మై రాక్షస బాబు – 2
నాలో ఉన్న రాక్షసుడిని భరించడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి వాష్ రూం లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి…. తన ముందే డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు దృవ్….
కనీసం ఏడుపుని కూడా గొంతు దాటనివ్వని దృవ్ నీ గుర్తు చేసుకుంటూ నిర్జీవంగా బెడ్ మిద అలా పడి ఉంది ధన్విక …
……………
DK గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్……
రోల్స్ రాయిస్ కారు వేగం దూసుకొని వచ్చి ఆ కంపెనీ ముందు ఆగింది..అందులో నుంచి స్కై బ్లూ కలర్ కోట్ లోపల వైట్ కలర్ షర్ట్ వేసుకొని 6 ప్యాక్ బాడీ తో ఉన్న మన దృవ్ స్టైల్ గా దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు..
అప్పటి వరకు గోల గోలగ ఉన్న ఆఫీసు ఎంప్లాయీస్ అందరు ఒక్కసారిగా ఎవరి సీట్స్ లోకి వాళ్ళు వెళ్లి వర్క్ చెయ్యడం స్టార్ట్ చేసారు… సడెన్గా అక్కడ వాతావరణం అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ తో నిండిపోయింది..
ధృవ్ లిఫ్ట్ ఎక్కి 40 అంతస్తుల ఆఫీసు లో తన ఫ్లోర్ నెంబర్ 36 నెంబర్ ప్రెస్ చేసి నైట్ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు… ఈ లోపు లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడం తో లిఫ్ట్ నుంచి బయటికి తన ఛాంబర్ లోకి వెళ్లి , తన సీట్ లో కూర్చొని ఎవరికో కాల్ చేసి పది నిమిషాలు మాట్లాడి కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు..
ఈ లోపు దృవ్ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ మున్నా అతని ఛాంబర్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తాడు.. కమిన్ అని రోజు కంటే ఇంకా కొంచం గంభీరంగా వినిపించిన స్వరానికి మున్నా కొంచం భయంగానే లోపలికి వెళ్తాడు..
మున్నా నీ అక్కడ చూసిన దృవ్ అయోమయంగా ఫేస్ పెట్టీ నువ్వు ఎంటి ఇక్కడ…? నిన్ను నేను ఫాం హౌస్ దగ్గర ఉండమని చెప్పాను కదా..? అక్కడ ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు..? అని అడిగాడు కోపంగా..
దుబాయ్ నుంచి మార్టిన్ వచ్చాడు బాస్ సో మార్టిన్ నీ అక్కడ కాపలా పెట్టీ నేను మీ కోసం ఇక్కడికి వచ్చాను…అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది… ఆ ధక్షయ్ ఏదో ప్లాన్ చేసి ఆ గవర్నమెంట్ ప్రాజెక్టు నీ దక్కించుకోవాలని అని ట్రై చేస్తున్నాడు అని తెలిసింది..
ఈ రోజు ఫారినర్స్ తో హోటల్ కృష్ణా తాజ్ లో లంచ్ కూడా ఆరెంజ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది…లంచ్ తర్వాత వాళ్ళతో ఏదో ప్రాజెక్టు గురించి లీగల్ గా డిస్కస్ చేసి ఏదో కాంట్రాక్టు కూడా సైన్ చేస్తారు అని తెలిసింది… అని అతను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ అంతా దృవ్ కి చెప్పాడు మున్నా…
ధృవ్ ఆలోచిస్తూ ” హు సరే అని మాత్రమే అని ఇంకా నువ్వు హాస్పటల్ దగ్గరికి వెళ్ళు ” అని చెప్పి సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు…
ఒకే బాస్ అని మున్నా అక్కడ నుంచి హాస్పటల్ దగ్గరికి వెళ్ళిపోయాడు..మున్నా అలా వెళ్ళగానే దృవ్ కి ఫోన్ కి కాల్ వచ్చింది… ధృవ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అని అన్నాడు ఛాల గంభీరంగా..
సార్ ఇక్కడ గెస్ట్ హౌస్ లో ఉన్న మేడం సిట్యువేషన్ అసలు ఏం బాలేదు అంట.. మెయిడ్స్ ఎంత లేపిన మేడం అసలు లేగవడం లేదు అంట…అని ఇంకా ఏదో రెండు నిమిషాలు మాట్లాడాడు..
నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పి కోపంగా పిడికిలి బిగించి టేబుల్ మిద ఒకసారి గుద్ది ” ఎందుకే..?? ఎందుకే..?? నీకు ఇంత పొగరు… నైట్ అంత జరిగిన కూడా నీకు కొంచం కూడా బుద్ధి రాలేదా…? ఇప్పుడే నీ పని చెప్తా అంటూ కోపంగా అక్కడ నుంచి గెస్ట్ హౌస్ కి స్టార్ట్ అయ్యాడు..
గెస్ట్ హౌస్ కి వెళ్ళడానికి అంటే ముందు ఎక్కడికో వెళ్లి అక్కడ ఒక వ్యక్తి నీ కలిసి ఏదో పది నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత గెస్ట్ హౌస్ కి వెళ్ళాడు…
………..
గెస్ట్ హౌస్ ( బంగ్లా )
ధృవ్ ఆఫీసు కి వెళ్లిపోయిన తర్వాత బెడ్ మిద నిర్జీవంగా పడి ఉన్న ధన్విక బాడీ అంతా విపరీతం అయిన నొప్పులు పుడుతూ ఉంటే కనీసం తన చేతి వేళ్ళని కూడా కధపలేకపోతుంది…
కనీసం తన గొంతు లో నుంచి ఏడుపు సౌండ్ కూడా బయటికి రావడం లేదు..కానీ కన్నీళ్లు మాత్రం కంటి కొనలు నుంచి జారి అలా బెడ్ మిద పడుతున్నాయి..
ఇన్ని రోజులు నేను చూసిన దృవ్ గారు మీరు కాదు సార్…మీకు ఆడ పిల్లలు అంటే ఎంత కోపం , అసహ్యం ఉందో తెలిసి కూడా మీ పి. ఏ గా జాయిన్ అయ్యి మూడు సంవత్సరాల నుంచి మీతోనే ఉన్న నా గురించి…. నా వ్యక్తిత్వం గురించి మీకు తెలియదా సార్…??
నేను శారీరక సుఖం కోసం మిమల్ని పెళ్లి చేసుకున్నాను అని మీరు అంటుంటే నా గుండె ఎంత రంపపు కోతకు గురి అయ్యిందో నాకే తెలుసు….నాకు డబ్బు లేకపోయినా ఆత్మాభిమానం , ఆత్మగౌరవం ఉన్నాయి…నేను మిమల్ని డబ్బు కోసమో లేదా శారీరక సుఖం కోసమో పెళ్లి చేసుకోలేదు…
నేను మిమల్ని ఎదిరించి మరి పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న భలం అయిన కారణం అని తన మనసు లో అనుకుంటూ ఉండగా తనకే తెలియకుండా స్పృహ తప్పి పడిపోయింది ధన్విక…..
ఒక పది నిమిషాలకి మైడ్స్ ఆ రూం లోకి వెళ్లి రూం అవతారం అండ్ ధన్విక పరిస్థితి చూసి వాళ్ళకే ఒక్క క్షణం భయం వేసింది…
తెల్లటి బెడ్ మిద ఎర్రటి రక్తపు మరకలు , చెల్ల చెదురుగా పడి ఉన్న బట్టలు , పగిలిపోయి ఉన్న గాజు వస్తువులు…..అన్నింటికీ మించి అసలు బ్రతికే ఉందా లేక చనిపోయిందా అన్నట్టు నిర్జీవంగా బెడ్ మిద పడి ఉన్న ధన్విక నీ చూడగానే ఆ ఇద్దరు మేయిడ్స్ కి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..
