New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై రాక్షస బాబు – 3

మై రాక్షస బాబు – 3

 

 

దృవ్ బెడ్ మిద ఉన్న ధన్విక నీ కోపంగా చూస్తూ తన దగ్గరికి వెళ్తూ ఉన్నాడు..

 

 

ధన్విక భయం భయంగా దృవ్ నీ చూస్తూ ఉంది…

 

 

ధృవ్ ధన్విక దగ్గరగా వెళ్ళి ఇప్పుడు అయినా చెప్పు అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు…??? అని అడిగాడు…

 

 

 

ధన్విక ఏం మాట్లాడకుండా కన్నీళ్ళతో సూటిగా మొదటి సారి దృవ్ కళ్ళల్లోకి చూసింది…

 

 

 

తను మాటలతో చెప్పలేని ఏదో భావాన్ని కళ్ళల్లో చూపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే రెండు నిముషాలు అలాగే ధన్విక కళ్ళల్లోకి చూసిన దృవ్ మళ్ళీ కోపంగా మారిపోతూ నీకు టూ డేస్ టైం ఇస్తున్నా మర్యాదగా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అన్న నిజం నువ్వే చెప్పు..

 

 

 

లేదు అంటే నైట్ పెట్టిన టార్చర్ కంటే ఇంకా ఎక్కువ టార్చర్ చూస్తావ్ అని బెదిరిస్తాడు…

 

 

 

అప్పటికి కూడా ధన్విక నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటికి రాదు..

 

 

 

ధృవ్ కి ఏమో కోపం పీక్స్ లోకి వెళ్తుంది..రంగమ్మ అని గట్టిగా ఒక్క కేక వేసాడు..అంతే కింద హల్ లో ఉన్న మెయిడ్ రంగమ్మ పరుగులాంటి నడకతో ఆ రూంలోకి వెళ్ళింది..

 

 

 

రంగమ్మ నీ చూసి ప్లేట్ నిండా భోజనం పెట్టుకొని తీసుకొని రా అని ఆర్డర్ వేసాడు..

 

 

 

రంగమ్మ సరే అని తల ఊపి అక్కడ నుంచి వెళ్ళిపోయింది..

 

 

పది నిమిషాల తర్వాత…

 

 

ధన్విక వొద్దు అంటున్నా వినకుండా బలవంతంగా తన నోట్లో భోజనం కుక్కుతున్న రంగమ్మ…

 

 

అది చూసి రాక్షసానందం పొందుతున్న దృవ్…

 

 

నేను అడిగిన ప్రశ్నకు నువ్వు ఎలాగో ఆన్సర్ చెప్పావు…..నువ్వు ఆన్సర్ చెప్పే వరకు నేను నిన్ను వదిలిపెట్టను…సో ఈ నైట్ కి ఫుడ్ బాగ తిని రెస్ట్ తీసుకో రేపు నైట్ మళ్ళీ నీ కోరిక తీరుస్తా…

 

 

 

నువ్వు హెల్తీ గా ఉంటేనే కదా నన్ను పొందాలి అన్న నీ కోరిక తీరుతుంది అండ్ నువ్వు శాటిస్ ఫై అయ్యావో లేదో నీకు తెలిసేది..

 

 

 

ఇంకో రెండు రోజుల్లో నువ్వు మళ్ళీ నా పీ ఏ పోస్ట్ లో రీ జాయిన్ అవ్వాలి…రెడీ గా ఉండు… ఈ దృవ్ తో ఎందుకు పెట్టుకున్నవ్ అని నువ్వు ఫీల్ అవ్వాలి….నిన్ను అంత ఈజీ గా వదలను.. అని కోపంగా చూస్తూ చెప్పి ఇంకో ప్లేట్ కూడా ఫుడ్ తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టు…అని ఆర్డర్ వేసాడు దృవ్..

 

 

 

అప్పటికే ధన్విక  ఆ ఒక్క ప్లేట్ ఫుడ్ తినలేక ఆపసోపాలు పడుతూ ఉంటే మళ్ళీ ఇంకో ప్లేట్ తెప్పించాడు… మెయిడ్ ఏమో వొద్దు అంటున్నా మళ్ళీ మళ్ళీ ఇంకా ఫుడ్ నోట్లో కుక్కుతూ ఉంది..

 

 

 

ఇంకా ధన్విక వల్ల కాక అక్కడే తిన్న ఫుడ్ మొత్తం వామిట్ చేసేసుకుంది…అసలే నీరసంగా ఉన్న తనని ఇంకా నీరసంగా మార్చేసేలా తిన్న ఫుడ్ అంతా వామిట్స్ రూపం లో బయటికి వచ్చేసింది..

 

 

 

అలా వామిట్స్ చేసుకుంటూ చేసుకుంటూనే మళ్ళీ నీరసం ఎక్కువ అవ్వడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది..

 

 

 

అలా బెడ్ మిద స్పృహ తప్పి పడిపోయి ఉన్న ధన్విక నీ చూసినప్పుడు  దృవ్ ఈగో కొంచం శాటిస్ ఫై అయ్యి అక్కడ అంతా క్లీన్ చెయ్యమని పని మనిషికి చెప్పి

 

 

 

దన్విక నీ అలాగే వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు….

 

………………..

 

 

అసలు మీరు చేసిన పని కరెక్ట్ ఓ రాంగ్ ఓ అర్ధం కావడం లేదు సార్…

 

 

ఆడ వాళ్ళు అంటేనే నచ్చని దృవ్ బాబు లైఫ్ లోకి ఆ అమ్మాయి నీ పంపించి అనవసరంగా ఆ అమ్మాయి జీవితాన్ని బలి చేశారు ఏమో అనిపిస్తుంది అని అంటాడు 50 ఏళ్ల వయసు ఉన్న మూర్తి గారు…

 

 

 

హాస్పిటల్ బెడ్ మిద పడుకొని ఉన్న కూడా ఏ మాత్రం రాజసం , దర్పం , టీవీ తగ్గకుండా బలిష్టంగా ఉండి తెల్లని నెరిసిన జుట్టు తో మెలి తిరిగిన కోర మీసాలతో పాత కాలం నాటి రాజు గారి టైప్ లో ఉన్న 70 ఏళ్ల పెద్దాయన మాట్లాడుతూ…

 

 

 

 

నా మనవడికి ఆడ వాళ్ళు అంటే గిట్టక పోవడానికి కారణం వాడి గతం లో ఉన్న ఇద్దరి ఆడవాళ్ళు… ఆ ఆడ వాళ్ళలో ఒకరు వాళ్ళ అమ్మ అయితే రెండోది వాడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి…

 

 

 

ఆ ఇద్దరు చేసిన పని వల్ల వాడు ఇంక జీవితం లో ఆడ వాళ్ళని దగ్గరికి రానివ్వడం లేదు…ఆడ వాళ్ళందరి మిద కోపం పెంచుకున్నాడు…

 

 

 

కానీ వాడికంటూ జీవితం లో ఒక తోడు ఉండాలి కదా…!!! వాడి అమ్మ ఎలాగో లేదు…నాన్న ఉన్నా కూడా లేనట్టే…ఇంకా వాడికంటూ ఉన్న ఒకే ఒక్క తోడు , బంధం నేనే…..

 

 

 

నేను ఇంకా ఎన్ని రోజులు బతికి ఉంటానో నాకే తెలియదు…నేను పోయిన తర్వాత వాడికంటూ  ఒక తోడు ఉండాలి కదా… నా మనవడికి అలాంటి ఒక తోడు ఆ అమ్మాయి…

 

 

 

ఆ అమ్మాయి నీ చూసిన తొలిసారీ నాకు అనిపించింది తను నా మనవడు జీవితం నీ మార్చడానికి వాడి జీవితం లోకి వచ్చింది అని..

 

 

 

అందుకే ఆ అమ్మాయి నీ వాడికి ఇష్టం లేకపోయినా పి ఏ గా అపాయింట్ చేశా…నేను అనుకున్నట్టే  వాడు ఆ అమ్మాయి నీ ముందు ఇబ్బంది పెట్టినా కూడా  మెల్లిగా వాడిలో మార్పు మొదలు అయింది..

