“ఏమో రా… ఆ ఊహే భయంకరంగా అనిపిస్తుంది.”
ఆమె మాటల్లోని బాధను అర్థం చేసుకున్న రాధిక ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఆరు, యష్‌లకు ఫోన్ చేసి వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలని అనుకుంది.
“వాళ్లని రమ్మని నేను యష్‌కి కాల్ చేసి చెప్తే…” అంటూ రాధిక ఆరుకి ఫోన్ చేసి చెప్పింది.
“వాళ్లు వస్తూనే ఉంటారు కావచ్చు” అన్నారు అరుణ్ గారు.
ఆ తర్వాత అందరూ కలిసి బాధలో ఉన్న కిషోర్ గారిని ఓదార్చడానికి ప్రయత్నించారు. ఎంత చెప్పినా, ఎంత ధైర్యం చెప్పినా ఆయన మాత్రం ఎవరి మాటలూ వినిపించుకోలేనట్టుగా సూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు.
కాసేపటి క్రితం వరకు అందరితో నవ్వుతూ, సరదాగా మాట్లాడిన మనిషి ఇప్పుడు ఇలా మారిపోవడం వాళ్లను మరింత కలచివేసింది. కిషోర్ గారిని అలా చూస్తుంటే ఏం మాట్లాడాలో, ఎలా ఓదార్చాలో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన బాధను తగ్గించలేమనే నిస్సహాయత వాళ్లందరినీ వెంటాడుతోంది.