New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Dark love – 4
Dark love 4 min read

Dark love – 4

ఇంట్లో చెప్పావా ?? అడిగాడు అతడిలో ఒక ప్రళయాన్నే దాస్తు !! 

 

 

చెప్తే… కాలేజ్ కూడా మానిపించేసి ఇంట్లో ఉంచేస్తారు ఆర్య.. చెప్పాలంటే భయంగా ఉంది… అమ్మ కి చెప్పాలనుకుంటే తను నా దగ్గర ఓపెన్ గా ఉండదు 

 

 

ఎన్ని రోజులు నుండి ఇలా టార్చర్ చేస్తున్నాడు ? 

 

 

తెలీదు…. నేను క్యాజువల్ గా తీస్కొన్నా ఆబ్సెర్వ్ చేసుకోలేదు…. వాడు కావాలనే బుక్ కింద పడేసి తీస్తున్నట్టు నా కాలు మీద నొక్కి చెయ్ పెడుతూ లేవడం చేస్తున్నాడు….. 

 

 

మట్టి బుర్ర కి ఇలాంటివి ఎందుకు అర్ధమవుతాయి… ఎప్పుడు పక్కనున్న వాళ్ళతో సొల్లు కొట్టామా… తిన్నామా… కోతులను వెనకేసుకొని తిరిగామ ఇదేగా ని పనని చిరాగ్గా నిల్చుంటు టైమ్ అయింది ఇంటికి వెళ్లు అన్నాడు ఆర్య 

 

 

నీకు చెప్తే వాడి నుండి తప్పించుకోవడానికి ఏమైనా సలహా ఇస్తావ్ అనుకున్నా… కాని నాకే చివాట్లు పెడుతున్నావా ? 

 

 

ఒళ్ళు మండితే అవే వస్తాయి… టైమ్ అయింది వెళ్ళమంటున్నా వినపడలేదా ??

 

 

 

వెళ్ళిపోతాలే… నీకు ఈ మధ్య ప్రేమ తగ్గిపోయింది…. ఎప్పుడు చూసినా ఉండమనేవాడివి.. ఈరోజు మాత్రం వెల్లిపొమ్మంటున్నావ్…. ఐ హేట్ యూ అని ఆర్య చేతిని కసితీరా గిల్లేసి వెళ్ళిపోతుంది 

 

 

టీచర్స్ తో సరదాగా ఉండటం అలవాటు…. దానివల్ల తేడా లేట్ గా తెలిసింది… ఆ మాత్రం దానికే అలా తిడతాడా… అని గొనుక్కుంటూ వెళ్తుంటే

 

ఏమైందే మళ్ళీ ఏడ్చుకొని వస్తున్నావ్ ??అడిగింది కిన్నెర

 

 

ఇంకేం అవ్వాలి…. నన్ను పొమ్మన్నాడు…. పద పోదాం 

 

 

వెళ్తున్న దిశ ని చూస్తూనే పక్కనున్న చెట్టుకి పంచ్ ఇచ్చాడు ఆర్య…. చెయ్ తిమ్మిరి పట్టి అతడికి పది నిమిషాల వరకు నొప్పనేదే తెలియకుండా చేసింది… ఆ తరువాత మెల్లగా కారుతున్న రక్తపు బొట్లుకి నొప్పి ఒళ్ళంతా తెలుస్తుంటే కేర్చీఫ్ చుట్టి రింగ్ అవుతున్న కీ పాడ్ మొబైల్ లిఫ్ట్ చేసాడు  

 

 

చెప్పరా కరణ్…..

 

 

మామ… దావత్ ఇస్తా అన్నావ్… కనబడకుండా పోయావ్… గల్లీలో మన పోరోళ్ళందరం వెయిట్ చేస్తున్నాం… 

 

 

 

ఈరోజుకి పైసల్ లేవు బే… అబ్బు ని అడిగితే ఇంట్లో అంట్లు తోముకొ పార్టీ లు ఎందుకురా అని నా పరువు తీస్తున్నాడు…. సెమ్ ఎగ్జామ్స్ అయ్యాక ఇస్తాలే… మనోళ్లందరికీ అదె చెప్పి పంపేయ్ !! 

