New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హృదయ స్పందన-21

హృదయ స్పందన-21

హృదయ్:: నాకు కార్ రైడ్ కు ఇవ్వవా అంటాడు నవ్వు ఆపుకుంటూ

 

స్పందన:: ఎంటి 🙄🙄

 

హృదయ్:: కార్ లో రైడ్ కు వెళ్దామా అంటే నేను ఎపుడు అంత కాస్ట్లి కార్ డ్రైవ్ చేయలేదు అందుకే అడిగా

 

స్పందన:: ఇది చెప్పడనికా అంత బిల్డప్ ఇచ్చావ్ 😒😒

 

హృదయ్:: 😁😁 హా…. నువ్వేం అనుకున్నావ్

 

స్పందన:: ఉఫ్!! ఏదో అనుకున్నాలే ఎపుడో ఎందుకు ఇపుడే వెల్దమ్మ్ పదా

 

హృదయ్:: నీకు లేట్ అవుతుందేమో శాండీ ఇంట్లో మళ్లీ కంగారు పడతారు నెక్స్ట్ టైం వెళ్దాం లే

 

స్పందన:: ఏమ్ కాదు ముందు పదా అని తనే బైక్ కీస్ తీసుకుని బైక్ దగ్గరకు వెళ్తుంది

 

హృదయ్:: వెనుకే వస్తూ శాండీ నీకు బైక్ వచ్చా

 

స్పందన:: బైక్ మీద కూర్చుని హా హృదయ్ నాకు రేసింగ్ అంటే చాలా ఇష్టం

ఫారిన్ లో వున్నపుడు నేను , హసిక ఎప్పుడు రేస్ పెట్టుకునే వాళ్లం

మేము చాలా రేస్ లో పార్టిసిపేట్ చేశాం కూడా నాకు చాలా ఇష్టం

చాలా రోజులు అయింది రేస్ పెట్టుకుని ఎపుడైనా నువ్వు నేను ట్రై చేద్దాం కానీ బైక్ ఎక్కు

 

హృదయ్:: నవ్వుతూ బైక్ ఎక్కి కూర్చున్నాడు

 

స్పందన:: వెళ్దామా అంటుంది బైక్ స్టార్ట్ చేస్తూ

 

హృదయ్:: హా పదా శాండీ

 

స్పందన:: ఫస్ట్ కొంచెం శ్లో గా డ్రైవ్ చేస్తూ తర్వాత కావాలనే బైక్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తోంది

 

హృదయ్:: నవ్వుకుని స్పందన నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు

 

స్పందన:: షాక్ అయ్యి ఎంటి హృదయ్ ఇది

 

హృదయ్:: కావాలనే నాకు నిద్రొస్తుంది ఇలానే వుంటాను కాసేపు ప్లీజ్

 

స్పందన:: నవ్వుకుని డ్రైవ్ చేస్తూ వుంటుంది

 

హృదయ్:: స్పందన ను గట్టిగా హత్తుకుని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ వున్నాడు

 

స్పందన:: డ్రైవ్ చేస్తూ ఇపుడు ఈ క్షణం ఇలా ఆగిపోతే ఎంత బావుంటుంది హృదయ్

ఈ క్షణం కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది

త్వరగా మన  ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయి మనం హ్యాపీగా వుండాలి హృదయ్ అని అనుకుంటూ వుంటుంది

 

హృదయ్:: లవ్ యూ సో మచ్ శాండీ జస్ట్ 3 డేస్ లో ఈ 3 మ్యాజికల్ వర్డ్స్ ను నీ నోటితోనే చెప్పించి అపుడు ఇలాంటి టైట్ హగ్ ఇస్తా అని అనుకుంటూ వున్నాడు

 

స్పందన:: కాసేపటికి పార్క్ దగ్గరకి వచ్చేస్తుంది

 

హృదయ్:: పార్క్ దగ్గరకు రాగానే సరిగ్గా కూర్చున్నాడు

 

స్పందన:: దిగు ఇక వచ్చేశాం

 

హృదయ్:: దిగుతాడు

 

