీ ఆమె మాటలు ఆ కారులో మోగుతున్న మ్యూజిక్ ముందు తేలిపోయాయి.ధమ్... ధమ్... ధమ్...!మ్యూజిక్ సిస్టం బాస్ సౌండ్‌కి కారు డోర్లు సైతం కంపిస్తున్నాయి. కార్ వేగానికి బయట గాలి, కార్ విండోస్ని బలంగా తాకుతుంటే, ఇంజిన్ చేసే గాండ్రింపు ఆ మ్యూజిక్‌కి తోడైంది.వ్రూమ్... వ్రూమ్... వ్రాఆఆమ్...!రోడ్డుపై దూసుకెళ్తున్న స్పోర్ట్స్ కార్ స్పీడోమీటర్‌లో ముల్లు అంతకంతకూ పైకి వెళ్తోంది."అరేయ్ రవి బ్రో! ముందు రోడ్డు చూడు రా! స్పీడోమీటర్ చూస్తుంటే నా…