మనం పెళ్లి కుదిర్చిన అమ్మాయి ఒకరు, అగస్త్య పెళ్లి చేసుకున్న అమ్మాయి మరొకరు. అసలు ఆ అమ్మాయి ఎవరు? పెళ్లికూతురు స్థానంలోకి ఎలా వచ్చింది?
ఇవన్నీ తలుచుకుంటుంటేనే మనసంతా గందరగోళంగా ఉంది అని ఆందోళనగా చెప్పింది. ఆమె మాటలు విన్న ప్రతాప్ కూడా నిట్టూరుస్తూ నాకూ అదే అర్థం కావడం లేదు.
ఇంత పెద్ద విషయం జరిగితే కనీసం మనకు ఏదో ఒక సమాచారం అయినా ఉండాలి కదా,అసలు అగస్త్యకు ఈ విషయం ముందే తెలుసా లేక పెళ్లి మండపంలోనే జరిగిందా అన్నది కూడా తెలియడం లేదు.
వాడు కిందకు వచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చోబెట్టి అడగాలి అన్నాడు. అప్పటివరకు వాళ్ల మాటలను మౌనంగా వింటున్న రామచంద్ర గారు అవును ముందు అగస్త్యను అడిగి ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఏ విషయం గురించైనా ఒక నిర్ణయానికి రావాలంటే అసలు నిజం తెలియాలి, ఆ అమ్మాయి ఎవరో తెలియకుండా తన గురించి మనం ఏమీ అనుకోవడం సరికాదు అని గంభీరంగా చెప్పారు.
పక్కనే కూర్చున్న సావిత్రి గారు కూడా తల ఊపుతూ నిజమే పెళ్లి మండపంలో ఏం జరిగిందో మనకు పూర్తిగా తెలియదు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో కూడా మనకు తెలియదు….