 

 

అరేయ్…. మా ఆశలు మీద నీళ్ళు చల్లకురా పాపం చుట్టుకుంటుంది !!కనీసం బీర్ అయినా ఇప్పించరా అనేసరికి కాల్ కట్ చేసేస్తాడు ఆర్యన్ 

 

 

ఆర్యన్ ఇంటికి వెల్లిమప్పటికీ బేగం వీధిలో పిల్లలందరికీ చాకోలెట్స్ పంచుతూ ఉంటుంది… 

 

 

ఆర్య….టేబుల్ మీద బిర్యానీ ఉంది స్వీటీ వాళ్ళ ఇంటికి వెళ్లి ఇచ్చేసిరా అన్నారు 

 

 

నాకు రేపు టెస్ట్ ఉంది… నువ్వే ఇచ్చుకో… అని రూమ్ కి వెళ్లిపోయాడు

 

 

పదే పదే… దిశ ను మరొకడు ముట్టుకున్నట్టే మైండ్ లో తిరుగుతుంటే ఆరోజు నుండి నిద్రకు కరువై….. కాలేజ్ కు దూరం అయ్యాడు

 

 

 

ఇంటర్ సెక్షన్….. డిగ్రీ సెక్షన్ వేరు వేరుగా ఉంటాయి

 

 

ఆర్య కోసం దిశ వెళ్లినా అతడు పట్టించుకోకపోతుండేసరికి కోపంగా…. ముడు రోజులకు ఒక సారి లవ్ స్పాట్ లో వెయిట్ చేస్తుంటుంది 

 

అక్కడకి కూడా దిశ కు ఎదురు పడడు….. 

 

 

దిశ ఏమైందే… ఆర్య రావట్లేదు ?? అడిగింది కిన్నెర 

 

 

ఏమో నాకేం తెలుసు… మాట్లాడితే పొడి పొడిగా తిన్నావా ఉన్నావా అన్నట్టు మాట్లాడుతాడు….. చాలా కోపమొస్తుంది అని ఏడుస్తూ… పద ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంటుంది 

 

 

దిశ ను దూరం నుండి చూస్తున్న ఆర్య…. వెళ్ళిపోతున్న దిశ నే ఫాలో చేస్తూ తను ఇంటికి వెళ్ళాక అతడు వెను తిరుగుతాడు 

 

 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

 

 

 

అప్పటికే రెండు వారాలు గడిచిపోగా….

ఓరోజు రాత్రి ఆర్య క్యాప్ ఉన్న జాకెట్ వెస్కొని నడుచుకొని వెళ్తుండగా సాహిల్ బైక్ కు అడ్డుపడతాడు ఆర్య

 

 

అన్నయ్య నువ్వెంటి ? ఈ టైమ్ లో….? ఆర్య లో చిన్నపాటి కంగారు

 

 

నేను అడగాల్సింది నువ్వు అడుగుతున్నావేంట్రా ?? టైమ్ పది అయింది… ఇంటికి వెళ్లకుండా రోడ్డు మీద తిరుగుతున్నావేంటి ?? 

 

 

హహ….  ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్లాను…. వచ్చేటప్పటికీ ఇంత టైమ్ అయింది… అంటూ సాహిల్ బైక్ వెనక కూర్చున్నాడు ఆర్య

 

 

తమ్ముడి దగ్గర ఏదో స్మెల్ వస్తున్నా… దుబారా గా తిరుగుతాడు కాబట్టి పెద్దగా పట్టించుకోడు సాహిల్.

 

 

దిశ మాట్లాడటానికి ప్రయత్నించినా ఆర్య నుండి రెస్పాన్స్ రాకపోతుంటే ఇంట్లో వాళ్ళ ముందు ఏడవలేక….. తన గదిలో తోడుగా పడుకునే చెల్లి ముందు ఏడవలేక దుప్పటే ఆమెకు తోడైంది 

 

 

మరుసటి రోజు కాలేజ్ వదిలివేసే సమయంలో ఆర్య సింగిల్ బుక్ చేతిలో పట్టుకొని వెళ్ళిపోతుండగా… అన్న అని పిలుస్తుంది కిన్నెర 

 

 

 

ఎవరు అని వెనక్కి తిరిగి చూసి… చెప్పు కిన్నెర అన్నాడు నార్మల్ వాయిస్ తో 

 

 

