New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఈ రాధాకృష్ణార్పణం ❤️🦚 – 7

ఈ రాధాకృష్ణార్పణం ❤️🦚 – 7

ఈ రాధాకృష్ణార్పణం ❤️
ఎపిసోడ్ 7 — ఆ ఫోన్ వెనుక రహస్యం!

రాధ వెళ్లిపోయిన వైపే చూస్తూ నిలబడిపోయాడు కృష్ణ.

తన ప్రేమను నమ్మిన అమ్మాయి కళ్లలో మొదటిసారి తన మీద అనుమానం కనిపించింది. ఆ చూపు అతన్ని లోపల నుంచి కలచివేస్తోంది.

ఫోన్ మళ్లీ మోగింది.

ఈసారి విసుగ్గా ఫోన్ తీసి మాట్లాడాడు.

ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇప్పుడు నాకు ఫోన్ చేయొద్దని చెప్పానుగా!

అవతలి వ్యక్తి ఏదో చెప్పడంతో కృష్ణ ముఖం మారిపోయింది.

ఏంటి? మళ్లీ ఇక్కడికే వస్తున్నావా? వద్దు… నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు. అసలే పరిస్థితులు బాగోలేవు. ఇప్పుడు నువ్వు కనిపిస్తే మరిన్ని సమస్యలు వస్తాయి.

అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

కానీ అతనికి తెలియదు… కొద్దిదూరంలో నిలబడి ఉన్న రామమూర్తి అతని మాటల్లో కొంత విన్నాడని!

ఇంటికి చేరుకున్న రాధ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది.

కృష్ణ తనను మొదటిసారి చూసిన రోజు నుంచి జరిగిన ప్రతి సంఘటన కళ్లముందు కదిలింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue