“నన్ను వదిలేయ్. విక్టర్‌కి ఈ విషయం తెలిస్తే నిన్ను అస్సలు వదిలిపెట్టడు. నన్ను వదిలేయ్” అని చెప్పిన శార్వరిని కోపంగా చూసిన తారక్, ఆమెను గోడకు ఆనించి, ఆమె మెడను గట్టిగా పట్టుకున్నాడు.
ఆ చీకట్లో కూడా చిరుత కళ్లలా పదునుగా కనిపిస్తున్న అతని కళ్ల మెరుపును చూసిన శార్వరి కళ్లను పెద్దవి చేసి అతని వైపు చూస్తూ ఉండిపోయింది.
“ఎవడే… ఎవడే ఆ విక్టర్? ఇంత త్వరగా అన్నీ మర్చిపోయావా నువ్వు? హా?” అని ఆమె గొంతును గట్టిగా పట్టుకుని, ఆమె కళ్లలోకి కళ్లుపెట్టి అడిగాడు.
భయంతో ఆమె అతని వైపే చూస్తూ ఉండిపోయింది.
అదే సమయంలో గదికి దగ్గరగా సెక్యూరిటీలు పరుగెత్తుకుంటూ వస్తున్న శబ్దం వినిపించింది.
“విక్టర్!” అంటూ శార్వరి పేరును గట్టిగా పిలుస్తూ విక్టర్ పరుగెత్తుకుంటూ వస్తున్న శబ్దం కూడా వినిపించింది.
“ప్రిన్సెస్… ప్రిన్సెస్… ఆర్ యు ఓకే? నేను వస్తున్నాను. అన్ని చోట్లా వెతకండి! ఎవరు ఇలా చేశారో చూడండి. అన్ని వైపులా వెళ్లి వెతకండి!” అని గట్టిగా బయట అరుస్తూ, సెక్యూరిటీల వైపు తిరిగి చెప్పిన విక్టర్ శార్వరి రూమ్ వైపు వస్తున్నాడు.
అతని అరుపులు, షూస్ శబ్దం బట్టి అతను రూమ్‌కి చాలా దగ్గరలోనే ఉన్నాడని అర్థం చేసుకున్న శార్వరి భయంతో తారక్ వైపు చూసింది.
అయితే తారక్ మాత్రం ఏమాత్రం కదలకుండా, ఆమె చేతిని బంధించి, ఆమె కళ్లలోకి కళ్లుపెట్టి చూస్తూనే ఉన్నాడు.
అప్పుడే బయట జోరుగా ఒకట్రెండు సార్లు గన్ శబ్దం వినిపించడంతో భయపడిన శార్వరి తారక్‌ని గట్టిగా కౌగిలించుకుంది.
“ప్రిన్సెస్… డోర్ ఓపెన్ చెయ్యి. ప్రిన్సెస్… నేను నీ విక్టర్ వచ్చాను. ప్రిన్సెస్… ఓపెన్ చెయ్యి. చీకటిగా ఉంది కదా, భయపడకు. ఓపెన్ చెయ్యి ప్రిన్సెస్. సెక్యూరిటీ… బయటికి రండి!” అని రూమ్ బయట నిలబడి విక్టర్ గట్టిగా అరుస్తున్నాడు.