ఓకే అని ఇంద్ర లేచి నిలబడితే కావాల్సిన ఫైల్స్ అన్ని తీసుకొని వెనకే వస్తున్న స్వర్ణ ని చూస్తూ నువ్వు నా కార్ లో రావడానికి వీళ్ళేదు… కానీ నేను రీచ్ అయ్యే లోపు నువ్వు కూడా అక్కడ ఉండాలి అని స్ట్రిక్ట్ గా చెప్పాడు…
అదేంటి సర్ అని ఇంకేదో అనే లోపు కార్ స్టార్ట్ చేసేసాడు ఇంద్ర…
వాడి రాయ్ ( రోల్స్ రాయస్ ) కంటే ముందు నా ప్లెషర్ ఎక్కడ వెళ్తుంది అని నీరు గారిపోయి వీడు కావాలనే ఎక్కువ చేస్తున్నాడు అని స్కూటీ పై స్టార్ట్ అయింది..
స్వర్ణ వెళ్లే సరికి ఇంద్ర ఆ కంపెనీ వాళ్ళతో డిస్కషన్ లో ఉన్నాడు… స్వర్ణ వెళ్లి చిన్న స్మైల్ తో సర్ ఫైల్ అని ఇస్తుంటే.. ఫాస్ట్ గా రావాలని తెలియదా అని సీరియస్ గా అనేసరికి టైం వాల్యూ తెలియని వాళ్ళకి జాబ్ ఇస్తే ఇలాగే ఉంటుంది అని ఒకరు అంటే ఇలాంటి అందమైన PA పక్కన ఉంటే టైం తో ఏమ్ పని అని మరొకరు అంటారు