Dark love – 5
దిశ ను వెనక బెంచ్ మీద కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చుంటు ఒడిలొ తల పెట్టుకొని ముందు నువ్వు ట్యూషన్ కి ఎందుకు వెళ్లట్లేదు చెప్పు….? అని అడిగాడు
ట్యూషన్ సార్ కు ఓంట్లో బాలేదు… హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారంట !! రెండు వారాలు క్లాసెస్ ఏం జరగకపోతే వెళ్లడం ఫీస్ కట్టడం ఎందుకు దండగ అని నాన్న వద్దనేశారు
హ్మ్… మంచిది జరిగిందిలే… అలాంటి వాడికి అలాగే జరగాలి అంటాడు సైడ్ స్మైల్ తో !!
నువ్వు అడిగింది చెప్పానుగా… ఇక లెగు…. ఇన్ని రోజులు నన్ను ఏడిపించావ్ ఇప్పుడేమో కబుర్లు చెప్పి కోపం పోగొట్టడానికి చూస్తావ్…. అంటూ అతడి తలని తొస్తుంది
అబ్బా….. ఎన్ని రోజులు మాట్లాడకపోయినా మనం విడిపోము అని మనకి నమ్మకం ఉంటే చాలే…..!!!
నాకు ఆ విషయం ముందు చెప్పలేదని చాలా కోపం వచ్చింది… ఆ కోపంలోనే మాట్లాడకుండా ఉన్నాను… ఇక నుండి అలా చెయ్యనుగాక చెయ్యను కాస్త కనికరించవే అంటూ దిశ నడుము కి అడ్డగా మొఖం అద్దుతాడు
ఆవ్.. ఆర్య.. ఏం చేస్తున్నావ్ !!?? ఏదైనా కూర్చొని మాట్లాడుకుందాం ఇలా నువ్వు పడుకుంటే తప్పుగా ఉంటుంది లే….!!
ఇప్పటి వరకు ముద్దే లేదు…. ఇంకా తప్పంటా !!! పోవే అని మొఖం చిట్లించి చేతులు దిశ నడుము మీదుగా వెనక్కి పోనించి పట్టుకున్నాడు
నేను ఇంకా ని మీద కోపంగానే ఉన్నాను నన్ను అవాయిడ్ చేసినందుకు !!!
ఒక చాక్లెట్ ఇస్తా….
రెండు వారాల కోపానికి ఒక చాక్లెట్ చెల్లా ?? నైట్ టైమ్ ఏడ్చాను కూడా !!
నిజంగా ఏడ్చావా….. ??
హ్మ్….
సోరి దిశ….. అంటాడు హార్ట్ ఫుల్లి !!
మౌనంగా ఆర్య జుట్టులో చేతిని పెట్టి నిమురుతుండేసరికి ఆమె వైపు చూసాడు
దిశ మొఖానికి అడ్డుగా ఆమె పరువాలు కనబడగానే వెన్ను మీదున్న అతడి చేతిని నొక్కుతూ ఏయ్…. సోరి యాక్సెప్ట్ చేయవే అని స్లో వాయిస్ తో అంటాడు
పో నేను చెయ్యను….
ప్లీజ్ దిశ అని మెల్లగా ఆమె ఒడిలో నుండి లేచి హగ్ చేస్కునే సరికి
ఎమోషనల్ అవుతున్నాడేమో అనుకుంటూ దూరం జరపకుండా ఆర్య చుట్టు చేతులు వేసి ఈసారికి ఫర్గీవ్ చేస్తా….. కాని ఇంకోసారి దూరం పెడితే మాత్రం ఒప్పుకోను…కశ్చితంగా కొడతాను అంటుంది చిరు కోపంగా
హ్మ్… ని ఇష్టం… అని మెల్లగా ఆమెను ఇంకా దగ్గరకు ఆదుముకొని నడుము మీద చేతిని నొక్కేసరికి ఆర్య లోని తేడా…. దిశ కు అర్థమై… బెరుగ్గా దూరం జరగాలి అనుకుంటుంది
ప్లీజ్….. హగ్ మాత్రమే చేస్కుంటా…. దూరం పెట్టకే అంటూ ఇద్దరి ఛాతి మధ్యలోకి తెస్తున్న దిశ చేతులు దూరం జరిపి ఊపిరిఆగిపోయేంత గాడంగా హత్తుకుంటూ బుజం మీద ముద్దిచ్చి దూరం జరిగాడు
సిగ్గుతో దిశ దించిన తల ఎత్తకపోయేసరికి….