వేగంగా లోపలికి వెళ్లి ధన్విక ఒంటి మిద బెడ్ షీట్ గట్టిగా కప్పి….తన కందిన చెంప చూస్తూ ” మేడం మేడం లేవండి ” అని తనని లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు…
ఎంత ట్రై చేసినా కూడా ధన్విక లో అసలు చలనం లేకపోయే సరికి ఇద్దరికీ భయం వేసింది…వెంటనే ఆ గెస్ట్ హౌస్ లో ఉండే దృవ్ పర్సనల్ బాడీ గార్డ్స్ లో ఒకరు అయిన మార్కస్ కి కాల్ చేసి విషయం చెప్పి…ఒకరు ఏమో రూం అంతా క్లీన్ చేసి బెడ్ షీట్ మార్చేస్తే…
ఇంకో మెయిడ్ ఏమో ధన్విక నీ మెల్లిగా లేపి వాష్ రూం లోకి తీసుకొని వెళ్లి స్నానం చేయించి డ్రెస్ వేసి మళ్ళీ బెడ్ మిద పడుకోబెట్టింది…
ధన్విక కి స్నానం చేయిస్తున్నప్పుడు తెల్లటి తన ఒంటి మిద పచ్ఛగా మెరిసిపోతున్న తాళి బొట్టు తో పాటు … నైట్ దృవ్ క్రూరత్వానికి గుర్తుగా కనిపిస్తున్న మార్క్స్ ( గోటి గుర్తులు , పంటి గాట్లు) చూసి ఆ మెయిడ్ కళ్ళల్లో నీళ్ళు ఆగకుండా బయటికి వచ్చాయి…
మా సార్ అమ్మాయిల విషయం లో మరి ఇంత క్రూరంగా ఉంటార…??? అని తనలో తానే అనుకొని దన్విక మిద జాలి పడింది..
మెయిడ్ ధన్విక నీ తీసుకొని వచ్చి అలా బెడ్ మిద పడుకోబెట్టింది అప్పుడే కోపంగా డోర్ బద్దలు కొట్టినట్టే ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు దృవ్… దృవ్ నీ చూడగానే ఆ మెయిడ్స్ ఇద్దరు భయం తో అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయారు…
అప్పుడే ఒక లేడీ డాక్టర్ కూడా లోపలికి వచ్చి భయం భయంగా దృవ్ నీ చూస్తూ ఉంటె….నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు…ఇంకో రెండు గంటల్లో అది కళ్ళు తెరవాలి లేదు అంటే నువ్వు ఈ లోకాన్ని చూడడానికి కళ్ళు లేకుండా చేస్తా అని బెదిరించి బయటికి వెళ్ళిపోతాడు…
ఆ లేడీ డాక్టర్ భయపడుతూ ధన్విక దగ్గరికి వెళ్లి తనని చెక్ చేసి వెంటనే ఒక ఇంజెక్షన్ చేసి , అలాగే ఒక సెలైన్ కూడా రెడీ చేసి దన్విక కి సెలైన్ ఎక్కించి….కొన్ని టాబ్లెట్స్ అవి రాసి అక్కడ మెయిడ్ నీ పిలిచి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి…. అవి తీసుకొని రమ్మని చెప్పి అలాగే హాట్ వాటర్ కూడా ఒక బౌల్ లో తీసుకొని రమ్మని చెప్పింది..
ఒక పది నిమిషాల తర్వాత మెయిడ్స్ ఇచ్చిన హాట్ వాటర్ అండ్ టాబ్లెట్స్ తీసుకొని ఆ టాబ్లెట్ దన్విక కి వేసి హాట్ వాటర్ తో ఏదో చేసి మొత్తానికి రెండు గంటల్లో దన్విక స్పృహలోకి వచ్చేలా చేసింది లేడీ డాక్టర్…
కరెక్ట్ గా మళ్ళీ రెండు గంటల తర్వాత రూంలోకి వచ్చి చూసిన దృవ్ కి అప్పుడే మేలుకువలోకి వచ్చిన దన్విక కనపడగానే ఆ డాక్టర్ నీ ఒకసారి చూసి ” గుడ్ ఇచ్చిన టైం లో పని కంప్లీట్ చేసావ్ కాబట్టి బ్రతికి పోయావ్…. నౌ యూ కెన్ గెట్ లాస్ట్ హియర్ ” అని అరిచాడు..
ఆ డాక్టర్ భాగంగా తన బ్యాగ్ పట్టుకొని అక్కడ నుంచి బతుకు జీవుడా అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది…
దృవ్ బెడ్ మిద ఉన్న ధన్విక నీ కోపంగా చూస్తూ తన దగ్గరికి వెళ్తూ ఉన్నాడు..
ధన్విక భయం భయంగా దృవ్ నీ చూస్తూ ఉంది…
ఇప్పుడు దృవ్ ఏం చెయ్యబోతున్నాడు ధన్విక నీ..??
నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం…
To be continued….
Swipe left/right or tap the sides to turn pages