అజేయ – 5
** అజేయ – 5 **
ఒక్కసారిగా ఆ చీకటి గదిలో ఒక పెద్ద బ్లూ లైట్ తో ప్రాజెక్టర్ ఆన్ అవుతుంది…
స్క్రీన్ మీద ఒక ఖడ్గం యొక్క త్రీ-డైమెన్షనల్ స్కెచ్ ప్రత్యక్షమవుతుంది… ఆ కత్తి మీద సింహం ఆకృతి లా ఉన్న పిడి, దాని బ్లేడ్ మీద ఉన్న వింత గుర్తులు చాలా స్పష్టంగా కనిపించాయి..
స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ ఖడ్గం యొక్క ఆ స్కెచ్ చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు..ప్రొఫెసర్ విలియమ్స్..
అతని చేతిలో ఉన్న పెన్ కింద పడిపోగా… అతను తన సీట్లోంచి లేచి మెల్లిగా ఆ ఆ హోలోగ్రామ్ దగ్గరకు వచ్చాడు..
“వెయిట్… రాఘవ్!
నువ్వు ఈ జామెట్రీ, ఈ స్కెచ్ ఎక్కడి నుండి కాపీ చేసావ్?
ఈ సింహం గుర్తు ఉన్న హిల్ట్ డిజైన్.. దాని చుట్టూ వున్నా స్నేక్..ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత వరకు పబ్లిష్ కాలేదు!
ఏ మ్యూజియంలోనూ దీని గురించి రికార్డ్స్ లో లేదు..
హౌ డిడ్ యు డ్రా దిస్?
అని అడిగాడు విపరీతమైన ఆశ్చర్యంతో..
రాఘవ్ ప్రొజెక్టర్ లైట్ వైపు చాలా కామ్‌గా చూస్తూ
“నేను దీన్ని ఎక్కడా కాపీ చేయలేదు ప్రొఫెసర్…
నేను దీన్ని చూశాను.” అని చెప్తాడు..
రాఘవ్ మాటలకి విలయమ్స్..
చూసావా?
ఎక్కడ?..
అని అడగడం తో..
” నా కలలో “.. అని అంటున్నా రాఘవ్ గొంతులో ఈసారి ఒక తెలియని పెయిన్ మరియు ఒక ఇంటెన్సిటీ కనిపించాయి..
రాఘవ్ తన బ్రెయిన్ ని టోటల్ గా అక్క్యూపై చేసిన ఆ డ్రీం గురించి తలుచుకుంటూ..
అంతలోనే తానేం అన్నాడో గుర్తు చేసుకున్న రాఘవ్.. నా డ్రీం ఇమాజినేషన్ లో అని అంటూ.. తననే చూస్తున్న విలయమ్స్ వైపు సూటిగా ఒకసారి చూసి.. మనసులో..
గడిచిన ఆరు నెలలుగా ప్రతి రాత్రి నాకు ఒకే కల వస్తోంది.. ప్రొఫెసర్… ఆ కలలో ఏదో ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది..
అందులో నన్ను ఎవరో చంపేస్తున్నారు.. నేను చనిపోయే ఆఖరి క్షణంలో ఈ కత్తి నా కళ్లముందు కనిపిస్తుంది..
నా రక్తం దీని మీద పడగానే ఇది మాయమైపోతుంది.. అని అనుకుంటూ…అండ్ దేర్ ఈస్ ఎ గర్ల్… తను ఏడుస్తూ నన్ను పిలుస్తోంది..
ఆ కల కేవలం ఒక ఇల్యూజన్ కాదు ప్రొఫెసర్..నా బ్రెయిన్ ఊరికే భ్రమల్ని నమ్మదు..ఆ కలలో కనిపించే ప్రతి పిల్లర్ డిజైన్, ఆ ఆర్కిటెక్చర్ 100% రియల్.. అని మనసులో గట్టిగా అనుకుంటున్న రాఘవ్ ..
ప్రొఫెసర్ విలయమ్స్ ని చూస్తూ..నా సబ్‌కాన్షియస్ మైండ్ నన్ను ఒక పర్టికులర్ థింగ్స్ కి గైడ్ చేస్తోంది.. అని అంటాడు..
విలియమ్స్ రాఘవ్ మాటలకి అతని వైపు వింతగా చూసాడు.. అతనికి రాఘవ్ కళ్లల్లో కనిపిస్తున్న ఆ కన్విక్షన్ ని చూస్తూ.. రాఘవ్ కి ఏదో తెలుసు అనుకోని..
మే బీ తను వెతికే దాని గురించి అతనికి తెలుసు ఏమో అని అనుకున్న విలయమ్స్ నిమిషం కూడా ఆలస్యం చేయకుండా…,
ఇది కేవలం ఒక స్టూడెంట్ ఇమాజినేషన్ కాదు అని అతనికి అర్థమవ్వడం తో….
రాఘవ్‌కి తెలియకుండానే అతనిలో ఏదో ఒక ప్రాచీనమైన కనెక్షన్ ట్రిగ్గర్ అయిందని..
రాఘవ్ ఏమ్ చెప్పకపోయినా.. అతని మనసులో జరుగుతున్న ఆ సంఘర్షణ విలియమ్స్ కి ఆ క్షణమే స్పష్టమైంది..
వెంటనే ప్రొఫెసర్ విలియమ్స్ ముఖంలో కోపం పోయి, ఒక రకమైన సీరియస్‌నెస్ వచ్చింది..అతను తన టేబుల్ వెనుక ఉన్న ఒక సీక్రెట్ ఐరన్ లాకర్ ఓపెన్ చేసాడు..
అందులోంచి బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి, బాగా పాతబడిపోయిన ఒక డైరీని బయటకు తీసాడు..
దాని కవర్ పేజీ మీద
‘Confidential – 1857: Madras Presidency’ అని రాసి ఉంది..
విలయమ్స్ ఆ డైరీని రాఘవ్ ముందు పెట్టి, కొన్ని పేజీలు తిరగేసి ఒక చోట ఆపాడు.. అక్కడ ఒక దట్టమైన అడవి, దాని మధ్యలో ఉన్న కొన్ని వింత శిథిలాల బొమ్మ చేత్తో గీసి ఉంది..
ఆ బొమ్మలోని పిల్లర్స్ డిజైన్ ని చూడగానే రాఘవ్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది..ఎందుకంటే ప్రతి రాత్రి అతని కలలో వచ్చే పిల్లర్స్ అవే!
రాఘవ్ ఫేస్ నే తిక్షణం గా చూస్తున్న విలయమ్స్ రాఘవ్ ప్రతి ఎమోషన్ ని గమనిస్తూనే ఉంటాడు..
రాఘవ్, నేను నిన్ను ఇన్సల్ట్ చేయడం లేదు.. బట్ ఐ వాస్ జస్ట్ టెస్టింగ్ యువర్ నాలెడ్జ్.. అన్నాడు విలియమ్స్ చాలా లో వాయిస్‌లో..
“నువ్వు డ్రా చేసిన ఈ ఖడ్గం యొక్క ఆనవాళ్లు, ఈ పిల్లర్ డిజైన్స్… ఈ సీక్రెట్ బ్రిటిష్ రిపోర్ట్‌తో 100% మ్యాచ్ అవుతున్నాయి..
ఇవి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అహోబిలం అడవులు..అని చెప్తుంటే..
రాఘవ్..!! ఆ పేజీల మీద ఉన్న అక్షరాలను తన చేతితో తాకి చూసాడు… అహోబిలం … ఆ పేరు వినగానే అతని ఒంట్లో ఒక వింత చలనం వచ్చింది..
* * * * * * * * * * * * * * * * * * * * * *
𝚃𝚘 𝚋𝚎 𝚌𝚘𝚗𝚝𝚒𝚗𝚞𝚎𝚍…🌸 🕊️
Swipe left/right or tap the sides to turn pages