Mr అక్షయ్ – 1
మిస్టర్ అక్షయ్
అబ్బా ఎన్నో రోజుల తర్వాత నా అన్నగాడు నాకు పార్టీ కోసం మనీ ఇచ్చాడు. ఈ మనీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఏం చేయాలి? అని ఆలోచిస్తూ తన స్కూటీ మీద వెళుతుంది మన హీరోయిన్ అయినా అక్షర.
ఏంటబ్బా ఈ ఏరియా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. కానీ, ఇప్పుడు ఇలా ఖాళీగా కనిపిస్తుంది. అయినా మనకేంటి లే భయం. ఇక్కడ మనం ఆడపులి. ఒకవేళ ఎవడైనా నన్ను టచ్ చేయాలని ట్రై చేస్తే వాడి మక్కెలు ఇరగ్గొడతాడు నా అన్నగాడు.
నా ఎనక నా అన్న ఉండగా నాకేంటి ప్రాబ్లం అని అనుకుంటూ, అబ్బా ఇప్పుడు ఇటువంటి ఆలోచనలు ఎందుకు? మైండ్ ఎప్పుడూ ఎలా ఆలోచిస్తుందో కూడా అర్థం కాదు.
ఫస్ట్ టైం నా అన్న జోబులో నుంచి మనీ దొంగతనం చేయకుండా దర్జాగా నా అన్న చేతుల మీదగా డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టడానికి వెళ్తున్నాను ఇలాంటి ఛాన్స్ మరలా ఎప్పుడు వస్తుందో ఏంటో?
మా అన్నయ్య మంచి మూడులో ఉన్నట్లున్నాడు. అందుకే నాకు పది వేలు ఇచ్చాడు. నేనెప్పుడూ దొంగతనం చేసిన ఇంత మనీ ఎప్పుడు దొంగతనం చేయలేదు.
ఎంతైనా నా అన్నగాడు చాలా గ్రేట్ అందుకే నాకోసం పదివేలు ఇచ్చాడు అని తన అన్నని పొగుడుకుని, తన బెస్ట్ ఫ్రెండ్ అయినా ఆదర్శ్ కి ఫోన్ చేసి రేయ్ ఈరోజు నా అన్నగాడు నాకు మనీ ఇచ్చాడు రెడీగా ఉండు పార్టీ చేసుకుందాం అని అన్నది.
నువ్వు పార్టీ ఇవ్వడం మేము తీసుకోవడం అది ఈ జన్మలో జరుగుతుందా? ఈసారి ఎవరి పర్స్ కి బొక్క పెట్టాలని నిర్ణయించుకున్నావ్ అని వెటకారంగా అడిగాడు ఆదర్శ్.
రేయ్ నువ్వు ఈ అక్షరాన్ని తక్కువ అంచనా వేస్తున్నావ్ నా గురించి ఎక్స్ట్రా మాట్లాడాలంటే నీ పర్స్కే బొక్క పెడతాను జాగ్రత్త. నేను మర్యాదగా చెప్తున్నాను నా అన్నగాడు నాకు మనీ ఇచ్చాడు పార్టీ ఇస్తాను అని మన ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి ట్యాంక్ బండి దగ్గరకు వచ్చేయ్. నేను కూడా అటు సైడ్ వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది అక్షర.
ఈ అక్షర నిజాలు చెప్తే ఎవ్వరు నమ్మరు అని మూతి 30 వంకర్లు తిప్పుకుంటూ అనుకొని,
సర్లే వాళ్ల నమ్మకపోతే ఏంటి ఈరోజు పార్టీ ఇస్తే వాడి నోరు మూసుకుంటుంది అని అనుకుంటూ దర్జాగా తన అన్న ఇచ్చిన మనీని పార్టీలో ఎలా ఖర్చు పెట్టాలి ఎవరెవరికి ఏమేమి కొనియాలి అని తన ఫ్రెండ్స్ కి ఇష్టమైన లిస్ట్ అంతా కూడా మైండ్ లోనే ఊహించేసుకుంది.
ఆ సరదాగా జాలీగా వెళుతున్న ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది.
పెద్ద ట్రక్ వచ్చి అప్పుడే తనని దాటుకొని వెళ్లిన స్కూటీ మీద అమ్మాయిని డాష్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఎగిరి చాలా దూరం పడింది.
అక్కడ అక్షర తప్ప మరెవ్వరూ కనిపించలేదు తనకు ఏం చేయాలో అర్థం కాలేదు కాళ్లు చేతులు ఆడటం లేదు.
గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుంది అక్షర.
రెండు రోజుల తర్వాత తను కళ్ళు తెరిచింది
తన ఇంటిలో బెడ్ మీద ఉంది అక్షర.
తన ఎదురుగా కనిపించిన తన తల్లిదండ్రులను చూసి హమ్మయ్య నేను బ్రతికే ఉన్నానా? చనిపోలేదా? అని లేచి కూర్చుంది అక్షర.