స్పందన:: కూడా దిగి బైక్ పార్క్ చేసి కార్ కీస్ హృదయ్ కు ఇస్తుంది

 

హృదయ్:: నవ్వుతూ వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు

 

స్పందన:: కూడా పక్కనే కూర్చుంటుంది

 

హృదయ్:: కార్ స్టార్ట్ చేసి ఫుల్ స్పీడ్ తో డ్రైవ్ చేస్తూ వుంటాడు

స్పందన:: కార్ లో ఫ్. మ్ ఆన్ చేసి ఫుల్ సౌండ్ పెట్టేసి ఆ రైడ్ ను ఎంజాయ్ చేస్తూ వుంటుంది

హృదయ్ & స్పందన నైట్ 12 వరకు సిటీ మొత్తం చుట్టేసి ఫుల్ గా ఎంజాయ్ చేసి మళ్లీ రిటర్న్ పార్క్ దగ్గరకు వస్తారు

తర్వాత ఇద్దరు వదలలేక వదలలేక ఇద్దరు ఎవరి వెహికల్స్ లో వాళ్ళు వాళ్ల ఇళ్లకు వెళ్ళిపోయారు

నెక్స్ట్ డే మార్నింగ్ ఎదావిదిగా బ్రేక్ ఫాస్ట్ చేసి ఎవరి డ్యూటీస్ కు వాళ్ళు వెళ్ళిపోతారు

స్పందన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోడానికి చాలా ట్రై చేస్తోంది బట్ నో యూస్

ఇలానే 3 డేస్ అయిపోయాయి బట్ ఈ 3 డేస్ తనకు ఒకరి మీద డౌటు వచ్చింది

అది అవునో కాదో ఇవాళే క్లియర్ అవ్వాలి నా హృదయ్ ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు

అది ఎవరో కానీ ఇవాళ నా చేతుల్లో చచ్చింది అని కోపంగా బుసు లు కొడుతూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది

స్పందన ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి డ్రెస్ వేసుకుని కాసేపటికి రెడీ అయి కిందకు వస్తుంది

లహరి బ్రేక్ ఫాస్ట్ చేసి వెల్లు అని ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా డ్రైవర్ ను కూడా వద్దు అంటుంది

కార్ కీస్ తీసుకుని తనే స్టార్ట్ చేసి అక్కడి నుంచి హృదయ్ చెప్పిన పార్క్ లోకి వెళ్తుంది

అప్పటికే హృదయ్ అక్కడ బెంచ్ మీద కూర్చుని వెయిట్ చేస్తూ వుంటాడు

హృదయ్ బ్లాక్ కలర్ షర్ట్ అండ్ బ్లాక్ జీన్స్ లో చాలా హ్యాండ్సం గా వుంటాడు

స్పందన హృదయ్ ను అల చూస్తూ ఉండిపోయింది తనను ఎవరో చూస్తూ వున్నట్టు అనిపించి వెనక్కు తిరుగుతారు హృదయ్

పింక్ కలర్ ఫ్రాక్ లో అందాల బాపు  బొమ్మ లా చాలా మెరిసిపోతూ వుంది స్పందన

ఇద్దరు కాసేపు ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు

ముందుగా తేరుకున్న స్పందన హృదయ్ ముందు వెళ్లి నిల్చుని చూస్తూ ఉండిపోయింది

హృదయ్ కూడా చిన్నగా నవ్వి స్పందన కళ్లలోకి చూస్తూ నుదుటిన ముద్దు పెడతాడు

స్పందన నుడీటిన ముద్దు పెట్టగానే స్పందన కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి

హృదయ్ వాటిని తన బోటని వేలితో తుడిచి స్పందన తలకు తన తలను డీ కొడతాడు

స్పందన ఇక వుండలేక హృదయ్ ను గట్టిగా హత్తుకుని ఏడుస్తూ వుంటుంది

హృదయ్ స్పందన ఎమోషన్ ను అర్తం చేసుకుని తన చుట్టూ చేతులు వేసి గుండెలకు హత్తుకున్నాడు

