విక్టర్ దగ్గర తన కసిన్స్ అందరూ ఎప్పుడు వస్తారని అడుగుతున్న శార్వరితో,
“ఈరోజే… ఇప్పుడే నీ కసిన్స్ అందరూ వచ్చేశారు. అక్కడ చూడు” అని చెప్పడంతో, అందరూ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డారు.
వాళ్ల దగ్గరకు పరుగెత్తిన శార్వరి పడిపోబోతుండగా.., వాళ్లందరి వెనుక ఉన్న తారిణి వేషంలో ఉన్న తారక్ ఒక్కసారిగా ముందుకు వచ్చి ఆమెను పట్టుకుని నిలబెట్టాడు.
కొనసాగుతుంది…
“హేయ్ ! ఎందుకు అలా పరుగెత్తుకుంటూ వచ్చావు?” అని ఆమెకు మాత్రమే వినిపించేలా కోపంగా మందలించగా, శార్వరి షాక్ అయి అతనివైపే చూస్తూ ఉండిపోయింది.
“ప్రిన్సెస్… జాగ్రత్త!” అని విక్టర్ అరుస్తూ ఆమె దగ్గరకు పరుగెత్తుకుని వచ్చాడు.
కళ్లను ఎర్రగా చేసుకున్న తారక్, తాను తారిణి వేషంలో ఉన్నానని గుర్తు చేసుకుని, ఆడవాళ్లలా ఆప్యాయంగా శార్వరిని పైకి లేపి నిలబెట్టాడు. ఆమె వైపు కోపంగా చూసి అక్కడే నిలబడ్డాడు.
“ప్రిన్సెస్… ఆర్ యు ఓకే? వీళ్లెవరూ ఎక్కడికీ పారిపోరు. నీ కసిన్స్ మన పెళ్లి పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటారు. ఎందుకు ఇంత గాబరాగా పరుగెత్తుకుంటూ వచ్చావు? తలకి ఏమైనా దెబ్బ తగిలి ఉంటే?” అని ఆమె నుదుటిని తాకుతూ అడిగాడు.
శార్వరి తారిణి వైపు చూసి ఇబ్బందిగా నవ్వుతూ విక్టర్ చేతిని విడిపించుకుని వెనక్కి జరిగింది.
“నాకేమీ కాలేదు విక్టర్. ఈమెకి థ్యాంక్స్ చెప్పాలి. Thank you so much… నన్ను కాపాడినందుకు” అని చెప్పి తారిణినే చూస్తూ నిలబడింది.
“ఇట్స్ ఓకే మేడమ్. కానీ జాగ్రత్తగా ఉండండి” అని చెప్పిన తారిణినే చూస్తూ శార్వరి కొద్దిసేపు నిలబడింది.