ఆమె అంత సరదాగా మాట్లాడుతున్న తన తల్లిదండ్రులు ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా తన వైపే చూస్తుండటంతో, ఏమైంది మీ ఇద్దరూ అలా చూస్తున్నారు అని అయోమయంగా అడిగింది.
వాళ్ళిద్దరూ బాధగా పక్కకు తప్పుకున్నారు. అప్పుడు తన అన్నయ్య తన ఎదురుగా వచ్చి నిలబడ్డాడు.
ఏరా అన్నయ్య నువ్వు నా ఎదురుగా వచ్చి నిలబడటానికా మాత పిత ఇద్దరు ఇంత బిల్డప్ ఇస్తున్నారు అని బెడ్ మీద నుంచి దిగి తన అన్నయ్య దగ్గరకు వచ్చింది.
తన అన్నయ్య ఏమి మాట్లాడకుండా మౌనంగా అంతకుమించి ఏదో కోల్పోయిన వాడిలా బాధగా తన వైపు చూడటం అప్పుడు గమనించి, ఏమైంది మీ ముగ్గురికి నేను బాగానే ఉన్నాను కదా! ఎవరో పోయినట్లుగా అలా సైలెంట్ గా ఉన్నారేంటి.
కొంపతీసి నేను కోలుకోవాలని మౌనవ్రతం ఏమైనా చేయాలని ఫిక్స్ అయ్యారా? ఇక నేను లేచాను కదా నిలబడ్డాను తిరుగుతున్నాను మాట్లాడుతున్నాను కదా మాట్లాడండి అని ముగ్గురు వైపు చూస్తూ అడిగింది.
అక్షర అని నిదానంగా పిలిచింది అక్షర తల్లి అమూల్య.
అమ్మ ఏంటమ్మా ఈ స్లో మోషన్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కొంపతీసి ఇది మన ఇల్లు కాదా? నేను ఏమైనా వేరేచోట ఉన్నానా? అందుకే మీరు ఇలా నాతో బిహేవ్ చేస్తున్నారా? అని అయోమయంగా వాళ్ళని దాటుకొని బయటకు వెళ్ళింది.
రూమ్ బయటకి అడుగుపెడుతున్న అక్షర చేతిని పట్టుకున్న విజయ్ పల్లవి ఎక్కడ? అని అడిగాడు.
అడుగు బయట పెడుతున్న అక్షర ఒక్కక్షణం ఆగి, వెనక్కి తిరిగి ఏం మాట్లాడుతున్నావ్ రా అని అయోమయంగా అడిగింది.
ప్లీజ్ అక్షర నువ్వు నా సహనాన్ని పరీక్షించవద్దు. పల్లవి ఎక్కడ ఉందో చెప్పు అని కళ్ళు మూసుకొని పిడికిలి గట్టిగా బిగించి అడిగాడు విజయ్.
రేయ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అసలు పల్లవి ఎవరు? తను ఎక్కడ ఉందొ నాకు ఎలా తెలుస్తుంది. తన గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావ్? ఎంత నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం నీ ఇంటరాగేషన్ పోలీస్ స్టేషన్లో పెట్టుకోవాలి. అంతేకానీ, ఇంట్లోకి వచ్చి నన్ను ఇలాంటి పిచ్చి పిచ్చి క్వషన్స్ వేయొద్దు అంటూ ఆ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళిపోయింది అక్షర.
అక్షర ఇప్పుడు సరదాగా మాట్లాడే టైం కాదు నేను డ్యూటీలో ఉన్నాను పోలీస్ ఆఫీసర్గా నీ ఎదురుగా నిలబడ్డాను నీ అన్నయ్యగా కాదు చాలా నిదానంగా నార్మల్గా అడుగుతున్నాను పల్లవి ఎక్కడ ఉందో చెప్పు అని అడిగాడు విజయ్.
అప్పుడు అక్షర తన ఎదురుగా ఉన్న అన్నయ్యను పైనుంచి కింద వరకు చూసింది ఫుల్ డ్యూటీలో ఉంటే ఎలా ఉంటాడో అలానే యూనిఫామ్ క్యాప్ గన్ తో కనిపిస్తున్న తన అన్నయ్య తన దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి గురించి అడగటం తనకి ఆశ్చర్యంగా అనిపించి, అంతకుమించి తనకు తెలియదు అని చెప్తున్నా ఎందుకు ఇలా అడుగుతున్నాడో అర్థం కాక అయోమయంగా నువ్వేం మాట్లాడుతున్నావ్ రా నాకు ఏమీ అర్థం కావడం లేదు నిజంగా ఆ పల్లవి ఎవరూ నాకు తెలియదు అయినా పల్లవి గురించి నన్నెందుకు అడుగుతున్నావ్ వాళ్ళ పేరెంట్స్ ను వాళ్ల ఫ్రెండ్స్ ను అడగాలి నీ ఇంటరాగేషన్ పల్లవి గురించి తెలిసిన వాళ్ళని అడగాలి కానీ అసలు పల్లవి ఎవరో తెలియని నాకు తన గురించి అడిగితే నేను ఏమని సమాధానం చెప్తాను
నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా పల్లవి అని పేరుతో ఎవరూ లేరు రా అని అక్షర చాలా నార్మల్ గా సమాధానం చెప్పింది
అప్పటికి చాలా సహనంగా మారిపోయిన విజయ్ కోపంగా అక్షర ఆన్సర్ మై క్వశ్చన్ ఫస్ట్ అని గట్టిగా అరిచాడు.