స్పందన కూడా హృదయ్ చుట్టూ చేతులు వేసి తన మనసులో బాధ పోయేవరకు ఏడుస్తూ ఉంది

హృదయ్ స్పందన ను అలా చూడలేక తన నుండి దూరం జరిగి కన్నీళ్లు తుడిచి బెంచ్ మీద కూర్చో పెడతాడు

స్పందన హృదయ్ చేతిని పట్టుకుని అలాగే ఏడుస్తూ ఉంది హృదయ్ తను తెచ్చిన వాటర్ బాటిల్ ఇచ్చి తాగమని చెప్తాడు

స్పందన వాటర్ బాటిల్ తీసుకుని కొంచెం తాగి కాసేపటికి నార్మల్ అవుతుంది

హృదయ్ స్పందన నే చూస్తూ నవ్వుతూ వున్నాడు స్పందన హృదయ్ చూసి పైకి లేచి నిల్చుని చూస్తుంది

హృదయ్ కూడా స్పందన లేవగానే తను కూడా పైకి లేచి నిల్చుని చూస్తూ ఉన్నాడు

 

స్పందన:: హృదయ్ నీతో చాలా విషయాలు చెప్పాలి

 

హృదయ్:: ఎంటి శాండీ అంటాడు ఏమ్ తెలియనట్టు

 

స్పందన:: నువ్వు ఇన్నాళ్లు ప్రేమిస్తున్నా ఆ బొకే అమ్మాయి ఎవరో కాదు

 

హృదయ్:: ప్రేమగా చూస్తూ ఉన్నాడు

 

స్పందన:: అది ఎవరో కాదు నేనే అని చెప్తూ వుండగా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి హృదయ్ ను గట్టిగా హగ్ చేసుకుంటుంది

 

హృదయ్:: షాక్ అవుతాడు

 

స్పందన:: తను అనుకున్న అమ్మాయే కావడం తో కోపంగా చూస్తు వుంది

 

హృదయ్:: తన నుండి ఆ అమ్మాయిని దూరంగా జరిపి ఆ అమ్మాయి మొహం చూసి షాక్ అవుతాడు

 

అమ్మాయి;; ఐ లవ్ యూ హృదయ్ సార్

 

హృదయ్:: షాక్ లోనే షియా అంటాడు

 

షియా:: అవును సర్ నేనే ఇన్నాళ్లు మీకు బొకే పంపుతూ అజ్ఞాతం లో ప్రేమిస్తున్నా భక్తురాలు నీ

 

హృదయ్:: ఏమ్ మాట్లాడుతున్నావ్

 

షియా:: నిజమే సార్

 

స్పందన:: కోపంగా చంప మీద ఈడ్చి కొడుతుంది

 

హృదయ్:: షాక్

 

షియా:: హేయ్ యూ నన్నే కొడతావా అని కొట్టడానికి చేయి ఎత్తుతుంది .

 

స్పందన:: కోపంగా చూస్తూ ఆ చేయి పట్టుకుని వెనక్కు మడుస్తుంది

 

షియా:: నొప్పితో 😭😭

 

స్పందన:: తన పట్టు బిగిస్తూ వుంటుంది

 

షియా:: సర్ ప్లీజ్ వదలమని చెప్పండి 😭😭

 

హృదయ్:: శాండీ లీవ్ హర్

 

స్పందన;: ఇంకా అలానే పట్టుకుని వుంది

 

హృదయ్:: చెప్తున్నా కదా వదిలేయ్ అంటాడు కొంచెం సీరియస్ టోన్ తో

 

స్పందన:: అసహనంగా చూస్తూ వదిలేస్తుంది

 

షియా:: 😭😭

 

హృదయ్:: ఆర్ యు ఓకే

 

షియా:: 😭😭 ఐ యాం ఓకే సర్  బట్ నిజం చెప్తున్నా నేనే సర్ ఆ అమ్మాయిని

 

స్పందన:: కోపంగా వచ్చి జుట్టు పట్టుకుని చంప లు పగకొడుతూ వుంది

 

హృదయ్:: అతి కష్టం మీద స్పందన ను పక్కకు లాగుతారు

 

షియా:: సర్ ఈ స్పందన అసలు మంచిది కాదు తనకు ముందే వాళ్ళ బావ తో పెళ్లి ఫిక్స్ అయింది

