అజిత్ అలా అరవగానే అందరు అలానే చూసారు ఏమైంది అని….ఏమైంది అజ్జు…. ఇది ఏంటి…. ఏముంది నాకు అర్ధం కాలేదు….
ఇద్దరికి కలిపి ఒకటే ఎందుకు వేశారు…. అది ఆనవాయితీ రా…. మీ ఇద్దరు వేర్వేరు కాదు ఇద్దరు ఒక్కరే అని తెలిపే తంతు ఇది….
అమ్మ తన ఇష్టం తనది…. నా ఇష్టం నాది…. అలాంటిది ఇద్దరినీ ఒకేదానిలో తినమనడం ఎంత వరకు కరెక్ట్…. అది కాదు నాన్న…. ప్చ్ అమ్మ ప్లీజ్ ముందు ఇలా తీసేయండి….
అది కాదు రా…. అమ్మ ఇప్పుడు ఇందులో మేము అడ్జస్ట్ అయ్యి తినాలా…. ఇందులో తను కచ్చితంగా నాకు నచ్చిందే తింటది…. తనకి అది నచ్చకపోయినా….
అలా నాకు ఇష్టం లేదు అమ్మ…. లేదా తన కోసం నేను అడ్జస్ట్ అవ్వాలి…. ఈ రెండిటిలో ఏది జరగదు అని చెప్పి తినకుండా వెళ్ళబోతే…. ఏవండీ మీరు అలా వెళ్తే…. చూడు జనని నాకు ఇలాంటివి నచ్చవు….
అలాగే ఇలా నచ్చకపోతే…. మీకు నచ్చింది మీరు తినండి…. నాకు నచ్చింది నేను పెట్టుకొని తింటాను…. అంతే కానీ ఇలా మధ్యలో లేచి వెళ్ళకండి అనింది కళ్ల నీళ్లతో….