శనివారం సాయంత్రం…
మేఘన అద్దం ముందు నిలబడి రెడీ అవుతోంది. ఈరోజు ఆఫీస్ ప్రాజెక్ట్ టీమ్ డిన్నర్ ఉంది. ఆదిత్య మాత్రం హాల్లో కూర్చుని తన వాచ్‌ని పదే పదే చూస్తున్నాడు.
“ఆదిత్యా… రెడీనా?” అంటూ మేఘన బయటకు వచ్చింది.
ఆదిత్య తలెత్తి చూశాడు.
“హా… వెళ్దాం.”
“ఏంటి? ఈరోజు పొగడ్తలు లేవా?”
“ప్రతిరోజూ ఒకే మాట చెప్పాలా?”
“అంటే రోజూ బాగుంటానని ఒప్పుకుంటున్నారా?”
“నీతో మాట్లాడటం కష్టం.”
“అయినా మాట్లాడుతున్నారు కదా!” అంటూ నవ్వింది మేఘన.