అయినా సిగ్గు లేకుండా మీ వెనుక తిరుగుతోంది తనకు చాలా మంది తో రిలేషన్ షిప్ ఉంది

తన గెస్ట్ హౌస్ లో రోజు ఒకడితో ఎంజాయ్ చేయడం తనకు అలవాటు

తన డబ్బు ను ఎరగా ఆ అందమైన అబ్బాయిలను ట్రాప్ చేస్తూ వుంటుంది

మిమ్మల్ని కూడా అలానే ట్రాప్ చేసింది నన్ను నమ్మండి సర్ ఇది అసలు మంచిది కాదు

పాపం వాళ్ళ బావ దీన్ని ప్రాణం కన్నా ఎక్కువ గా ప్రేమిస్తున్నాడు ఇది ఇలాంటిది అని తెలిసి కూడా

తనను ఇష్టపడుతున్నారు ఇది నిజంగా పెద్ద &&& సర్ మీ ఇన్నోసెన్స్ ను అడ్డు పెట్టుకొని గేమ్ ఆడుతూ ఉంది అంటుంది ఉక్రోషంగా

ప్లీజ్ బిలీవ్ మీ సర్ ఆ అమ్మాయిని నేనే మిమ్మల్ని ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా ఐ రియల్లీ లవ్ యూ అంటుంది

 

హృదయ్:: షియా ను లాగి పెట్టీ కొడతాడు

 

షియా:: వెళ్లి స్పందన కాళ్ళ మీద పడుతుంది

 

స్పందన:: హృదయ్ తన గురించి తప్పుగా అనుకుంటాడు ఏమో అని కల్ల నిండా నీళ్లతో చూస్తూ ఉండిపోయింది

 

హృదయ్:: షియా బుజం పట్టుకుని పైకి లేపి మళ్లీ కొడతాడు

 

షియా:: సార్ 😭😭

 

హృదయ్:: షట్ అప్ ఏడ్చావో ఆడపిల్ల అని కూడా చూడను అంటాడు పల్లు కొరుకుతూ నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ

 

షియా:: ఫస్ట్ టైం హృదయ్ ను అలా చూసి బయం తో బిక్క చచ్చిపోయింది

 

హృదయ్:: స్పందన బుజం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటాడు

 

స్పందన:: హృదయ్ వైపు చూస్తూ ఉంది

 

హృదయ్:: స్పందన ఎవరో తెలుసా నా ప్రాణం తనే నా జీవితం నా సర్వస్వం అన్ని తనే యస్ ఐ లవ్ హర్

 

స్పందన:: సంతోషం తో హృదయ్ ను గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంది

Continues……❣️❣️

Hello Guys 🤗❤️…… !!

కొంచెం బ్రేక్ తీసుకోవడం వల్ల హృదయ స్పందన స్టోరీ కాస్త లేట్ అయింది………. !! అందుకు ముందుగా మీ అందరికీ సారీ…..!! 🥹❤️ ఇన్ని డేస్ స్టోరీ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ……!! 🫶🏻ఇకపై హృదయ స్పందన రెగ్యులర్‌గా కంటిన్యూ అవుతుంది…….. !! ❤️✨

 

ఇంతవరకు స్టోరీ మీకు ఎలా అనిపిస్తుంది…….??
ఏ క్యారెక్టర్ మీకు బాగా కనెక్ట్ అయ్యింది……??
ఇప్పటివరకు జరిగిన సీన్స్‌లో మీకు బాగా నచ్చిన సీన్ ఏది…….?? 🥰
మీ అభిప్రాయాలను, మీకు నచ్చిన విషయాలను తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి………!!
మీ ప్రతి కామెంట్ నాకు చాలా విలువైనది………!! ❤️
ఇకపై స్టోరీలో ఏం జరగబోతుందో గెస్ చేసి కామెంట్ చేయండి………..!! చూద్దాం ఎవరి గెస్ కరెక్ట్ అవుతుందో…..!! 😉❤️
మీ హృదయ స్పందన ఎలా కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారో కూడా చెప్పండి………!! ❤️