సాక్షిని డిశ్చార్జ్ చేయించుకుని బెంగళూరుకు వచ్చిన తారక్, తన ఇంటి దగ్గర కారు ఆగగానే సాక్షిని కారులోనే కూర్చోమని చెప్పాడు. ఇంట్లో వాళ్లకు సర్‌ప్రైజ్ ఇద్దామని చెప్పి, తానే ముందు కారు దిగి ఇంటి తలుపు దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు.
కొడుకు, కోడలు ఇద్దరూ వస్తారని ఆతృతగా ఎదురుచూస్తున్న ఇంట్లో వాళ్లు, కేవలం తారక్ ఒక్కడే రావడం చూసి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
“మామ్… అత్తయ్య, ఇక చాలు కన్నీళ్లు పెట్టుకోవడం. వెళ్లి హారతి పళ్లెం తీసుకుని రండి,” అని తారక్ చిరునవ్వుతో చెప్పగానే ఇంట్లో వాళ్లందరికీ పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది.
“అంటే సాక్షిని కూడా తీసుకుని వచ్చావా? ఎక్కడో ఆమె…” అని కౌసల్య కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగారు.
“తీసుకుని వస్తాను, ఉండండి,” అని చెప్పిన తారక్, కారులో ఆత్రుతగా కూర్చుని ఉన్న సాక్షి దగ్గరకు వెళ్లాడు. ఆమె చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చాడు.
అదే సమయంలో చేతన్ పై అంతస్తు నుంచి గులాబీ పూల వర్షం కురిపిస్తున్నాడు.
“అయ్యో తారక్ సర్, ఇదేంటి? ఈ రకమైన స్వాగతమా?” అని గులాబీ రేకులను చేతుల్లోకి తీసుకుంటూ నవ్వుతూ అడిగింది.
తిరిగి.. తిరిగి వస్తున్నావు కదా. అందుకే ఇక నుంచి నాతో గులాబీలా నడుచుకో అని చెప్పడానికి రోజ్ ఇచ్చి వెల్‌కమ్ చేస్తున్నాను,” అని చెప్పి ఆమెను లోపలికి తీసుకెళ్లాడు.
అతని మాటలకు మూతి తిప్పుకుంటూ అతని వెనకాలే వెళ్తున్న సాక్షి, ఇంటి మొత్తాన్ని చూస్తూ ఎంతో సంతోషపడింది.
అక్కడ ఉన్నప్పుడు ఒక్కోసారి అనిపించేది… “తారక్ సర్, మీరు రాకపోతే ఎక్కడ ఈ నరకమే నాకు చివరిది అయిపోతుందో” అని. కానీ మీరు వచ్చి నన్ను తీసుకుని వచ్చారు. మళ్లీ ఇక్కడికి తిరిగి వస్తానని అసలు అనుకోలేదు… అని భావోద్వేగంగా చెప్పిన సాక్షి, కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటి ముందువాకిలి దగ్గరకు వచ్చింది.