New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-133

ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-133

 

మరుసటి రోజు కళ్లు తెరిచిన సాక్షికి తన పొట్ట మీద ఏదో కదులుతున్నట్టు అనిపించింది. సరిగ్గా కళ్లు తెరిచి చూసేసరికి, కొంచెం పెద్దగా కనిపిస్తున్న ఆమె పొట్టను నిమురుతూ తారక్ బిడ్డతో మాట్లాడుతున్నాడు.

“Baby, I don’t know how to explain… ఈ ఫీలింగ్ ఒకరకంగా చాలా సంతోషాన్ని ఇస్తోంది. , నా మాటలు వింటున్నావా నువ్వు? Baby girl ఆ? Baby boy ఆ? హ్మ్… I don’t know… నీతో ఉండే ప్రతి క్షణాన్ని నేను సంతోషంగా అనుభవించాలి.

ఇప్పుడు డాడీతో మాట్లాడతావు కదా… Say ‘Hi Daddy’,” అంటూ సాక్షి పొట్టపై చేయి ఆడిస్తూ ముద్దుముద్దుగా మాట్లాడుతున్న తారక్, సాక్షికి కొత్తగా కనిపించాడు.

“తారక్..sir. ఇప్పుడు నాలుగు నెలలు నిండి ఐదో నెలలోకి నడుస్తోంది. ఇంత తొందరగా బిడ్డతో మాట్లాడుతుంటే… అసలు ఏం మాట్లాడుతుంది?” అని సాక్షి అడిగింది.

“ఏడు నెలలు, ఎనిమిది నెలలు వచ్చేసరికి మీ మాటలు వినిపిస్తున్నాయన్నట్టుగా రెస్పాన్స్ చేస్తుంది. ఈ సమయంలో కొంచెం కొంచెంగా కదలడం మాత్రమే ఉంటుంది,” అని చెబుతూ సాక్షి లేచి కూర్చుంది.

“అవునా? ఇలా కూడా ఉంటుందా? నాకైతే ఇదంతా ఒక రకమైన సంతోషాన్ని ఇస్తోంది. సరే, త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు. హాస్పిటల్‌కి వెళ్తున్నాం,” అని చెప్పి ఆమె నుదుటిపై గట్టిగా ముద్దు పెట్టాడు.

అతని మాటలకు సన్నగా నవ్విన సాక్షి, అతని మెడను చేతులతో చుట్టుకుంది.

“అయ్యా… మీరు ఒక విషయం మర్చిపోయారు. గుర్తు చేసుకోండి. నాకు లవ్ అంటే పడదు. నాకు ఈ జన్మలో ఎవరి మీదా ప్రేమ కలగదు. నువ్వు కేవలం నా భార్య , నా నీ మధ్య -భార్య-భర్త, సంబంధం మాత్రమే ఉంటుంది, love లేదు,” అంటూ ఏవేవో చెప్పేవారు. ఆ రోజు ఏదో చెప్పినట్టున్నారు… మళ్లీ దాని గురించి అసలు మాట్లాడనే లేదు hero” అని చెప్పి నవ్వింది.

“నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదే… నాకైతే గుర్తు లేదు. నువ్వు ఏం ఏం గుర్తు చేసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు,” అని తడబడుతూ చెప్పిన తారక్, అక్కడి నుంచి లేచి వెళ్లబోతే, సాక్షి అతని చేయి పట్టుకుని తన దగ్గరకు లాగుకుంది. అతని ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంది.

“అవునా? ఏమీ గుర్తు లేదా? ‘ఐ లవ్ యు’ కూడా గుర్తు లేదా?” అని చెప్పి కన్ను కొట్టింది.

“నేను అది సుమ్మనే చెప్పాను. నువ్వు దాన్ని సీరియస్‌గా తీసుకున్నావు.  సరదాగా చెప్పింది అంతే. నేను వెళ్లాలి… లేచి రెడీ అవ్వు,” అని ఆమెను గద్దించినట్టుగా చెప్పి, ముందుగా అక్కడి నుంచి జారుకున్నాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue