మేడమ్ గారికి స్పైసి ఇష్టమని అక్కడున్న కూరలు చూడగానే అర్థం అయింది…
ఎలా???? అని అడిగాడు శ్రీరామ్
సీనియర్ మోస్ట్ షేఫ్ చేసినవి నచ్చట్లేదు అంటే మన తెలుగు వంటలు బాగా నచ్చుతాయ్ వాటిని మిస్ అవుతున్నారని అర్థం అయింది సర్ అందుకే టమాట పచ్చడి బీరకాయ పప్పు బెండకాయ ఫ్రై చేసి రసం పెట్టాను అని ఒక్కోటి వేస్తుంటే.. అన్ని టేస్ట్ చూసిన భానుమతి గారు రాముడు నాకు ఈ పిల్ల నచ్చిందిరా…. తన చేతి వంట ఇంకా బాగా నచ్చింది పైగా మన తెలుగు పిల్ల అని ముచ్చటగా చెప్తూ కడుపు నిండా తిన్నారు భానుమతి గారు….
రేయ్ రాముడు ఆ షేఫ్ ని తీసేసి ఈ పిల్ల కి వంట గది ఇచ్చేయ్… చూడు స్వర్ణ!!!!! నన్ను చూసుకోవాల్సింది ఏమి లేదమ్మ ఊర్లో నడుస్తూ జారీ పడ్డాను కాలు విరిగింది డాక్టర్ కాలుకి రెస్ట్ ఇవ్వమన్నారు ఆరు నెలలు… కాలు కదప కూడదు ఎటు నడవ కూడదు తీసుకొచ్చి ఈ వీల్ ఛైర్ లో పడేశాడు నా మనవడు అని చెప్పారు భానుమతి గారు…
ఓకే స్వర్ణ నీకు ఇష్టం అయితే వంట కూడా చేయ్ మా నానమ్మ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకువాలి కేర్ టేకర్ గా నేను ఇస్తాను అన్న శాలరీ నే కాదు కుక్ గా కూడా నీకు శాలరీ ఇస్తాను అన్నాడు శ్రీరామ్…
వద్దు సర్ మీరు ఇస్తున్న 60k లోనే నేను వంట కూడా చేస్తాను అంది…