దిశ నీకు ఈ చీటీ ఇమ్మని చెప్పింది…..అంటూ భయంగా ఎవరైనా చూస్తారేమో అని ఆర్య చేతిలో ఆ చీటీ పెట్టి పారిపోతుంది గిటార్ బేబీ

 

 

ఆ చీటీ చూసి ఆర్య వారి లవ్ స్పాట్ కి వెళ్ళినప్పటికీ టాప్ అండ్ లెగ్గిన్ లో దిశ కూర్చొని ఉంటుంది 

 

 

దిశ ఏంటిది అని అడిగాడు ఆర్యన్ 

 

 

నేను నీకు బ్రేకప్ చెప్పేసా…. ఇప్పుడు నీకు నచ్చిన వాళ్ళతో ఊరేగు….  అంటూ నిలబడుతుంది 

 

 

నేను ఏ అమ్మాయితో అయినా మాట్లాడటం చూసావా ? 

 

 

చూడలేదు…. కాని నీకు కావలసింది ఇదే అని అర్ధమవుతుంది ఆర్య

 

 

నేను నా దిశ ని తప్ప ఇంకో అమ్మాయితో మాట్లాడను ఇది నిజం !! నువ్వు తప్పుగా ఉహించుకుంటే సోరి !!

 

 

అనుకునేలా నువ్వే చేస్తున్నావ్ ….నన్ను అవాయిడ్ చేస్తున్నావ్ …. ని బర్త్ డే రోజు నీతో గొడవ పడకుండా ఉండాల్సింది… నాదే తప్పని సోరి చెప్పడానికి ట్రై చేసినా కనీసం నా వైపు చూడట్లేదు…. 

ఎన్ని సార్లు మి క్లాసెస్ దగ్గరకు వచ్చాను ! కనీసం పట్టించుకున్నావా ? పోని అది వదిలేయ్….. ఇక్కడ మన ప్లేస్ లో కూడా నీకోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడకి కూడా రాలేదు…..బిజి గా ఉన్నావని అనుకోవడానికి ఛాన్సే లేదు… ఎంత బిజీ ఉన్నా నా కోసం టైమ్ స్పెండ్ చేస్తావ్…. ఎక్సట్రా క్లాస్ కూడా మానేశావ్…. రోజు నాకు నేను మోటివ్ చేసుకోవడానికి రీసన్స్ తగ్గిపోతున్నాయి…. ఇంకేం చెయ్యమంటావ్… అందుకే లాస్ట్ మీట్ అని పేపర్ పంపించా… ఇప్పుడైనా వచ్చావ్ థాంక్స్.. అంటు కోపంగా వెక్కుతూనే ఏడుస్తూ మరోవైపు తిరుగుతుంది

 

 

బంగారం బాగా హర్ట్ అయినట్టుంది…. దీనికి కోపమొస్తే నాలుగు పీకుతుంది గాని… ఏడుస్తూ దూరం వెళ్ళిపోవాలి అనుకోవడం ఫస్ట్ టైమ్ చూస్తున్న….. సోరి అంటూ తన చెంపల మీద చేతులేసి  కన్నీళ్లు తుడుస్తూ  ఈ మంత్ ఎండింగ్ వరకు నీకు దూరంగా ఉండాలనే అనుకున్నాను… కాని ఇలా రప్పిస్తావ్ అనుకోలేదు… అంటూ లైట్ గా హగ్ చేసుకున్నాడు ఆర్య

 

 

దిశ ఇద్దరి మధ్యన చేతులు అడ్డుగా పెట్టి దూరం జరుగుతూ నన్ను ఈ మంత్ అంతా ఏడిపించాలి అనుకున్నావా ? అసలు ని ఉద్దేశమేంటి ఆర్య అని అడుగుతుంది పేలగా

 

 

దిశ ను వెనక బెంచ్ మీద కూర్చోబెట్టి  ఆమె పక్కన కూర్చుంటు ఒడిలొ తల పెట్టుకొని ముందు నువ్వు ట్యూషన్ కి ఎందుకు వెళ్లట్లేదు చెప్పు….? అని అడిగాడు

 

 

 

 

ఇంకా ఉంది……..❤️ 

 

 

ఏమనిపిస్తుంది 🧐🧐🤓🤓 ??