సోమవారం ఉదయం…
మేఘన వంటగదిలో బ్రేక్‌ఫాస్ట్ తయారు చేస్తోంది. ఆదిత్య మాత్రం చాలా సీరియస్‌గా ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.
“సర్, నేను ఆలోచించుకున్నాను. ఈ ఆఫర్ నాకు ఓకే. వచ్చే నెల నుంచి బెంగళూరు బ్రాంచ్‌లో జాయిన్ అవుతాను.”
ఆ మాటలు విన్న మేఘన చేతిలోని గరిటె ఆగిపోయింది.
ఆదిత్య కాల్ ముగించి హాల్‌లోకి వచ్చాడు.
“ఆదిత్య!”
“చెప్పు.”
“మీరు బెంగళూరు వెళ్తున్నారా?”
అతను ఆశ్చర్యంగా చూశాడు.
“నువ్వు విన్నావా?”
“అంటే నిజమేనా?”
“అవును. ఆఫీస్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ప్రమోషన్ కూడా ఉంటుంది.”