ఆ ఇంటిలో ఎప్పుడు విజయ్ గొంతు అంత గట్టిగా వినిపించలేదు. ఫస్ట్ టైం అంత గట్టిగా వినిపించడంతో అక్షర భయంతో బిగిసిపోయింది.
తన చెల్లెలు భయపడుతుంది అని అర్థం చేసుకొని ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి అక్షర ఇది మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసినట్లు మాట్లాడే టైం కాదు ప్లీజ్ అర్థం చేసుకో నేను ఒక కేసు విషయంతో నీతో మాట్లాడుతున్నాను. నువ్వు నిన్న బయటకు వెళ్ళినప్పుడు నీ కళ్ళముందే ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ అమ్మాయి పేరు పల్లవి.
అప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది నాకు క్లారిటీగా చెప్పు అలానే ఆ అమ్మాయి ఏమయింది అనేది కూడా నువ్వే చెప్పాలి అని తనని తాను కంట్రోల్ చేసుకుని నిదానంగా అడిగాడు విజయ్
అదేంటి నిన్న ఆక్సిడెంట్ జరిగింది అంటే అప్పుడే ఒక రోజు గడిచిపోయిందా మా ఫ్రెండ్స్ గా పార్టీ ఇవ్వాలి అనుకున్నాను కదా నేను పార్టీ ఇవ్వలేదా అసలు ఏం జరిగింది అని అయ్యోమయంగా తన తల్లిదండ్రు వైపు తన అన్నయ్య వైపు మార్చి మార్చి చూస్తూ అడిగింది
అక్షర ప్లీజ్ నీ పార్టీ గురించి ఇవన్నీ తర్వాత ముందు నిన్న యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది చెప్పు అని అడిగాడు విజయ్
అరే అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు నిన్న నేను బయటకు వెళ్ళినప్పుడు సరదాగా ఆదర్శ్ కి ఫోన్ చేసి మాట్లాడాను ఆ తర్వాత నన్ను దాటుకుని ఒక అమ్మాయి స్కూటీ మీద చాలా స్పీడ్ గా వెళ్ళిపోయింది నిజమే నువ్వు చెప్పినట్లుగానే ఆ అమ్మాయికి అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నేను భయంతో కళ్ళు మూసుకున్నాను ఇదిగో ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను మీ ముందు ఒక రోజంతా నా లైఫ్ లో ఏం జరిగిందో తెలియకుండానే గడిచిపోయింది అని అమాయకంగా కళ్ళు టపటప కొడుతూ చెప్పింది అక్షర.
అక్షర నేను మరొకసారి అడుగుతున్నాను నేను నీ అన్నయ్యగా ఇక్కడకు రాలేదు పోలీస్ ఆఫీసర్గా వచ్చాను. జరిగిన నిజం మాత్రమే చెప్పు. ప్రతి దానికి నువ్వు చెప్పే సిల్లీ రీసన్స్ ఇక్కడ నాకు చెప్పొద్దు అని తన కోపని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడు అనేది తన పిడికిలి చూస్తేనే అర్థమవుతుంది అంత అసహనంగా అడిగాడు విజయ్
నువ్వు పోలీస్ ఆఫీసర్గా అడిగితే ఏంటి నా అన్నయ్యగా అడిగితే ఏంటి నేను ఉన్న నిజమే చెబుతున్నాను నిజంగా నిన్న నా ముందు యాక్సిడెంట్ అయింది కానీ తర్వాత ఏం జరిగిందో నిజంగా నాకు తెలియదు రా అని అమాయకంగా అన్నది..
తను నిజమే చెప్తుంది ఏమోరా ఒక్కసారి ఆలోచించు నువ్వు కేస్ గురించి మాట్లాడుతున్నావ్ అంటే తను ఎందుకు అబద్ధం చెప్తుంది అని అమూల్య అన్నది.
నేను కరెక్ట్ గా చెప్తున్నాను అమ్మ, నిజంగా ఆ పల్లవి ఎవరో నాకు తెలియదు అని తన తల్లి దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని చెప్పింది అక్షర.
ఇంకా ఉంది.
Swipe left/right or tap the sides to turn pages