New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Ghost love 👻 – 5
Ghost love 👻 3 min read

Ghost love 👻 – 5

అవ్యూక్త్ 💝 శిశిర

శిశిర కి అసలు పెరుగు అంటేనే ఇష్టం ఉండదు అందులోనూ షుగర్ కలిపినా పెరుగు తింటూ అంటే ఇంకా వామిట్ ఫీల్ ఎక్కువ అవుతు ఉండేసరికి కంట్రోల్ చేసుకోలేక అక్కడే ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి వామిట్ చేసుకుంది.

అప్పుడే ఆ రూం డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన అవి ఫ్రెండ్ అజయ్ శిశిర అలా వామిట్ చేసుకోవడం చూసి నవ్వుతూ అవి దగ్గరికి వెళ్లి అతని చెయ్యి పట్టుకొని ఊపేస్తూ ” కంగ్రాట్స్ రా మామ నువ్వు నాన్నవి కాబోతునందుకు నాకు  చాల ఆనందంగా ఉంది ” అని చెప్తాడు.

ఆ మాట వినగానే అవి , శిశిర ఇద్దరు షాక్ అయ్యి పోతారు…

తన చేతిని పట్టుకొని ఊపేస్తూ నవ్వుతూ ఉన్న అజయ్ నీ చూసి చిరాకుగా చెయ్యి వెనక్కి లాక్కొని ఒక పంచ్ అజయ్ పొట్టలో ఇచ్చి….

రేయ్ నీ యబ్బ నీ బుర్ర గాని దొబ్బేసిందా ఎంటి…?

ఏం మాట్లాడుతున్నావు బే ” అని కోపంగా అరిచి , అయిన మా పెళ్లి జరిగి ఇప్పటికీ ఫైవ్ డేస్ మాత్రమే…అప్పుడే ప్రెగ్నెంట్ ఎంటి రా…? అని అడిగాడు ఫేస్ కంద గడ్డలా పెట్టుకొని.

అజయ్ అన్న మాటకి ఒక్క క్షణం శిశిర కళ్ళల్లో ఏదో మెరుపు మెరిసి మళ్ళీ అంతలోనే నీరు కారిపోతూ….తనకి ఈ జన్మకి ఆ అదృష్టం దక్కదు అని బాధగా అక్కడ నుంచి క్యారేజ్ పట్టుకొని బయటికి వెళ్ళిపోయింది.

శిశిర అక్కడ నుంచి వెళ్ళిపోయాక ఒక చేతితో పొట్ట పట్టుకొని మెలికలు తిరుగుతూ” రేయ్ ఇడియట్ అంతలా కొట్టావు ఎంటి…?

అయినా పెళ్లి కి ప్రెగ్నెన్నీ కి సంబంధం ఏం ఉంది..? ఇప్పుడు జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉంది….నువ్వు కూడా పెళ్లికి ముందు ఏం అయిన కమిట్ అయ్యావు ఏమో అని అలా అడిగా అంతే ” అని అంటాడు అజయ్.

” షట్ అప్ యూ ఇడియట్ ” అని అరిచి తన చైర్ లో వెళ్లి కూర్చొని”  నాకు అంత కాకూర్తి ఏం లేదు కానీ నువ్వు నీ నాన్ సెన్స్ బ్రెయిన్ తో చెత్త అంతా ఆలోచిస్తూ ఉండకుండా పోయి మీటింగ్ లో చెప్పిన విషయం గురించి స్టడీ చెయ్ పో ” అని కసిరాడు అవి.

అజయ్ కోపంగా ఒకసారి అవి నీ చూసి మూతి ముడుచుకొని అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయాడు.

అవికి అజయ్ అన్న నాన్న వి కబోతున్నావు అనే మాట పదే పదే గుర్తు వస్తూ ఉంటె గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ” నో అది ఎప్పటికీ జరగదు…..

ఆ శిశిర నన్ను నా ఫ్యామిలీ కి దూరం చేసింది సో నేను కూడా దాన్ని దాని ఫ్యామిలీ కి దూరం చేసి నేను అనుభవించిన బాధ అది కూడా అనుభవించల చెయ్యాలి ” అని అనుకుంటూ ఉంటాడు…

…………………..

హేయ్ మనీషా…! నువ్వు చిన్నప్పటి నుంచి పిచ్చిగా లవ్ చేసే ఆ అవ్యూక్త్ కి , నీ బద్ద శత్రువు అయిన శిశిర కి పెళ్లి జరిగింది అంట” అని ఫోన్ లో చెప్తూ ఉంటుంది మనీషా ఫ్రెండ్ .

వాట్….! ఏం మాట్లాడుతున్నావే గంగోత్రి….” అని షాకింగ్ గా తన చైర్ లో నుంచి లేచి అడిగింది మనీషా.

( మనీషా , అవ్యూక్త్ , శిశిర ముగ్గురు ఒకటే స్కూల్ లో చదువుకున్నారు…

మనీషా కి చిన్నప్పటి నుంచి అవి అంటే పిచ్చి ప్రేమ.కానీ అవికీ ప్రేమ , గిమ అంటే ఇష్టం లేదు సో మనీషా ఎన్ని సార్లు ప్రపోజ్ చేసిన నో చెప్పేవాడు.

శిశిర బాగ చదివే అమ్మాయి సో టీచర్లు అందరు తనని పొగుడుతూ ఉంటే అది మనిషికి నచ్చేది కాదు అండ్ చిన్నప్పుడు అవి కూడా శిశిర తో చాల క్లోజ్ గా ఉండేవాడు సో ఇంకా అలా శిశిర మిద పగ పెంచుకుంది మనీషా)

నేను చెప్పేది నిజమే మని..! వాళ్ళ ఇద్దరికీ ఫైవ్ డేస్ బ్యాక్ ఆ పెళ్లి అయ్యింది అంట…! నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్లి వచ్చే సరికి మన స్కూల్ ఫ్రెండ్ ముక్త చెప్పింది ” అని తన తెలిసిన విషయం అంత చెప్పింది గంగోత్రి.

మొత్తం విన్న మనీషా ఫైర్ అయిపోతూ ” ఆ…….. యు ఇడియట్ ఆ శిశిర కి ఎంత ధైర్యం ఉంటే నా అవి నే పెళ్లి చేసుకుంటుంది….? దాన్ని మాత్రం నేను వదిలిపెట్టను ” అని కోపంతో ఊగిపోతూ తన టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ విసిరి కొట్టి , పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ ఉంటుంది.

……………..

శిశిర క్యారేజ్ తీసుకొని అజయ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ క్యాబ్ లో ఇంటికి వెళ్లి గుమ్మం దగ్గర నిలబడి హాల్ లో ఉన్న వాళ్ళని చూసి అలా చూస్తూ నిలబడిపోయింది.

అసలు ఈ మనీషా ఎవరు…?

మనీషా వల్ల శిశిర లైఫ్ ఎలా మారబోతోంది…?

శిశిర ఎవరిని చూసి గుమ్మం దగ్గర ఆగిపోయింది…?

To be continued….