 

 

 

రోజులో ఎనిమిది గంటలు వాడితో ఉంటేనే వాడిలో కొంత మార్పు తీసుకొని వచ్చింది అంటే ఇంకా వాడి లైఫ్ వాడి జీవిత భాగస్వామిగా ఉంటే…వాడిని పూర్తిగా మార్చగలదు అని నమ్మకం వచ్చింది…

 

 

ఇంకా వాడి లైఫ్ లో ఆడ వాళ్ళ మిద  వాడికి ఉన్న చెడు అభిప్రాయాన్ని దూరం చేసి వాడిని మామూలుగా మార్చగలుగుతుంది అని అనిపించింది…

 

 

 

అందుకే ఆస్తి , అంతస్తు గురించి ఆలోచించకుండా ఆ అమ్మాయి నీ నా మనవడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని అనుకున్నాను… నా అదృష్టమో లేకపోతే వాడి అదృష్టమో తెలియదు కానీ ఆ అమ్మాయి నేను అడిగిన వెంటనే  పెళ్లికి ఒప్పుకుంది..

 

 

 

నా మనవడు ఆ అమ్మాయి నీ పెళ్లి చేసుకోవద్దు అని బెదిరించి , తనకు డబ్బులు ఆశ చూపించిన కూడా ఆ అమ్మాయి వాడినే పెళ్లి చేసుకుంది…

 

నాకు తెలిసి వాడు బెదిరించిన కూడా బెదరకుండా వాడినే పెళ్లి చేసుకుంది అంటే ఆ అమ్మాయి కి నా మనవడు అంటే ఇష్టం ఉంది ఏమో…..అందుకే నా మనవడిని ఎదిరించి మరి పెళ్లి చేసుకుంది…

 

 

ఇప్పుడు చెప్పు నా మనవడిని ఇష్టపడి పెళ్ళి చేసుకున్న ఆ అమ్మాయి గొంతు నేను కోసాను అంటావా మూర్తి అని అడుగుతారు ఆయన…

 

 

ఆ అమ్మాయి ఇష్టం తో దృవ్ బాబు నీ పెళ్లి చేసుకొని ఉండొచ్చు కానీ దృవ్ బాబు కి అసలు ఆడ వాళ్ళు అంటేనే ఇష్టం ఉండదు కదా…!! పైగా పెళ్లికి ముందే ఆ అమ్మాయి నీ పెళ్లి చేసుకోవద్దు అని బెదిరించారు అంటే ఇప్పుడు ఆయన మాట కాదు అని ఆ అమ్మాయి పెళ్ళి చేసుకుంది అని ఆ అమ్మాయి నీ ఏం అయిన ఇబ్బంది పెడితే…????

 

 

 

అసలు పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయి నీ ఇప్పటివరకు తమరి ఇంటికి తీసుకొని వెళ్ళలేదు అంట… అసలు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో  కూడా తెలియదు అంట…!

 

 

 

నా అనుమానం ప్రకారం దృవ్ బాబు ఆ అమ్మాయి నీ బెదిరించి , భయపెట్టి ఎక్కడికి అయిన దూరంగా పంపించేసి ఉంటారు ఏమో…. లేకపోతే ఇంతకు ముందు దృవ్ బాబు ప్రేమించిన అమ్మాయి నీ మాయం చేసినట్టు ఈ అమ్మాయి నీ కూడా ఏం అయిన చేసి ఉంటారు ఏమో…??? అని తన డౌట్స్ నీ ఎక్స్ప్రెస్ చేస్తాడు మూర్తి…

 

 

 

 

ఆ పెద్దాయన కూడా మూర్తి గారి మాటలకు ఆలోచిస్తూ ఇప్పుడే నా మనవడికి కాల్ చేసి ఇక్కడికి పిలిపించూ మూర్తి..అలాగే రేపే నేను హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ప్యాలెస్ కి వెళ్ళడానికి ఫార్మాలిటీస్ చూడు అని గంభీరం అయిన స్వరం తో చెప్పి …..

 

 

 

ధృవ్ ప్రేమించిన అమ్మాయి నీ అతను ఏం చేశాడో గుర్తు చేసుకొని భయం , కంగారుతో గతం లోకి వెళ్ళిపోతారు ఆ పెద్దాయన…

 

 

To be continued….