New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అవధులు లేని ప్రేమ – 8

అవధులు లేని ప్రేమ – 8

             ఎనిమిదవ భాగం

 

 

నాధ్ నన్ను చూస్తూ లేచావా అప్పుడే ఇదిగో తాగు అని జ్యూస్ గ్లాస్ నా ముందు ఉంచాడు నేను తీసుకోకుండా నాధ్ వైపె చూస్తుంటే తను నాతో ఏంటి మీ క్యాంటీన్లో ఈ జ్యూస్ బాగోదా? సరే బయట నుంచి తెప్పించిన అని అడుగుతున్నాడు నేను మాట్లాడే లోపు ఛోటు వచ్చి నాధ్ భాయ్ అర్జెంట్ వర్క్ వెళ్లాలి మనం ఇప్పటికే చాలా సార్లు  ఫోన్ చేశారు అని చెప్పాడు అప్పుడే ఛోటు వెనకనుంచి కళ లోపలికి వచ్చింది

 

నాధ్ ఛోటు నీ సీరియస్గా చూసి నా వైపు తిరిగి సరే సాయంత్రం కలుస్తాను అని చెప్పి ముందుకు కదిలాడు నేను వెంటనే నాకు కుదరదు నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి నాన్న గుడికి వెళ్దాం అన్నాడు అని చెప్పాను

 

నాధ్ సైడ్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు నాధ్ వెళ్లిపోయాక కళ ఏంటి నేను గుడికి వెళుతున్నాను అని ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్ అంటే అతన్ని గుడికి రమ్మని చెప్తున్నావా అని నన్ను అడిగింది

 

నేను కళావైపు తిరిగి నీకేమన్నా పిచ్చా అతను కలుస్తాను అంటే నాకు కుదరదు అని నేను ధైర్యంగా సమాధానం చెప్పాను అన్నాను

 

కళ సీరియస్ గా అదలా లేదమ్మా నేను గుడికి వెళుతున్నాను నువ్వు కూడా రా అని చెప్పినట్టుంది అయినా మీరు మీరు బాగా దగ్గరయ్యాక నాకెందుకు అంది

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue