New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-115

ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-115

 

తారక్‌తో గొడవపడి restaurant నుంచి బయటకు వచ్చిన సాక్షి, ఆటో ఎక్కి మళ్లీ ఇంటికి వెళ్లి, రూమ్‌కి loack వేసుకుని గట్టిగా ఏడుస్తూ కూర్చుండిపోయింది…

“I hate you తారక్ సర్…. I hate you. నాకైతే ముందే తెలుసు మీకు నా మీద ప్రేమ లేదని. But మీకు వేరే అమ్మాయి మీద మనసు కలుగుతుందని మాత్రం నేను అనుకోలేదు….

ఈసారి గర్భిణి అయినా కూడా అది మీకు చెప్పాలనే మనసు రావడం లేదు. ఎందుకిలా చేశారు మీరు నాకు?” అంటూ ఏడుస్తూ ఉంది.

తారక్‌ను సాక్షి తప్పుగా అర్థం చేసుకుంది. ఒక్కసారి ఆమె మనసులోని మాటను విని ఉంటే బాగుండేది.. కానీ కొడుకు గురించి ఆలోచనతో పాటు, గర్భిణి కావడం వల్ల mood swing ఉండటంతో కేవలం చెడుగానే ఆలోచిస్తూ ఉంది.

తారక్ శరణ్యతో ఎందుకు ఉన్నాడో తెలుసుకోవడానికి సాక్షి ప్రయత్నించలేదు. అలాగే ఏడుస్తూ, కన్నీళ్లు పెట్టుకుంటూ స్పృహ తప్పి పడిపోయింది….

“చంద్రు అన్నా, Ayush ఇప్పుడు బాగానే ఉంది. ఎక్కువ రోజులు hospitalలో ఉంచాల్సిన అవసరం లేదనిపిస్తుంది, ఇంటికి తీసుకెళ్లండి” అని నవీన్ దేశాయ్ గారు చెప్పడంతో, వారికి కూడా అలాగే అనిపించి, కౌసల్య గారు బిడ్డను ఎత్తుకోగా, ముగ్గురూ అయోధ్య వైపు బయలుదేరారు.

 

“చంద్రు, శాలిని లేదా సాక్షికి call చెయ్యి. మళ్లీ hospitalకి రావాల్సిన అవసరం లేదు. మనమే ఇంటికి వెళ్తున్నాం కదా” అని కారులో కూర్చున్న కౌసల్య గారు చెప్పగా,

చంద్రప్రసాద్ యాదవ్ సాక్షికి call చేస్తే ఆమె receive చేయదు. తరువాత శాలినికి call చేసి ఇంటికి వస్తున్నామని చెప్పగా, శాలిని గారు బిడ్డ hospital నుంచి వస్తున్న కారణంగా హారతి ఇవ్వడానికి సిద్ధం చేసుకున్నారు.

కొంతసేపటి తరువాత చంద్రప్రసాద్ యాదవ్, కౌసల్య గారు మనవడితో కలిసి వచ్చినప్పుడు, శాలిని గారు తమ కూతురి కోసం చూస్తారు….

బిడ్డకు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లిన తరువాత, చంద్రప్రసాద్ యాదవ్‌కి, కౌసల్య గారికి coffee ఇచ్చి, ఆయుష్‌ని తన ఒడిలో పడుకోబెట్టుకుని కూర్చున్నారు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue