ఆ రూమ్ దగ్గరకు వెళ్ళగానే డోర్ క్లోజ్ అయ్యి ఉండటం చూసి……..హ్మ్…. ఏంచేద్దాం…. నోక్ చేద్దామా…. ఏమైనా తప్పుగా… అనుకుంటడంటదా ……మళ్ళీ కోపంగా చూస్తడా మన వైపు …. అనుకుంటూ….. అమ్మో నాక్ ఎందుకు లే ఈ తలనొప్పి…..అని ప్రేమ్ వెనక్కి తిరగగానే….
అదే క్షణంలో… ఆ రూమ్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంది…
*******************
ఆ డోర్ నెమ్మదిగా తెరుచుకున్న శబ్దం వినగానే ప్రేమ్ గుండెలో ఆశ ఒక్కసారిగా మళ్లీ చిగురించింది.
“ఇప్పుడైనా ఆమె ముఖం కనిపిస్తుందేమో…” అనుకుంటూ ఆత్రుతగా ఆ వైపు తిరిగి చూశాడు.
కానీ… అతని కళ్ల ముందు కనిపించింది ఖాళీ ద్వారం మాత్రమే.అక్కడ ఎవ్వరూ లేరు.
“హ్మ్… అదేంటి? ఇప్పుడే కదా డోర్ తెరిచింది… మరి ఇంతలోనే ఎక్కడికి మాయమైపోయింది?” అని తనలో తాను అనుకుంటూ ప్రేమ్ అయోమయంగా ఆ గుమ్మం దగ్గర నిలబడ్డాడు.
ఆసక్తిని ఆపుకోలేక నెమ్మదిగా లోపలికి తొంగి చూస్తూ… మళ్లీ ఇంకొంచెం ముందుకు వాలి గదినంతా పరిశీలించడానికి ప్రయత్నిస్తున్నాడు.
పాపం… అది తన సొంత ఇల్లే అయినా, ఆ క్షణంలో మాత్రం దొంగలా దాక్కుంటూ గదిలోకి తొంగి చూడాల్సిన పరిస్థితి అతనికి వచ్చింది. 🙃
ఆ గదిలోకి ప్రేమ్ ఎంత జాగ్రత్తగా తొంగి చూసినా… అతని కంటికి కనిపించింది బెడ్, కొన్ని ఫర్నిచర్ వస్తువులు, గోడలపై ఉన్న అలంకరణలు మాత్రమే.
ఆమె జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు.
“వింతగా ఉందే…” అని మనసులో అనుకుంటూ అతను ఇంకా లోపలికి పరిశీలనగా చూస్తూనే ఉన్నాడు.
అలా అతని చూపులు గదినంతా వెదుకుతూ ఉండగానే…….