తులసి తనకోసం వెయిట్ చేస్తూ ఉండడం వల్ల వెంటనే డోర్ తీసి, వచ్చావా నీకోసమే వెయిట్ చేస్తున్నా అయినా వంటరిగా ఎందుకు వచ్చావు , నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేదాని కదా అని అంటుంది.
అ మాటకి రాధిక ముందర నన్ను లోపలికి రానివ్వు జరిగిందంతా చెప్తాను అని అనడంతో, సరే లోపలికి రా అని తులసి చెప్పి, రాధిక లోపలికి వచ్చాక ,డోర్ లాక్ చేసి ఇప్పుడు చెప్పు ఏమైంది అని అడుగుతుంది.
************
తులసి మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చి ఇవి తాగి ముందు అని మంచినీళ్లు ఇస్తుంది, అవి తాగి పక్కన పెట్టాక రాధికను అడుగుతుంది .
ఇప్పుడు చెప్పు ఏమైంది అసలు అని అడగ్గా ఏముంది ఉన్నాడు కదా అసురుడు అని చెప్పి జరిగిన విషయం అంతా చెబుతుంది.
తులసి కళ్ళు పెద్దవి చేసి ,ఏంటే మరి ఇంత దారుణంగా ఉన్నాడు, నిన్ను ఇలా కాల్చుకు తింటున్నాడు, ఏదో మాల్లో తెలియక ఒక మాట అన్నందుకు అని అడుగుతుంది.