ఏడ్చినందుకు ఏమిస్తావ్ అని అడిగావుగా…. నువ్వే చెప్పు ఏం కావాలో ?? అంటాడు ఆర్య
ఏం అడిగినా చేస్తావా….?? అని చున్నీ సరి చేసుకుంటుంది
హ్మ్…. ముందు అడుగు !!
అడిగేస్తున్నా…..!!!
ఓసిని తిక్కల్ పిల్ల… అడగవే బాబు… ఏదో క్రైమ్ చెయ్యమన్నట్టు ఈ గ్యాప్ లేంటే ?
నువ్వు ఈ సారి ఒక్క సబ్జెక్టు కూడా పెండింగ్ ఉంచకుండా పాస్ అవ్వాలి….. ఇదే నీకు పనిష్మెంట్ !! అంటూ నవ్వుతుంది
బాబోయ్….. నీకు ని పనిష్మెంట్ కి ఒక పెద్ద దండం….. అది నాకు గండం తో సమానాం….!!! నావల్ల కాదు
ఇదుగో ఆర్య
నువ్వు మాట మార్చుతున్నావ్… ఇలా అయితే హర్ట్ అవుతా చెప్తున్నా…
ఒసేయ్… నీకు కొంచెం కూడా నా మీద జాలి లేదా…??
నా వల్ల కాదు అని తెలిసి ఇలాంటి ఫిటింగ్ పెట్టావు… మళ్ళీ అది నావల్ల కాదు ఆంటే హర్ట్ అవుతా అని నన్ను హర్ట్ చేస్తున్నావ్ !!
అదంతా నాకు తెలీదు… కష్టపడి చదివి పాస్ అవ్వు !! నాకు టైమ్ అయింది.వెళ్తున్నా అంటూ నిల్చుంటుంది
పచ్చి భూతులన్నీ తిట్టుకొని దిశ వెళ్లిన అరగంట తరువాత అక్కడ నుండి బయటికెళ్లాడు ఆర్య ;
💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫
ఆర్య అని పిలుస్తూ ఇంటి లోపలకు వెళ్తుంటాడు కరణ్ !
ఏం కరణ్ ఎలా ఉన్నావ్….? పేపర్ చదువుతూ అడిగారు సల్మాన్
ఐ అమ్ గుడ్ అంకుల్…. వేర్ ఇస్ ఆర్యన్ ?? అని మంచి పేరు కోసం ఇంగ్లీష్ వాడేసాడు వెదవ
రూమ్ లో ఉన్నాడు….. ఎగ్జామ్స్ దగ్గర పడ్డట్టున్నాయి !! ఎలా ప్రిపేర్ అవుతున్నావ్
ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా చేసేసాను అంకుల్….!!
హ్మ్… గుడ్…. ఏమైనా డౌట్స్ ఉంటే సాహిల్ ని అడిగి తెలుసుకో…. ఈ వేస్ట్ గాడితో తిరగకు
మీ కొడుకు పరువు మీరే తీస్తున్నారు జి… అని సల్మాన్ కు టి అందిస్తు అంటుంది బేగం !
వాడికి పరువు కూడా ఉందా….? అని నిట్టూరుస్తారు
కరణ్ ఆర్య రూమ్ కి వెళ్ళినప్పటికీ అతడు పుస్తకాలతో బాక్సింగ్ ఆడుతుంటే ఏనిమిదో వింత విశ్వంలో యాడ్ అయినట్టు నోరేళ్లబెట్టేస్తాడు కరణ్
ఇంకా ఉంది……..❤️
బాబు బంగారం 🥰 అలాగే ఫిక్స్ అవ్వండి 😈
Swipe left/right or tap the sides to turn pages